బిడ్డ కడుపులో పడగానే అందరిలాగే లకావత్ రాధ ఎన్నో కలలు కన్నది. నెలలు నిండుతున్న కొద్ది సంతోషపడ్డది. కానీ మొదటిసారి కాన్సుకు ప్రైవేటు ఆస్పత్రిలో 20వేల దాకా అయిన బిల్లును గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందింది. కారు డ్రైవర్ అయిన తన భర్త అంత డబ్బు ఎక్కడినుండి తెస్తాడు. మళ్లీ అప్పు చేయాల్సిందేనా? అని భయపడ్డది. అంతలోనే జిల్లా ంద్రంలోని మాత శిశు ఆరోగ్య ంద్రం గురించి తెలుసుకొని నెలలు నిండడంతో నాలుగు రోజుల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పైసా ఖర్చు లేకుండా పురుడుపోసి, తిరిగి తనకి సీేఆర్ కిట్‌కింద రూ. 12వేలు ఇవ్వడంతో సంతోషపడుతున్నది.
కరీంనగర్ జిల్లా ంద్రంలో మాతా, శిశు ఆరోగ్య ంద్రంలో ప్రైవేటుకు దీటుగా అధునాతన వైద్యం, తల్లీబిడ్డలకు సేవలందుతుండగా, ఇక్కడే డెలివరీ చేయించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్రనుంచి గర్భిణులు ూ్య కడుతున్నారు.
జిల్లాలో బర్త్ రేటు ఏడాదిలో 13వేలదాకా ఉంటున్నది. అంటే నెలకు సగటున వేయినుండి 1200 ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటులో సుమారు 65మంది స్త్రీ వైద్య నిపుణులున్నారు. మాతా శిశు, ఆరోగ్య ంద్రం ప్రారంభానికి ముందు వీరంతా క్షణం తీరికలేకుండా బిజీగా వుండేవారు. కానీ ఇప్పుడు తక్కువ ఖర్చుతో సుఖ ప్రసవాలు చేస్తామని ప్రకటనలు ఇచ్చుకోవాలసిన పరిస్థితి వచ్చింది. వేలం నాలుగు నెలల్లోనే మాతా, శిశు ఆరోగ్య ంద్రం ఎంతటి ప్రభావం చూపిందో దీన్నిబట్టి అర్థమవుతుంది. సీేఆర్ కిట్ ఒక్క పేదలనే కాదు మధ్య తరగతి వారిని ూడా మాతాశిశు ఆరోగ్య ంద్రానికి రప్పిస్తున్నది. పైసా ఖర్చు లేకుండా సుఖ ప్రసవాలు కావడం, అందుతున్న మెరుగైన సేవల తీరును ఇప్పుడు అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నది. ఈ కారణంగానే ప్రసవం కోసం ఇక్కడికి పరుగులు పెడుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సర్కారు కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య ంద్రానికి మందులు సరఫరా చేస్తున్నది. మిగతా జిల్లాలో ఉన్న ంద్రాలకు ఔషధ గోదాములనుంచి మందులు సరఫరా చేస్తున్నా ఇక్కడికి మాత్రం ప్రతి 3 నెలలకోసారి 10 లక్షల విలువైన మందులు నేరుగా అందుతున్నాయి.
కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య ంద్రం కార్పొరేటుకు దీటుగా ఉన్నది. ఇందులో మెరుగైన వైద్య సేవలతోపాటు, సీేఆర్ కిట్లు ఇవ్వడంతో ప్రసవాల సంఖ్య చాలా వరకు పెరిగాయని, దీనితోపాటు ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు చేయించుకున్న వారికి ప్రోత్సామకరంగా మగ శిశువు అయితే 12వేలు, ఆగ శిశువు అయితే 13వేలు ప్రభుత్వం ఇస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానపై ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడడంతో డెలివరీల సంఖ్య పెరిగింది.
ఎన్.వెంకటేశ్వర్లు