డా|| వీరేందర్‌

  •  హుస్సేన్‌ బోల్ట్‌ ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో సాధించాడు.దానికోసం ఆయన తీసుకున్న సమయం వేలం 10 సెకన్లలోపే.
  • ఫెల్స్‌ ఈతలో, యింకా రకరకాల ఈవెంట్స్‌లో 12 బంగారు పతకాలు ఒలింపిక్స్‌లో సాధించినపుడు ప్రతి ఈవెంట్‌లో ఆయన నీటిలో ఈదినందుకు పట్టిన సమయం ూడా సెకన్లు మాత్రమే.
  • క్రిట్‌ె దిగ్గజాలు క్రీజ్‌లో వుండి శతకాలు కొట్టినా, విట్లుె తీసినా చాలా తక్కువ గంటలు మాత్రమే గ్రౌండ్‌లో వుంటారు.
  • అరుణారెడ్డి జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని అందుకుంది. తన ప్రతిభ చూపడానికి పట్టిన సమయం ూడా 30 సెకన్లు మాత్రమే.
  • మహారాష్ట్రలో 30వేలమంది రైతులు ఒ మాటగ, ఏ మాత్రం అలజడిలేకుండా మౌనంగా 200 కి.మీ. ప్రయాణం చేసి ముంబైలో వాళ్ళ నిరసన చూపించడానికి పడ్డ శ్రమ 5 రోజులు నడక.
  • పై అన్నింటిని చూస్తే అబ్బ ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ప్రతిభను ఎలా ప్రదర్శించగలిగారు. ఎక్కడ నుండి ఆ శక్తి వచ్చింది. అలా ఆ కొద్ది మంది ఎలా! సాధ్యం అయ్యింది. అని ప్రశ్నించుకుంటే ప్రతి ప్రదర్శన వెనుక కొన్నివేల గంటల శ్రమ వుంటుంది, చాలామంది ఆలోచనలుంటాయి, సలహాలు వుంటాయి, వ్యూహాలుంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రదర్శన ఇస్తున్నారు అంటే ఎక్కువ శ్రమించారని అర్థం.
  • హుస్సేన్‌ బోల్ట్‌, ఫెల్ఫ్స్‌ వందల గంటలు గ్రౌండ్‌లో, నీటిలో సాధన చేశారు.

tsmagazineరన్నర్‌లు, స్విమ్మర్లు కొన్ని సంవత్సరాలనుండి సాధన మొదలుపెడతారు. తక్కువ సమయంలో, ఉన్న శక్తిని సమయానికి విడుదల చేయడానికి సంవత్సరాల తరబడి చేసిన శ్రమ. వలన శరీరంలోని ప్రతి కండరంలో నిల్వ చేసి వుంచినట్టుగా, అలాగే ప్రతిరోజు చేసే శ్రమవలన ఈ శక్తి రిజర్వాయర్‌లు అన్ని నిండుకుండల్లా నింపి పెట్టి ఫైనల్‌ రోజు శరీరంలో వున్న ప్రతి కండరంలో నిల్వవున్న శక్తి రిజర్వాయర్‌లకు వదిలిపెడతారు. ఇహ అప్పుడు శరీరంలో ప్రతి కణం శక్తివంతమైన కణంగా మారి అతని ఆలోచనకు అనుగుణంగా వేగాన్ని అందుకుని శరీరాన్ని రెట్టించిన వేగంతో ముందుకు తీసుళ్లిె విజేతగా నిలబెడుతుంది. ఏ క్రీడాకారుడైనా ఇదే పద్ధతి. అలాగే విద్యార్థులైన సరే! 3 గంటల పరీక్షలో మన ప్రదర్శన బాగుండాలి. అంటే కొన్ని వందల గంటలు సాధన చెయ్యాలి. ఎందుకు చెయ్యాలో, చేస్తే ఏమి వస్తుందోఒక స్పష్టత వుండాలి. లక్ష్యం స్పష్టంగా దర్శించగలిగినపుడు, ఎంత శ్రమించాలో మనకు అర్థం అవుతుంది. శ్రమించే పద్ధతులను నేర్చుకుని సాధన మొదలు పెడితే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలుగుతాము.

ముంబైలో రైతుల ప్రదర్శన. హక్కుల కోసం కదం తొక్కిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి ఆవేదన అర్థం అయ్యింది. కానీ దానిని ఇలా ఉద్యమ రూపంలోకి తీసుకుని రావడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. అందరిలో ఎలాగైనా మన కష్టం తీర్చుకోవాలి, హక్కులు సాధించుకోవాలి అని బీద, బక్క, రైతులు, రైతు ూలీలు అందరూ కదం తొక్కారు.. కాళ్ళకు గాయాలైనాయి, రక్తాలు కారాయి. అయినా వెనుదిరుగకుండా గమ్యాన్ని ముద్దాడారు. లక్ష్యం నెరవేర్చుకున్నారు. ఇప్పటి

యువతరానికి ఇదొక కనువిప్పు, ఒక స్ఫూర్తి కణంలా నిరంతరం మనల్ని ఉత్తేజపరిచే గొప్ప పోరాట కావ్యం.

కాబట్టి మనిషి తలచుకుంటే తనకు తాను ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారు కావచ్చని… బ్రూస్‌లీ కరాటే యోధుడు నిరూపించాడు.. కాబట్టి చదువుకాని, ఏదైనా నైపుణ్యంకాని, శ్రమించడానికి సిద్ధంగా వుండడం కాని వుండాలి. చేసే పనిలో ఎక్కువ నైపుణ్యం సాధించాలంటే.. ఎక్కువ సమయం చేసే పనిపై టాేయించడం. సమయాన్ని మనకు ఉపయోగకరంగా మలచుకోవడం నేర్చుకోవాలి. చాలామంది విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, ఉద్యోగస్థులు అందరూ అనేది సమయం సరిపోవటం లేదు… ఎన్నో నేర్చుకోవాలని వుంటుంది, ఎంతో పని చేయాలని ఉంటుంది. కానీ సమయం సరిపోవడంలేదు, సమయాన్ని సరిగ్గా మేనేజ్‌ చెయ్యలేక పోతున్నామని.. సమయాన్ని మేనేజ్‌ చెయ్యటమంటె.. మనల్ని మనం మేనేజ్‌ చెయ్యడం నేర్చుకోవాలి. అంటే మన ఉద్వేగాలను, వత్తిడిని అదుపులో పెట్టుకోవాలి, కనీసం వాటి గురించి తెలుసుకొని, వాటిని ఎక్కడ వాడుకోవాలో తెలుసుకోవాలి.

మన అలవాట్లు, శక్తులు ూడా తెలుసుకొని వాడుకోవడం మొదలు పెడితే… సమయం పోతే దొరకదనే సత్యం అర్థం అవుతుంది. అడుగులో అడుగువేసుకుంటూ ఇప్పుడు చేసే పని నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ పని నేను చదువుకున్న దానికి ఏదైనా విలువను కలిగిస్తుందా, లేదు నా వ్యక్తిత్వానికి విలువను తెస్తుందా! అనేది తెలిసినప్పుడు.. ఏం చేస్తే నాకు విలువ తెలుస్తుంది, నేను చదివే చదువుకు ఉపయోగపడుతుందో అది ఆలోచించి, అదే చేస్తూ పోతే మీరు గొప్ప నైపుణ్యమున్న వేగంగా, ఖచ్చితంగా పనులు చేయగల వ్యక్తిగా రూపాంతరం చెందుతారు.

Other Updates