‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ కార్యక్రమంపై ప్రజలో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు.
జూన్ 21న హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీ, డి.ఎఫ్.ఓ. సమావేశం మొదటి సెషన్‌లో ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సమీక్షించారు.
అటవీ శాఖ సిసిఎఫ్ మిశ్రా, వివిధ జిల్లా కలెక్టర్లు జులై నెలలో నిర్వహించే ‘హరిత హారం’ కార్యక్రమం ఏర్పాట్లను వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 4,213 నర్సరీల్లో 40 కోట్ల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పండ్ల చెట్లు, నీడ చెట్లు, ఔషధ చెట్లు, అలంకరణ చెట్లు, భూమికి బలాన్నిచ్చే చెట్లు, అందంగా కనిపించే చెట్లు, చెరువులపై నాటడానికి ఈత చెట్లు, అటవీ ప్రాంతాల్లో పెంచే మొక్కులు, ఇలా అన్ని రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా ‘హరిత హారం’ కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి పలు సూచనలను చేశారు.
‘‘హరిత హారం కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజాఉద్యమంలా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో 230 కోట్ల మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి పెద్ద చేయడానికి అవసరమైన సంరక్షణాలు చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను భాగస్వామును చేయాలి. మొక్కలను సంరక్షించడానికి ట్రీ గార్డు ఏర్పాటు చేయాలి. ప్రాంగణా గేట్ల వద్ద ఎనిమల్ ట్రాపర్స్‌ను పెట్టాలి. హరితహారం కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. పోస్టర్లు, కరపత్రాలు, ఆడియో, వీడియో పద్ధతుల, కవి సమ్మేళనాలు, అవధానాలు కూడా నిర్వహించాలి. విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. శ్రమదానం ద్వారా మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.అన్ని రకాల ఉద్యోగులతోపాటు, పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి’’.
‘‘మిషన్ కాకతీయతో పాటు అనేక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారు. హరితహారంలో కూడా పోలీసులు స్వయంగా మొక్కలు నాటాలి. చెరువు గట్ల వద్ద స్విర్ ఓక్స్, ఈత చెట్లు పెంచాలి. నర్సరీ నుండి గ్రామాలకు మొక్కలు వెళ్లే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గ్రామ స్థాయిలో ఉండే విఆర్‌ఓలతోపాటు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి. మొక్కలు నాటడంతోపాటు వాటిని రక్షించి, పెంచి పెద్ద చేసే విషయంలో సమష్టిగా కృషి చేయాలి. పాఠశాల హెడ్‌మాస్టర్లు, తహశిల్దార్లు, విఆర్‌ఓలు, సర్పంచ్, జడ్పిటిసి, ఎంపిటిసితో గ్రామ హరిత రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత ఏడాదికి మొక్కలు నాటుతూనే, వచ్చే ఏడాదికి అవసరమయ్యే మొక్కలను కూడా ఇప్పటి నుండే సిద్ధం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా నశించిపోయిన అడవులను మళ్లీ దట్టమైన వనరులుగా తీర్చిదిద్దడానికి అనువైన మొక్కలు నాటాలి’’.
‘‘హరిత ఉద్యమం పేరుతో ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలి. దీనిని ఉద్యమంలాగానే భావించాలి. హెలికాప్టర్‌లో కాకుండా నేను కూడా బస్సులోనే అన్ని జిల్లాలు తిరుగుతారు. నియోజక వర్గాల వారీగా అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కలెక్టర్లు కార్యక్రమాన్ని డిజైన్ చేయాలి. వారంలోగానే ఎంపీ, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీతో సమావేశం నిర్వహించాలి. సాంస్కృతిక సారథి బృందాలను ప్రచారానికి వినియోగించుకోవాలి’’.
‘‘నదీ పరీవాహక ప్రాంతాలు, నీటి ప్రాజెక్టుల రిజర్వా యర్లు, సింగరేణి స్థలాలు, పోలీసు బలగాలుండే ప్రాంగ ణాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాయాలు, అన్ని మతా ప్రార్థనా స్థలాలు, రైల్వే స్థలాలు, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు విరివిగా నాటాలి. అగ్ని మాపక వాహనాలను పట్టణ ప్రాంతాల్లో మొక్కకు నీరు పోయడానికి ఉపయోగించుకోవాలి. హరిత హారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి వాహనంపై స్టిక్కర్లు అంటించాలి. గ్రామ పంచాయతీలు, ప్రార్థనా మందిరా మైక్‌సెట్ల ద్వారా కూడా పాటు వినిపిస్తూ ప్రచారం చేయాలి. అర్చకు, ఫాదర్స్, ఇమామ్, గురుద్వారా నిర్వాహకులతో సమావేశం పెట్టాలి. ఆర్టీసి బస్సుల్లో కూడా ప్రచారం చేయాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.