రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న పెగడ ఎన్.ఎస్.కె రాజు తన రోజువారీ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే, నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజ సేవకు పాటుపడుతూ వుంటారు. ఈ సేవా కార్యక్రమాలు విరివిగా చేయాలనే సదుద్దేశంతో తాను నివాసముండే ఎర్రగడ్డ ప్రాంతంలో ఆనందనగర్ సంక్షేమ సంఘాన్ని, ఓం కల్చరల్ అసోసియేషన్‌ని నెలకొల్పారు. ఈ సంఘాల పేరిట పెగడ రాజు చేసిన అనేక సామాజిక కార్యక్రమాలను హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ గుర్తించి గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. గత నెలలో విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికన్ మిషన్ టీమ్స్ ఛాన్సలర్ డాక్టర్ వేర్ద థాంప్సన్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
హోం
»