magaసమాచార హక్కు చీఫ్‌ కమిషనర్‌గా (సీఐసీ)గా రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సమాచార కమిషనర్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ బుద్దా మురళి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారిద్దరికి గవర్నర్‌ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ఎన్నికల సంఘం ఛైర్మన్‌ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Other Updates