దశకంఠుని ప్రాణహరణం జరిగిన రోజు కనుక మానవాళికి పండుగ. పండుగ పేరు ‘దశహరా’. సంస్కృత లేక హిందీభాషలోని ‘దశహరా’ తొగువారి వాడుకలో ‘దసరా’ అయింది. రావణవధా కార్యక్రమ వేడుక ఆచారమయింది. దేశ రాజధాని ఢల్లీి నగరంలో రావణ వధను శ్రీరామచంద్రుని విజయ లీగా దర్శించుకొందుకు ఉత్సవ ప్రదేశంగా రామలీలా మైదానమేర్పడిరది.
ఇది విజయదశమి కూడా. ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు విరాటరాజ్యం పైకి దండెత్తి వచ్చిన కౌరవసేనను అడ్డుకొని ఉత్తర గోగ్రహణాన్ని నిరోధించిన పాండవ మధ్యముడైన అర్జునునిని విజయోత్సవమే విజయదశమి పండుగ.
అజ్ఞాతవాసం చేయడానికి గాను విరాట నగరానికి వెళుతూ పాండవు జమ్మిచెట్టు మీద తమ ఆయుధాను దాచి వెళ్ళినారట. ఆ ఆయుధాు చూపరుకు శవరూపంగా కనపడుతూండిన కారణంగా భయపడి ఎవరూ ఆ ఛాయకు వెళ్ళేవారు కాదట. విరాట రాజుతో సహా సైన్యమంతా దక్షిణ గోగ్రహణాన్ని నివారించడానికి వెళ్ళిన కారణంగా ` ఉత్తర గోగ్రహణ సమయానికి విరాటరాజ్యాన్ని రక్షించడానికెవరూ లేకుండిరి. రాజధానిలో ఉండిపోయిన యువరాజైన ఉత్తరుడు బయుదేరాలి. యోగ్యుడైన సారథిగా బృహన్న పనికి వస్తాడని సైరంధ్రిగానున్న ద్రౌపది సూచింపగా అయిష్టంగానే బయల్దేరాడు ఉత్తరుడు. భీష్మ ద్రోణాది వీరు నెదుర్కొనే శక్తిలేక ఉత్తరుడు పలాయనం చిత్తగించే దశలో బృహన్న నివారించి, రథాన్ని జమ్మిచెట్టు వద్దకు తీసుకొని వెళ్ళి గాండీవాన్ని ధరించి నిజరూపంతో కౌరవును జయించి ఉత్తర గోగ్రహణాన్ని నివారించినాడు. నాటికి పాండవు అజ్ఞాతవాసం సమాప్తినొందినది గనుక విజయుని దశమి ‘విజయదశమి’ పండుగ అయింది.
అర్జునుడు జమ్మిచెట్టు వద్దకు వెళ్ళినాడు. గాండీవాన్ని ధరించినాడు. విజయాన్ని పొందినాడు. పాండవు ఆయుధాను ఏడాది పాటు కాపాడిన జమ్మిచెట్టు అవసరమైనప్పుడు అర్జునునికి విజయాన్ని ప్రసాదించింది. ఈ కారణంగా జమ్మిచెట్టు పూజనీయమైంది. జమ్మిచెట్టును శమీవృక్షమని కూడా పిుస్తారు.
గ్రామస్తుందరూ విజయదశమి సాయంకాం ఊరి చివర చిట్టడవుకు వెళ్ళి జమ్మిచెట్టును పూజించి జమ్మి ఆకును తెచ్చుకొని బంధుమిత్రుతో ఆ ఆకును ఇచ్చిపుచ్చుకొని ఆనందంతో గడిపే సంప్రదాయం ఏర్పడిరది. ఈ జమ్మి ఆకును ఏదో పత్రివలె కాకుండా బంగారంగా భావిస్తారు.
పట్టణాలోని వారు ఊరు చివరకు వాహ్యాళికి వెళ్ళే అదృష్టానికి నోచుకొనరు కాబట్టి ఎక్కడికక్కడ గుళ్ళల్లో శమీ పూజ చేసి కార్యక్రమ నిర్వహణను పూర్తి చేసికొంటారు. ఈ పండుగ నేపథ్యాన్ని సంక్షిప్తంగా గుర్తుచేసే ఈ క్రింది శ్లోకాన్ని మననం చేసికొంటారు.
‘‘శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనం’’
జమ్మికోసం పొలిమేరకు వచ్చే జనం చెరువు కట్టవెంట, పొలాగట్ల వెంట వెళ్ళడం అనివార్యంగా జరిగే కార్యక్రమం. మృగశిర కార్తెలో నాటిన వరి మొక్కు దసరా నాటికి కంకు పడ్తున్న కర్రయ్యేవి. శాస్త్రానికా అన్నట్లు దారిపొడవునా ఉన్న వరి పొలాల్లోని కంకుల్తో సహా ఒకటి రెండు కర్రల్ని ప్రతి ఒక్క రైతూ ఇంటికి తెచ్చుకొనేవాడు. ఇళ్ళకు వచ్చిన వరి కంకును రైతు పరీక్షగా చూచి దిగుబడిగా ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసికొనేవారు. అంతేగాక కంకు ఆరోగ్యంగా ఉన్నాయా, గింజ సరిగా పడ్తున్నదా, తాు ఏ మాత్రం వస్తుంది. రోగాుంటే నివారణ చర్యలేమిటి, అన్నది ఆనాటి గ్రామస్తు ఉమ్మడి చర్చా కార్యక్రమంగా ఉండేది.
విపరీతమైన వర్షాు పడ్డప్పుడు చెరువు కట్టు దెబ్బతింటాయి. ఎవరో ఒకరు తమ ఇంటి పనికో, పొంపనికో కట్టను అక్కడక్కడా తవ్వడం చేస్తుంటారు. ఎుకు బొరియు పెడ్తుంటాయి. వరదు వచ్చినప్పుడు పై నుండి వచ్చిన నీటి కారణంగా చెరువు కట్టకు కోతు ఏర్పడుతాయి. మత్తడి రాళ్ళూ, తూము రాళ్ళూ దెబ్బతిని మధ్య నుండి నీరు వృథాగా కారిపోతూంటుంది. జమ్మికారణంగా చెరువు కట్టకు వచ్చిన గ్రామస్తుతో ఎవరో ఒకరికి జరిగిన నష్టాతో ఏదో ఒకటి కనపడుతుంది. మళ్ళీ వర్షాకాం వచ్చే లోపు చెరువు మరమ్మతు పూర్తిచేసికోగలిగే వారు గ్రామస్తు.
‘మిషన్ కాకతీయ’ పేరిట మన తెంగాణ ప్రభుత్వం చేపట్టిన చెరువు మరమ్మతు కార్యక్రమం మన దసరా వైభవాన్ని మళ్ళీ తెస్తుందనుకోవడం దురాశ కాబోదు.
పొలాల్లోను, చిట్టడవుల్లోనూ పాపిట్టు సంచరిస్తూ గ్రామస్తుకు కనువిందును చేస్తూండేవి. జమ్మికి వెళ్ళినవారు పాపిట్టను చూడకుండా ఇంటికి రావడం అరిష్టంగా భావించేవారు. మామూు రోజుల్లో చులాగ్గా కనిపించే పాపిట్టు దసరా రోజున ఎందుకోగాని ఎక్కడెక్కడో దాక్కొనేవి. చెట్లకొమ్మల్లోనూ, చేనులోని మొక్కజొన్న కర్రమధ్యలోనూ దాక్కొన్న పాపిట్టను యువకుూ, ప్లిూ చప్పట్లు చరిచి, రాళ్ళు విసిరి బయటకు రప్పించేవారు. ‘అగ్గో ! పాపిట్ట!’ అని అందరూ అరుస్తూండగా, సగమ్మంది కూడా చూడకమునుపే ఆ పిట్ట కాస్తా మరొక చెట్టును చూచుకొని దాక్కొనేది. దసరారోజు పాపిట్టను చూడడమన్నది పదికాలాపాటు గుర్తుంచుకొనదగిన ఆనందమయమైన అనుభవం.
ప్రకృతి సమత్యుతలో ఏ చిన్న మార్పు వచ్చినా పాపిట్ట తట్టుకోలేదు. మరొక మంచి ప్రదేశాన్ని చూచుకొని వెళ్ళిపోతుంది. లేదంటే ఆ ప్రదేశంలోని ఆ జాతి పక్షున్నీ నశించిపోతాయి. ప్రకృతి పరిరక్షణ స్థాయిని సూచించే పక్షి పాపిట్ట. పాపిట్ట కనబడలేదంటే రైతు ఆందోళనపడడమూ, కీడును శంకించడమూ అందుకే.
దసరా ముందు రోజు మహర్నవమిగా పిువబడే పండుగ. అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసుర మర్దని నామాన్ని ధరించిన రోజు. శత్రుసంహారానికి గొప్పనైన రోజు. పూర్వకాంలో రాజుూ, మహారాజుూ తమ ఆయుధాను పూజించేవారు. సామాన్యుకు వారి పనిముట్లే వారి ఆయుధాు. రాజుకు రథాుండేవి. వాటిని పూజించేవారు. నేటి వారికి వివిధరకములైన వాహనమున్నవి. వాటిని పూజిస్తారు.
పొలాల్లో బురద వెనుకబడ్తుంది. నాగళ్ళు, గొయ్రి ఇతర పరికరా ఉపయోగమికపైన లేదు. వాటిని శుభ్రపరచి పూజించి భద్రపరచుకోవడమే. ఎడ్లబండ్లను కడిగి మరమ్మతుంటే చేయించుకొని, ఎడ్లను పూన్చి పూజించడం సంప్రదాయం.
మహర్నవమికి ముందు రోజు కూడా మనకు పండుగనే. దాని పేరు దుర్గాష్టమి. సింహవాహినిగా రాక్షస సంహారం చేసిన దుర్గాదేవిగా ఆ రోజున అమ్మవారిని పూజిస్తాం.
రోజు లెక్కనుబట్టి వచ్చే తేడాననుసరించి దుర్గాష్టమి నాడు లేదా మహార్నవమినాడు సద్దు బతుకమ్మ పండుగ వస్తుంది. భాద్రపద బహుళ అమావాస్య లేదా పెత్తురమాసతో బొడ్డెమ్మను పేర్చడం ఆగిపోతుంది. ఆశ్వయుజ శుక్లపాడ్యమి నుండి బతుకమ్మ ఆడటం మొదవుతుంది. ఇది స్త్రీకు సబంధించిన గొప్పనైన పండుగ. ఈ పండుగలో పాల్గొనని తెంగాణ మహిళ ఉండదు. శిశువు నుండి వృద్ధు వరకు పాల్గొనే సద్దు బతుకమ్మనాడు ప్రతి ఊర్లోనూ నీళ్ళల్లో ఉండవసిన కువపూన్నీ కట్టకట్టుకొని చెరువు కట్టపై కొచ్చి నాట్యమాడుతుంటే చెరువు త్లెబోయి చూస్తూంటూంది. బతుకమ్మ ఆట ద్వారానూ, సద్దును పంచుకొనడం ద్వారానూ ఘర్షణ లేని సామాజిక సమరసతను నెక్పొదచుకొన్న పల్లెటూరి ప్రజ ఆదర్శం మనకేనాడయినా అర్థమయ్యేనా !
అధ్యాపకు తమ శిష్యును వెంటబెట్టుకొని వారి వారి ఇండ్లకు వెళ్ళి ప్లి చేత పద్యాను పాడిరచి ` దసరా కట్నాను స్వీకరించడం కూడా కనుమరుగయిపోయిన సంప్రదాయాలో ఒకటి. ఈ ఆచారంలో గురువుకు తన శిష్యు కుటుంబాతో విడదీయరాని బంధం ఏర్పడేది.
దసరా నిజానికి పదిరోజు పండుగ. పాడ్యమి నుండి మహార్నవమి వరకు శక్త్యారాధన ప్రధానంగా అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. మూలా నక్షత్రం నాడు మహాసరస్వతిగా, అష్టమినాడు మహాదుర్గగా, నవమినాడు మహిషాసుర మర్దనిగా, దశమినాడు రాజరాజేశ్వరిగా అమ్మవారిని అర్చిస్తారు. మిగతా రోజులో వారి వారి సంద్రాయాను బట్టి అమ్మవారి అర్చారూపాు మారుతవి. అమ్మవారి ఆరాధన ప్రధానం కాబట్టి వీనిని దేవీ నవరాత్రుంటారు. శరదృతు ఆరంభ దినాు కాబట్టి శరన్నవరాత్రుంటారు.
మన సంప్రదాయంలో సంవత్సరంలో రెండు సార్లు నవరాత్రి ఉత్సవాు నిర్వహిస్తారు. మొదటిది ఉగాదితో మొదయి శ్రీరామనవమితో అంతమయ్యే వసంత నవరాత్రు. రెండవది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో మొదయి మహర్నవమితో ముగిసే శరన్నవరాత్రు.
వసంతఋతువు నవనవోన్మేష జీవ చైతన్యానికి చిహ్నము. శరదృతువు అజడు లేని ప్రకృతి యొక్క ప్రశాంతతకు చిహ్నము. రాత్రింబవళ్ళు ప్రతి రోజూ సమంగానే ఉన్నట్లు కనిపించినా కొద్దిపాటి హెచ్చుతగ్గుతో ఉంటాయి. నిజానికి రాత్రింబవళ్ళు ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా పన్నెండేసి గంటు సమంగా ఉండడమన్నది సంవత్సరానికి రెండు రోజుల్లో మాత్రమే జరుగుతుంది. రాత్రింబవళ్లు సమంగా ఉండే రోజును విషువత్తు అంటారు. అందులో ఒక విషువత్తు వసంత ఋతువులో సంభవిస్తే మరొక విషువత్తు శరదృతువులో సంభవిస్తుంది. ప్రకృతిలోని ఈ విశేషాను పురస్కరించుకొనే ఋషు మనకు ఈ రెండు ఋతువులోనూ నవరాత్య్రుత్సవాను ప్రసాదించారు.
మనిషి కొఱకు ప్రకృతి కాదు, ప్రకృతి ఒడిలో మనిషి అన్న భారతీయ భావనను గుర్తెరిగి మనమందరం ఈ దసరాను జరుపుకొందాం.
హోం
»