magaదాదాపు దశాబ్దకాలంగా కథలు రాస్తున్న ఎనుగంటి వేణుగోపాల్‌ తాజాగా వెలువ రించిన సంపుటమే ‘వైవిధ్య కథలు|. విభిన్న వస్తు, వివిధ శైలీ రీతుల్లో అతని కృషి ఎన్నదగినది. దానికి తగిన రీతిలో పత్రికలనుంచి ప్రోత్సా హం పొందుతున్నాడు అన్నది నిజమే. ఇక కావాల్సింది పాఠకుల మెచ్చుకోళ్లు. ప్రస్తుత పుస్తకం వేణుగోపాల్‌ శాయశక్తుల యత్నించినట్టు ప్రతి కథ సాక్ష్య్షమిస్తోంది. ఒక్క పేజీ కథలనుంచి, నవ్వు తెప్పించేవాటివరకు పేరుకు దగ్గట్టే వైవిధ్యం వర్థిల్లింది. అన్నీ లోగడ పత్రికల్లో ప్రచురించబడ్డవే!

గొర్రెలు కథలో పులిని బోనులో పెట్టినట్టు గుట్ట దురా క్రమణదారుల ఆటకట్టుగానే, లోపలిమనిషిలో అవినీతి పరుణ్ణి ప్రక్షాళించినట్టుగానే చదువుతుంటే నవ్వాపుకోవడం జరగనిపని. మాతృత్వం మరీ అనవసర కథ. నమస్తే తెలంగాణ కూడా అదే కోవకు చెంది. గ్లోబల్‌ వార్మింగ్‌ గూర్చి రాసిన రేపటిరోజున కూడా షరా మామూలే. తక్కినవన్నీ కూడా ఇంచుక అటు ఇటుగా ఏకోదరులే.

కామన్‌గా కనిపించే విషయమేమంటే ముందే నిర్ధా రించుకున్న ముగింపు కోసం అల్లిక మొదలెట్టిన ట్టుందిగానీ ఉన్నదున్నట్టు లోతుగా అన్ని డైమెన్షన్స్‌లో నిశితంగా పరి శీలించినట్టు అస్సలు అనిపించలేదని చెప్పకతప్పదు. వేమన అన్నట్టు ఎలుగుతోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికిన నలుపు నలుపే! శ్రీశ్రీ చెప్పినట్టు శస్త్ర చికిత్ససైతం విఫలమయ్యే కేసులో చిట్కా వైద్యం రోగాన్ని మటుమాయం చేసిందని భ్రమింపజేయుట అపసవ్యమే. అవసరార్థం ఎన్నో వేషాలు ‘అక్కడ’ అలుముకున్నదే. ఇంకా సానపట్టి మరింత శక్తి పుట్టించే రచనలకు నడుంకట్టుమని గోపాల్‌కు సూచిస్తూ అప్పటిదాకా హాయిగా ప్రయాణాల్లో చదువుకోదగ్గ సంపుటమిది.

-రాము ఇటిక్యాల్‌

ప్రతులకు:

వైవిధ్య కథలు-రచన: ఎనుగంటి వేణుగోపాల్‌,

పేజీలు: 100, వెల : రూ. 80

ప్రతులకు: ఎ. అంజలి, ఇం.నెం. 1-3-168/1,

కృష్ణానగర్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లా.

Other Updates