hospitalనేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనేది సినిమా పాటే అయినా ఇది ప్రజల్లో మాత్రం ఇమిడిఉంది. దీనిని మార్చేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. బంగారు తెలంగాణలో భాగంగా ప్రతి విభాగాన్ని ప్రక్షాళన చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్యంపై సచివాలయంలో ఏప్రిల్‌ 8న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆస్పత్రులు అందిస్తున్న వైద్యంపై, వైద్యారోగ్య మౌలిక వసతుల కల్పన సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, కార్పొరేట్‌ సదుపాయాలు, అత్యాధుని పరికరాలు సమకూర్చాలని, ఉద్యోగ ఖాళీల భర్తీలపై ముఖ్యమంత్రి ంచారు.

ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సంస్కరణలు చేపట్టాలని, ఇందుకోసం కొత్త వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. హెల్త్‌ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు, తమిళనాడు తరహాలో ప్రభుత్వ ఆస్పత్రులు పనిచేయడానికి ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ ఆస్పత్రుల ఆధునీకరణ :

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయా లు అందాలంటే మొదటగా గుర్తొవి హైదరాబాద్‌లోని గాం, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రులు. వీటిలో వైద్యాన్ని మెరుగు పరచడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానంగా ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని, పాత భవనంలో వైద్య సేవలను కొనసాగిస్తూనే కొత్తగా రెండు టవర్లలో 12 అంతస్తుల చొప్పున 24 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాలని సూచించారు. వీటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేదని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండేందుకు అడ్మినిస్ట్రేటర్స్‌ని నియమించుకోవాలని చెప్పారు. సూపర్‌వైజర్లతో పాటు వీరు కూడా ఆస్పత్రుల పరిసరాలు, వార్డులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు దోహదపడతారని చెప్పారు. బోధనాస్పత్రులతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయల విలువచేసే ఆధునిక పరికరాలను వినియోగించుకోక, మరమత్తులు చేయించకపోవడంతో వృగా పడివున్నాయని వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒ ఇంజనీర్‌ను నియమించాలని అధికారులకు సిఎం సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని, దీనిపై అధికారులు అధ్యయనం చేసి, కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి డాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు శ్ర చూపాలన్నారు. రోగుల బంధుల కోసం ప్రత్యేకంగా డార్మిటరీలు, బాత్‌ రూంలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కేంద్ర సహాయాన్ని తీసుకోవాలన్నారు.

ఉద్యోగాల భర్తీ :

రాష్ట్రంలో వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను వెంటనే రూపొందించి అందజేయాలన్నారు.

ముఖ్యమంత్రి అసంతృప్తి :

ప్రభుత్వ ఆస్పత్రులు, బోధానాస్పత్రుల్లో, వైద్యారోగ్య మౌక వసతుల కల్పన సంస్థ (హెచ్‌ఎంఐడిసి) పనితీరు, అవినీతి పై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌ఎంఐడిసి వ్యవహారాలను ఇతర విభాగాల ఇస్తే బాగుంటుందని సిఎం అభిప్రాయపడ్డట్లు సమాచారం.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గ్యాదరి కిషోర్‌, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ చందా, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ బుద్ధ ప్రకాశ్‌, వైద్య విద్య సంచాలకులు పుట్ట శ్రీనివాస్‌, వైద్య విధాన పరిషత్‌ ఛైర్మన్‌ వీణా కుమారి ఇతర వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

వైద్య పరికరాలు ఇక్కడే తయారు కావాలి :

సమాచార, శాస్త్ర సాంకేతికాన్ని వైద్య రంగంలో వినియో గించుకుంటామన్నారు ముఖ్యమంత్రి. స్టంట్లు, ఇతర వైద్య పరికరాలు ఇక్కడే తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య నిపుణులతో సలహామండలిని ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు. ఏప్రిల్‌ 21వ తేదీన సచివాలయంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ సోమరాజు, కాశీరాజు, కృష్ణారెడ్డిలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

ప్రజలకు సేవ చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనల కోసం రాష్ట్ర స్థాయి సలహామండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శస్త్రచికిత్స పరికరాలు, శరీరంలో అమర్చాల్సిన వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీని వల్ల అధిక భారం పడుతుందని, అన్ని రకాల వైద్యానికి అవసరమయ్యే పరికరాలు తెలంగాణలో తయారుకావాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఫీవర్‌ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

జ్వరంతో బాధపడే నగర ప్రజలకు దశాబ్దాల కాలంగా సేవలందిస్తున్న ఫీవర్‌ ఆస్పత్రిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాల ప్రాంగణంలోని పాత భవనాల స్థానంలో నూతన భవనాలు, అత్యాధునిక వైద్యపరికరాలతో మెరుగైన వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.

cmఏప్రిల్‌ 11న అంబర్‌పేటలో జ్యోతిరావ్‌ పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం సిఎం ఉదయం 11 గంటల సమయంలో కోరంటి వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. వైద్యశాల అవసరాలకు అనుగుణంగా మరింతమంది సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ఈ మేరకు వైద్యశాల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించి ఇవ్వాలని సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారు. దశాబ్దాలుగా నగరంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్న వైద్యశాలను అంతా కలిసి బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు. అంబర్‌పేటలో జ్యోతిరావ్‌ పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం హోం మంత్రి నాయిని, ఎంపి బాల్కసుమన్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ నిర్మల తదితరులతో కలిసి కోరంటి వైద్యశాలను ఆకస్మికంగా సీఎం సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్‌ శిక్షణ నిమిత్తం వెళ్లడంతో అక్కడ ఉన్న ఇంచార్జి సూపరిం టెండ్‌ంట్‌లు రెండవ శనివారం కావడంతో అందుబాటులో లేరని ఉద్యోగులు చెప్పడంతో అత్యవసర విభాగంలో రెండో శనివారాలుంటాయా? అని అసహనం వ్యక్తం చేశారు.

అధికారులను మందలించిన సిఎం
ఆస్పత్రి పరిసరాల్లో చెత్తా, చెదారం ఉండటాన్ని గమనించి ఇదంతా ఏంది? శుభ్రం చేసుకోవచ్చు కదా అని అధికారులను మందలించారు. వైద్యశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందుకోసం స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పారు. అక్కడే ఉన్న హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిర్మల, డీసీపీ రవీందర్‌ను వైద్యశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ తమ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటు 150 మంది పోలీసులు, రెవిన్యూ సిబ్బందితో రెండ్రోజుల్లో ఈ పరిసరాలను శుభ్రం చేసుకుంటామని హామీ ఇచ్చారు.

నూతన భవనాలు :

trsవైద్యశాల ఎంత విస్తీర్ణంలో ఉంది? కబ్జా అయిందా, ఎన్ని భవనాలున్నాయి, శిధిలావస్థలో ఉన్న భవనాలు, రోగుల వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న వాటిని తొలగించి నూతన భవనాలు నిర్మించాలని సిఎం సూచించారు. నగరానికి ప్రతిష్ఠాత్మకంగా ఉన్న ఈ వైద్యశాలను అన్ని రకాల వైద్యపరికరాలు సమకూర్చి ఆధునీకరించుకోవాలని, వైద్యశాల అవసరాలు, ఆధునీకరణకు, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏమేం కావాలో సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నర్సులకు ఇండ్ల పథకం..

వైద్యశాల ప్రాంగణంలో నర్సులను గమనించి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా? అంటూ ప్రారంభించి వారి ఆర్థికస్థోమత, తదితర విషయాలు తెలుసుకున్నారు. మీలో ఎంతమందికి సొంత ఇండ్లున్నాయి.. ఎంతమంది కిరాయి ఇండ్లలో ఉంటున్నారని అడిగారు. తామంతా కిరాయి ఇండ్లలోనే ఉంటున్నామని, పెరుగుతున్న కిరాయిలు భరించడం ఇబ్బందిగా ఉందని వారు చెప్పారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు క్రమంగా రావడం లేదని అలాగే తమకు పదోన్నతుల విషయంలో చాలా జాప్యం జరుగుతున్నదని సిఎంకు విన్నవించారు. సిఎం స్పందిస్తూ తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్‌ అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని చెప్పారు. వైద్యశాల నర్సులకు ప్రభుత్వం చేపట్టబోయే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకంలో ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. వైద్యశాల ఉద్యోగులు, కార్మికుల వివరాలు సేకరించి వారందరికీ హౌసింగ్‌ స్కీంలో అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ నిర్మలను అదేశించారు.

ఫీవర్‌ హాస్పిటల్‌లో స్వచ్ఛభారత్‌

సీఎం ఆదేశాల మేరకు మే 12న ఫీవర్‌ హాస్పిటల్‌లో ఈస్ట్‌జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని పోలీసు సిబ్బంది, జీహెచ్‌ఎంసి సిబ్బంది, వైద్యశాల సిబ్బంది కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు.

Other Updates