reddy5555పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విధంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాల్లోనే ఎన్నో విజయశిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగుతున్నది. తెలంగాణ సాంస్కృతిక సౌరభాలను ఖండాంతరాలకు వ్యాప్తి చేయడంలో సఫలీకృతం అవుతోంది.

తెలంగాణ సాహిత్య, కళా, సాంస్కృతిక వారసత్వ సంపద అతి ప్రాచీననమైనదని, మహోన్నత విలువలుగలదని ఎలుగెత్తి చాటిచెప్పే ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, బంగారు తెలంగాణ దిశగా భాషా, సాంస్కృతిక చైతన్య రథం ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సంచాలకత్వంలో సాగుతున్నది. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమంది కళాకారులకు ఫించను అందించడంపట్ల కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణాకే ప్రత్యేకమైన పేరిణి నృత్యాన్ని 256 మంది కళాకారులతో లలితకళాతోరణంలో మహా నృత్యంగా ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. కనుమరుగైపోతున్న కళారూపాలను తిరిగి పునరుజ్జీవింపజేయడంలో సాంస్కృతిక శాఖ మొదటి నుంచి శాయశక్తుల కృషి చేస్తున్నది. అందులో భాగంగా ”తెలంగాణ కళారాధన” పేరుతో జానపద, గిరిజన గ్రామీణ కళారూపాలు ప్రదర్శించే కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శించి ప్రశంసలందుకుంది. అన్ని జిల్లాల్లోను ఇటువంటి ప్రదర్శనలు జరుగుతున్నందులకు, ఎన్నో సాంస్కృతిక సంస్థలకు ఇతోధికంగా ఆర్థిక చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్న తీరు ప్రశంశనీయమని కళా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

442 మంది కవులతో ఏర్పాటు చేసిన కవిసమ్మేళనం ఒక అపూర్వ ఘట్టంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ కవితా దినోత్సవం, ఉగాది కవిసమ్మేళనం, ఉగాది ఉత్సవం, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఎన్నో మరెన్నో కార్యక్రమాలను సాంస్కృతికశాఖ నిర్వహించింది.

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ద్వారా థియేటర్‌ ఫెస్టివల్‌ ”భారత్‌ రంగ్‌” మహోత్సవాలపేరిట ఏర్పాటు చేయటం, పూర్వోత్తర నాటకోత్సవాలు, ”అధిరంగ్‌ మహోత్సవం” ఆదివాసులు కళా రూపాలతో కూడినవి ఈ విధంగా జాతీయ, అంతర్జాతీయ నాటక కళా రూపాలను ఏర్పాటు చేసి నాటక కళా ప్రియులకు భాషా సాంస్కృతిక శాఖ మరింత చేరువయింది.

Other Updates