తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం కలలు కన్న జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆగస్టు 6న తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి వేడుక సందర్భంగా తెలంగాణ భవన్‌లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గ్రామాలలోని సామాన్యులు, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి గ్రామ స్వరాజ్యం దిశగా కదలుతున్నదని అన్నారు. బంగారు తెలంగాణ సాధించడమే జయశంకర్‌సార్‌కు ఘన నివాళి అని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ శీఘ్రగతిన అభివృద్ధి సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని నాయిని పేర్కొన్నారు. మన రాష్ట్రం అన్ని రంగాలలో పురోగతి సాధించడమే జయశంకర్‌సార్‌కు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
జిల్లాలలో..
రాష్ట్రంలోని జిల్లాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు జయశంకర్ సార్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సార్ ఆశయసాధనకు అంకితమవుతామని ఈ సందర్భంగా పులువురు మంత్రులు, అధికారులు పేర్కొన్నారు. అసెంబ్లీ లాంజ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి శాసనమండలి ఛైౖర్మన్ స్వామిగౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఢిల్లీలో జరిగిన జయంతి కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, కె.కేశవరావు, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, జితేందర్‌రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి అర్పించారు. సీఎస్ రాజీవ్‌శర్మ సచివాఢిల్లీయంలో జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద జయశంకర్ విగ్రహానికి వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.