రెండు వేల ఏళ్ల నాటి

మహత్తర చరిత్ర తెలంగాణ సాహిత్యానిది.. సాహిత్య సరస్వతి అనేక ప్రక్రియల రూపంలో ఇక్కడ ఉద్భవించి ఇతర ప్రాంతాలకు ప్రవహించింది.. ఈ గడ్డ సాహిత్యానికి పురిటిగడ్డ.. అచ్చమైన తెలుగు సారస్వత సంపదకు నిలయం. ఈ గడ్డపై వ్యాస భాగవతాన్ని తెలుగు తరాలకు అందించిన పుణ్యపేటి బమ్మెర పోతన ఒక్కడు మాత్రమే సహజకవి కాదు.. తెలంగాణ నేలలో ఉన్న సహజత్వమే అది.. ఇక్కడ పుట్టుకతోనే శిశువులు సైతం పరిమళిస్తాయి. వృత్తులు, ప్రవృత్తులతో సంబంధం లేకుండా అచ్చమైన తెలుగులో నిజమైన కావ్య సృజన చేయగల మహానుభావులు తెలంగాణ మాగాణంలో ప్రతి అణువులోనూ కనిపిస్తారు.. ఇక్కడ పుట్టింది ఒక పోతన కాదు.. వేన వేల పోతన్నలు.. వారు సృష్టించింది అనంత భాగవత కవితా స్రవంతి..

తెలంగాణ సీమలో వెలువడిన తరతరాల తెలుగు సాహితీ గరిమ మిగిలిన అన్ని ప్రాంతాల కంటే ఎంతో విభిన్నమైంది.. ఇక్కడ వెల్లివిరిసిన అనేకానేక సాహిత్య స్వరూస స్వభావాల్లోనూ ఈ విశిష్టత అతి స్పష్టంగా గోచరిస్తుంది. కవిత్వ స్వరూప స్వభావాలే కాదు.. కవుల నిసర్గ మానసిక వలయాల్లోనూ ఈ విభిన్నత్వం సుస్పష్టంగా గోచరిస్తుంది. తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవలసిన అవసరం కచ్చితంగా కనిపిస్తున్న తరుణంలో విభిన్న భౌగోళిక మానసిక ప్రభావాల ప్రసరణను సూత్రబద్ధ రీతిలో అంచనా వేయాలి.. ఈ అంచనాలు అద్భుతమైన ఫలసాయాన్ని అందిస్తాయి..

ఈ సాహిత్య వారసత్వం ఈనాటిది కాదు.. మెతుకు సీమలో గుణాఢ్యుడు రెండు వేల ఏళ్ల నాడు బృహత్కథను రచించినప్పటిది.. నాడు పైశాచి భాషలో ఆయన రచించిన బృహత్కథ తెలుగు గడ్డపై పుట్టిన తొలి సాహిత్య కుసుమం.. ఈ ఫిక్షన్‌ ప్రక్రియ ఇతర సాహిత్యాల నుంచి అరువు తెచ్చుకొన్నది కాదు. అప్పటి నుంచి ఇక్కడ అజరామరమైన సాహిత్య సంపద ఉద్భవిస్తూనే ఉంది. నదులు కొండలలో పుట్టి పీఠభూములపై పడి మైదాన ప్రాంతాలకు ప్రవహించినట్లే తెలుగు సాహిత్య ప్రక్రియలన్నీ కూడా దక్కన్‌పీఠభూమి అయిన తెలంగాణ ప్రాంతంలో పుట్టి..మైదాన ప్రాంతానికి ప్రవహించినాయి.

తెలుగుగడ్డపై తొలి సారి అక్షరాలను ూర్చిన గుణాఢ్యుడు తన బృహత్కథను రాసింది మెదక్‌ జిల్లా కొండాపూర్‌లో.. రామాయణం తొలి అనువాదమైన రంగనాథ రామాయణం తెలంగాణాలో పుట్టింది. ఇక తొలి పురాణ అనువాదం మార్కండేయ పురాణం తెలంగాణా ప్రాంతం లోనే పుట్టింది. దీనికంటే ముందు క్రీ.శ. 931 ప్రాంతంలోనే నిజామా బాద్‌ ప్రాంతం నుంచి పంపన విక్రమార్జున విజయం రాశాడు. ఇది ఆది పురాణం. క్రీ.శ.940 ప్రాంతంలో వేములవాడ ప్రాంతం నుంచి మల్లీయ రేచన తొలి లాక్షణిక గ్రంథం కవిజనాశ్రయం రచించాడు. తెలుగునాట వచ్చిన లక్షణ శాస్త్రాలన్నింటికీ, సాహిత్య ప్రక్రియలన్నింటికీ ఇది ఆధారభూతం. ఆ తరువాత అప్పకవీయం తెలంగాణ నుంచే వెలువ డింది. 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టారకుడు తెలుగులోకి ఆంధ్ర మహాభారతాన్ని అనువదించడానికి ముందే మానుకోట (మహబూ బాబాద్‌) దగ్గరలోని గూడూరులో విరియాల కామసాని లాక్షణిక కావ్యభాషలో రచించిన శాసనం ఉన్నది. నన్నయ్య భారతంలోని భాష.. శైలికి ఇది మూలం. జినవల్లభుడి శాసనంలో కందపద్యాలు కనిపిస్తాయి.

ఇక భాగవతం సంగతి సరేసరి.. బమ్మెర పోతన భాగవతం తెలుగు సాహిత్యంలో అజరామరమైన పురాణం. కందుూరి రుద్రకవి సుగ్రీవ విజయం తొలి యక్షగానం. తొలి శతకం ూడా తెలంగాణలోనేఉద్భవించింది. పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకం ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. దేశి ఛందస్సులో మొదటి ద్విపద కావ్యం బసవపురాణం సోమన రచించిందే. ఇది దేశిపురాణం కూడా. సంస్కృత పురాణ లక్షణాలకు పూర్తి భిన్నంగా రచించిన తెలుగు పురాణం ఇదే. ఈ సోమనాథుడే బసవోదాహరణం ద్వారా ఉదాహరణ ప్రక్రియను సృష్టించాడు. మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్రంను పొన్నగంటి తెలగణ రచించాడు. తెలుగులో తిరునామములు ప్రక్రియను రచించింది మరింగంటి లక్ష్మణ దేశికులు. ఠంయ్యాల లక్ష్మీనరసింహా చార్యులు తమ అష్టప్రహరి ద్వారా ప్రహరి ప్రక్రియను వెలుగులోకి తెచ్చారు. శుకమహాముని తన మౌఖిక ప్రక్రియ ఉపన్యాసం ద్వారా సమస్త వేద, పురాణ, ఇతిహాస సంగ్రహాలను విశ్వవ్యాప్తం చేసినట్టే, తెలుగునాట దాన్ని మళ్లీ ఒక ప్రక్రియగా వెలుగులోకి తీసుకొచ్చి సాహిత్య సృజన చేసిన వారు కోవిల్‌ కందాడై రంగాచార్యులు.

అవధానాన్ని మొదట జైనులు మొఘలుల ఆస్థానంలో అక్బర్‌ కాలంలో చేసినట్లు చరిత్ర చెప్తున్నది. ఆ జైన గురువుల ద్వారా తెలుగునాట వ్యాప్తి చెందింది. హైదరాబాద్‌, నల్లగొండ, వరంగల్లు జిల్లాల్లో ప్రధానంగా విస్తరించిన జైనుల ద్వారానే అవధానం తెలుగులోకి వచ్చింది. శ్రీమదాంధ్ర మహాభారత అనువాద బాధ్యతను రాజమహేంద్రవరం రాజు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడికి అప్ప గించినప్పటికీ ఆయన రెండున్నర పర్వాలను మించి రాయలేకపోయాడు. ఆ తరువాత దాదాపు వందేండ్ల పాటు మహాభారతం ఆంధ్రీకరణ పూర్తి కాలేదు. నెల్లూరు రాజు మనుమసిద్ధిని రక్షించుకొనేందుకు అతని మంత్రి తిక్కన సోమయాజి వరంగల్‌కు వచ్చి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి(1199-1262)ని వేడుకొన్నాడు. ఆ సందర్భంలోనే తన మహాభారత ఆంధ్రీకరణను ప్రస్తా వించాడు. తాను అనువదించిన పద్యాలను వినిపించినప్పుడు సంత సించిన గణపతిదేవుడు మహాభారత ఆంధ్రీకరణ పూర్తి చేయడానికి సంపూర్ణ ప్రోత్సాహాన్ని ప్రకటించాడు. ఆ విధంగా కాకతి గణపతిదేవుడి ప్రోత్సాహంతోనే మహాభారత ఆంధ్రీకరణ పూర్తయినది. తెలుగువారికి తొలి నాట్యశాసా్తన్ని అందించింది జాయపసేనాని తన నృత్తరత్నా వళితోనే.. ఇంకా ఇందులోని ఎనిమిదో అంకంలో ఉన్న పేరిణిని ఒక్కదాన్నే నటరాజరామకృష్ణ వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఇందులో శాస్త్రీయ నృత్య ప్రక్రియలను (మహిళలు ూడా చేయదగినవి) వెలుగులోకి తేవలసి ఉన్నది.

ఇలా ఒక్కటేమిటి, చాలా ప్రక్రియలు ఇక్కడే పుట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉప్పొంగిన సృజన మరెక్కడా మచ్చుకైనా కనిపించదు.. చిత్రకవిత ఇక్కడే అభివృద్ధి చెందింది. సృజనాత్మకత విషయంలో తెలుగు సాహిత్యంలో నూతన ప్రక్రియ ఆవిష్కారంలో తెలంగాణాదే ప్రథమ స్థానం అనటంలో ఎలాంటి సందేహం అక్కర లేదు.

తెలంగాణలో సాహిత్య స్రవంతి ప్రధానంగా మూడు మార్గాలలో సాగింది. మొదటిది రాజ్య ధిక్కార లక్షణం.. రెండవది ప్రజలకు వారి భాషలో చెప్పటం.. మూడవది భాషలో, సాహిత్యంలో అనంతమైన ప్రయోగాలు చేస్తూ పోవటం… ఆది కథకుడు గుణాఢ్యుడు నాడు కుంతల శాతకర్ణిని ధిక్కరించిన వాడు.. ఆ తరువాత పాల్కురికి సోమనాధుడు.. ఆయన కవిత్వమే అధిక్షేపాన్ని ఆధారం చేసుకుని సాగింది. ఆయన శివుణ్ణి తప్ప మరెవరినీ పూజించే ప్రశ్నేలేదు పొమ్మంటే.. దాదాపు ఆయనకు సమకాలికుడే అయిన గోన బుద్ధారెడ్డి రాముణ్ణే కొలుద్దాం రమ్మన్నాడు.. ఇమ్మనుజేశ్వరాధములకు నిన్ను ఇవ్వనని తన కావ్య సరస్వతికి బమ్మెర పోతన తెగేసి చెప్పాడు.

సంప్రదాయం, విప్లవం అన్న తేడా లేకుండా ఇక్కడి కవుల్లో అత్యంత సహజంగానే ఈ అధిక్షేపం కనిపిస్తుంది. నిజాం కాలంలో ఉర్దూ రాజభాష అయినా, ఉర్దూ పారశీక భాషా సాహిత్యాల ప్రభావం ఇక్కడి సాహిత్యం మీద పడలేదు. రాజభాషగా ఉర్దూ కొద్దిమంది అధికారుల గృహాల పరిమితమైంది. ఆ విద్యావ్యాప్తి పరిమితం కావటం వల్ల ప్రజల్లోకి చొరబడలేదు. అందువల్ల తెలంగాణాలో తెలుగుభాష ఇతర ప్రాంతాల్లో ఇంగ్లీషు భాష వల్ల పొందిన వికారాలను పొందలేదు. ఇక్కడి పలుకుబడి స్వచ్ఛంగా, అవికృతంగా ఉన్నది.

ఆధునిక సాహిత్య వికాసం, పాశ్చాత్య ప్రభావం వల్ల ‘బ్రిటిష్‌ తెలుగు ప్రాంతం’లో భావకవిత్వ, అభ్యుదయ కవిత్వోద్యమాలు, ప్రయోగవాదము వచ్చాయి. కానీ, ఇక్కడ 1948 దాకా వాటి ప్రభావం చెప్పుకోదగినంతగా లేదు. 1946-47లలో దాశరథి వల్ల ఆధునిక కవిత్వం ఉధృతంగా ప్రవహించినా, దానిపై ఈ ఉద్యమాల ప్రభావాలతో పాటు దేశీయ కావ్యరూపం, అభివ్యక్తి, ప్రజల ఆకాంక్షలు అత్యంత శక్తిమంతంగా ప్రస్ఫుటమయ్యాయి.

ఓయి నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాన్నెడేని.. తీగలను తెంపి అగ్నిలో దింపినావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మరింత ముందుకు వెళ్లి..

నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తార్చినాను అని నిజాం సంళ్లుె తెగిన సందర్భంలో సంబరపడ్డాడు.

తెలంగాణా సాహిత్య స్రవంతిలో కొనసాగుతూ వచ్చిన వాళ్లు ఏ ఒక్క ప్రక్రియకో పరిమితం కాలేదు.. ఇక్కడి కవుల్లో భాషాభేదాలు లేవు.. ప్రక్రియా పరిమితులు లేవు.. ఛందః సంళ్లుె అంతకంటే లేవు.. తెలంగాణాలో పుట్టిన ప్రతి కవీ, తెలంగాణ మట్టి వాసన చూసిన ప్రతి రచయితా మార్గ, దేశి సంప్రదాయాలను తనలో సంలీనం చేసుకున్నవాళ్లే.. ఇక్కడ మార్గదేశికవిత్వం పరస్పర విరుద్ధాలుగా కాకుండా, పరస్పర కవి పోషకాలుగా కొనసాగాయి. ఇక్కడి కావ్యాలలో దేశి లక్షణాలు, ఇక్కడి దేశివాఙ్మయంలో మార్గకవిత్వ లక్షణాలు సమ్మిళితమై కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ గ్రాంధిక, వ్యవహార భాషా అన్న వాదాలకు తావు తక్కువ. ఇక్కడి భాష పూర్తిగా ప్రజల జీవనాడుల్లో ప్రవహించిన అచ్చమైన తెలుగు కావటమే ఇందుకు కారణం. తెలుగులోని సుసంపన్నమైన పదసంపద తెలంగాణలోనే కనిపించటం వల్ల పద్యం రాసినా, వచనం రాసినా అది ప్రజలకు చేరువైపోయింది.

‘బ్రిటిష్‌ తెలుగు’ ప్రాంతాల్లో ప్రామాణిక, మాండలిక భాషలంటూ వేర్వేరు ప్రమాణాలు ఉండవచ్చు. కానీ, తెలంగాణలో రెండూ ఒకటే కావటం ఇక్కడి సాహిత్యంలో అచ్చమైన తెలుగు కావ్యాలు రావటానికి, కవిత్వం రావటానికి కారణమైంది. ఇక్కడ ప్రక్రియల పట్ల విముఖత ఎంతమాత్రం కనిపించదు.. తెలంగాణాలో వచనకవిత్వం రాసిన ఎంతోమంది కవులు పద్యాలు రాసిన వాళ్లే.. రాస్తున్న వాళ్లే. ఇక్కడి రచయితకు రాజ్యధిక్కారం తెలుసు.. ప్రజలను చైతన్యవంతులను చేయటమూ తెలుసు.. నీతి బోధించటం తెలుసు.. ఆహ్లాదకరంగా కథ చెప్పటం తెలుసు.. కవిత్వ రూపంలో కథ చెప్పిన ఘనత తెలంగాణ రచయితదే. సింహాసన ద్వాత్రింశిక ద్వారా ఈ రకమైన కథన సంప్రదాయానికి మార్గనిర్దేశనం చేసిన కొరివి గోపరాజు దగ్గర నుంచి ఇటీవలే విడుదలైన కడుపుకోత కథా సంపుటి రచయిత ఓదెల వెంకటేశ్వర్లు దాకా ూడా ఒక అద్భుతమైన కథా వైశిష్ట్యాన్ని నిలుపుకుంటూ వచ్చిన వాళ్లు ఎందరో ఈ గడ్డపై ఉన్నారు..

ఉదయరాజు శేషగిరిరావు కవిత్వంతో పాటు నిఘంటు నిర్మాణం చేశారు. రంగరాజు శేవరావు ప్రబంధాన్ని రచించారు.. చిలకమర్రి రామానుజాచార్యులు, వానమామలై జగన్నాథా చార్యులు, అనుముల కృష్ణమూర్తి, కవిరాజ మూర్తి, పేర్వారం జగన్నాథం, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, వే.నరసింహారెడ్డి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ ప్రతిభను వ్యక్తీకరించిన వారే.. వీళ్లు ఒక్క తెలుగుకు మాత్రమే కట్టుబడిన వారు కారు.. ఉర్దూ, పార్శీ, ఇంగ్లీష్‌ భాషల్లోనూ ప్రయోగాలు చేశారు.. తమ కవిత్వాన్ని తామే చదువుతూ ఉపన్యసించే విధానం ఇక్కడే ఉంది.

ఆధునిక సాహిత్యంలోనూ ఈ ప్రయోగవాదం, పోరాట వాదం కొనసాగుతూ వచ్చింది. నిజాం కాలం అనంతరం ూడా తెలంగాణాలో బతుకు పోరాటం ఆగకపోవటమే ఇందుకు కారణం. ఆ పోరాటంలోనుంచి పాటై, వచనమై, పద్యమై, కథై సాహిత్యం అనేక రూపాలు సంతరించుకుంది. తెలంగాణాకు మొదట్నుంచీ కవిత్వంతో పేగుబంధం ఉంది. ఇప్పటికీ తెలంగాణా జిల్లాల్లో పద్య రచన నిరాటంకంగా సాగుతూనే ఉన్నది.

చిట్టాడి కాయలు, చిటిలి గింజలు రాల్చు
నువు చేనిలోన పండుగలొనర్చి
మునుముట్ట కుప్పనూర్చిన వరి కళ్లాన
పేర్మి బందుగులతో విందుగుడిచి…(వేముగంటి నర్సింహాచార్యులు)

ఈ సాహిత్య సృజన చదువుకున్నవాళ్లకో, పండితులకో పరిమితం కానేలేదు. కొన్ని కులాలకో, వర్గాలకో, మతాలకో పరిమితం కాలేదు. ఇక్కడి సృజన అనుభవంలోనుంచి పుట్టుకొచ్చింది. జీవితంలోనుంచి ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరిలోనుంచి కథ, పాట, కవితలు పుట్టుకొ చ్చాయి. నీ పాటనై వస్తున్నానమ్మా.. ఓ అక్కలార.. నీ పాదాలకు వందనాలమ్మో..అన్న గద్దర్‌.. పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల… అన్న గోరటి వెంకన్న, జననీ జయతేనం అన్న అందెశ్రీ తెలంగాణాకు పాటను ప్రాణంగా మలిచారు. పాఠశాల ముఖమైనా ఎరుగని ఓ బడుగుజీవి హృదయం లోంచి మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడూ.. మచ్చుకైనా లేడు సుమ్మా మనిషన్నవాడూ అంటూ అపూర్వమైన సాహిత్యం వెలువడింది.

ఆధునిక కవితా స్రవంతిలో ఎంతోమంది తెలంగాణా ప్రాంతం నుంచి తమ కవితా లతల్ని విరబూయించారు..

నడిచొచ్చే పంట కాలువకు/ ప్రాణశక్తివి నీవని/మోటగొట్టే బావుల కాడ/ఆయిలింజల్ని పీసిే/మోటార్లు బిగించుకుంటిమి/ కానిట్లా/చేనిట్లా కరెంటు బిల్లై కాలుద్దని/ ఇంటిల్లి పాదీ/ కడుపుమంట కారుచిచ్చై రగులుద్దని/ అదిట్లా-ఊర్లొదిలి, వాడలొదిలి, పట్టణాల పొలిమేరలు దాటి ముష్టి ఘాతుకాల వలయాల్లో చిక్కి, దిష్టిబొమ్మల కాల్చి కాల్చి ఆశల మేరు పర్వతమైందన్న సంగతి ఎట్లా చెప్పేది.. మరెట్లా బతిదిే..(పొట్లపల్లి శ్రీనివాసరావు-బర్కతులేని బతుకు)

వలసపాలనలో తన పంటకు నీళ్లివ్వటం కోసం దారుణమైన కష్టాన్ని అనుభవిస్తున్న రైతు స్వేదానికి ఇది శబ్దచిత్రం.

బాధలతో, వేదనలతో, సంతోషావశేషాల స్మృతుల తరగలతో
తీరం దిక్కు పరిగెత్తుతూనే ఉంటుంది అదృశ్వాశ్యమై
కానీ నీ తెలియదు.. నీ తీరమేమిటో..
(రామా చంద్రమౌళి, జ్ఞానారణ్యం)
సృష్టి మాది, దృష్టిలోపం మీదే..
కన్నీళ్లకు రూపమిచ్చి కళాహీనులమయ్యాం..
రక్తంలోంచొచ్చిన మేం మీకు ఆకలవుతున్నాం..(నల్లవలస, శిరసు)

నదులు నడిచిన నేల, నంది నడిచిన నేల, నాగళ్లకోండ్రళ్ల, తానమాడిన నేల, నేడు మిగిలేనులే జంగమోని పాత్ర.. నోరుగెరిచిన యాల, నోటికిందనే జాలు..(సుంకిరెడ్డి నారాయణరెడ్డి, దాలి)

ప్రాచీన కవుల సంగతి సరేసరి.. మన మధ్యనే అపూర్వ సాహిత్యాన్ని వెలువరిస్తున్న వాళ్లను లెక్కపెట్టడం సాధ్యమయ్యే పని కాదు..

కొంపెల్లి వెంకట్‌, సత్యలక్ష్మి, కోడూరి విజయకుమార్‌, ఖాజా, ఎన్‌.వేణుగోపాల్‌, చెరుకు సుధాకర్‌, గూడ అంజన్న, ఆజం అలీ, పగడాల నాగేందర్‌, గౌస్‌ మొహియుద్దీన్‌, రామగిరి శివకుమార శర్మ.. బి.రాము లు, బోయ జంగయ్య, జూలూరి గౌరీశంకర్‌, కాసుల లింగారెడ్డి, ఏలేశ్వ రం నాగభూషణాచార్య, పులిపాటి గురుస్వామి, శేషం సుప్రసన్నాచార్య, నందిని సిధారెడ్డి, అన్వర్‌, అల్లం నారాయణ, లోశ్వేర్‌, అనిశెట్టి రజిత, శ్రీరంగ స్వామి, వఝల శివకుమార్‌, తెలిదేవర భానుమూర్తి, జూకంటి జగన్నాధం, దెంచనాల శ్రీనివాస్‌, కాసుల ప్రతాపరెడ్డి, స్కైబాబా, దర్భశయనం శ్రీనివాసాచార్య, తిరునగరి శ్రీనివాస్‌, యాూబ్‌, ననుమాస స్వామి, ఎల్‌వి, ఎల్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌లు, దేశపతిశ్రీనివాస్‌.. జితేందర్‌… వరిగొండ కాంతారావు, నమిలికొండ బాలకిషన్‌ రావు….

ఇలా తెలంగాణ జిల్లాల్లో పుట్టుకువచ్చిన కవుల పేర్లు రాసుకుంటూ పోతేనే ఒక పెద్ద గ్రంథం అవుతుంది.. కవుల మాట ఇలా ఉంటే, కథకులు, విమర్శకుల సంగతి సరే సరి… ఒక్కో రచయిత ఒక్కో సాహిత్య కుసుమం.. ఇంత సాహిత్య చరిత్ర ఉండి, సారస్వత కవి సముదాయం కలిగి ూడా తెలంగాణ సాహిత్యం ఎందుకు ప్రాచుర్యం పొందలేదు.. శ్రీశ్రీకి తెలుగు సాహిత్యంలో ఉన్న స్థానం కాళోజీకి ఎందుకు లేకుండా పోయింది? తొలినాటి నుంచి ప్రజల భాషలో, జానపదంలో, అచ్చ తెలుగులో వేలాది రచనలు వచ్చినా… వ్యవహార భాషా రచనగా కన్యాశుల్కాని ఎందుకు పేరు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ కవుల్లో ప్రధానంగా కనిపించే నిర్లిప్తత. అనాసక్తత.. తన పని రచించుకుంటూ పోవటమే తప్ప.. ప్రచారం చేసుకోవటం ఇక్కడి వారికి తెలియదు.. అలాంటి వాళ్లు దుర్భిణీ వేసి వెతికితే ఒకరిద్దరు కనిపిస్తారేమో.. అందువల్లనే ఆనాడు ముడుంబై వేంకట రాఘవాచార్యులు..నిజాం రాష్ట్రంలో తెలుగు కవులు పూజ్యము అనగలిగారు.. అంతే కాదు.. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం విలీనం అయిన తరువాత సాహిత్య విధ్వంసం ప్రాతిపదికగా సాంస్కృతిక ధ్వంస రచనకు శ్రీకారం జరిగింది. మొట్టమొదట ఇక్కడ ఎలాంటి సృజన అన్నది జరగనే లేదని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.. బమ్మెర పోతన్నను వరంగల్‌ వాడు కాదని, కడప జిల్లా ఒంటిమిట్ట వాడని కనీవినీ ఎరుగని వాదనను లేవదీశారు.. అదే నిజమేనేమో అన్నంతగా ప్రచారం చేశారు.

వేముల వాడ భీమకవిని ద్రాక్షారామానికి చెందిన వాడంటూ మరో కథను సృష్టించారు. పాల్కురికి సోమనాథుడు కర్ణాటకలో ఎక్కడో హాల్కురికి అనే ఊరుందని, అక్కడి నుంచి వచ్చినవాడన్నారు.. మల్లినాథసూరిని, అప్పకవిని.. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఓ పాటో, ఓ పద్యమో, ఓ కథో, ఓ కవితో , ఓ విప్లవమో ఏదైనా ఒక సృష్టి జరిగితే, దాన్ని సృష్టించిన వాడు తెలంగాణా ప్రాంతం వాడు కాదని నిరూపించేందుకు విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించాల్సి వచ్చింది. మల్లినాథసూరి మెదక్‌ జిల్లా కొలిచెలిమ ప్రాంతానికి చెందిన వాడు. కాకునూరి అప్పకవి మహబూబ్‌ నగర్‌ వాసి. వీళ్లందరినీ ఇక్కడినుంచి తరలించుకుపోయేందుకు తీవ్రంగానే ప్రయత్నం, కుట్ర జరిగింది. ఇక్కడి మేధావులు గట్టిగా తిప్పి కొట్టారు కాబట్టి ఈ జాతి సృజన జీవనం ఈ కాస్తయినా మిగిలింది. ఇప్పుడు తెలంగాణ సాహిత్యానికి స్వర్ణయుగం ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు మహాసభలు మనల్ని మనం విస్తృతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. తెలంగాణ సాహిత్యం అంటే గొంగళి కప్పుకొని పాట పాడటమే అన్న దశ నుంచి బయటకు లాగి అన్ని ప్రక్రియల్లో జరిగిన అనంతమైన సృజనను నిలబెట్టుకోవాలి. ప్రపంచానికి చాటిచెప్పాలి.

కోవెల సంతోష్‌ కుమార్‌

తెలంగాణలో పుట్టిన సాహిత్య ప్రక్రియలు

తొలి కథ.. బృహత్కథ-గుణాఢ్యుడు
తొలి పురాణం..విక్రమార్జున విజయం-పంపన
తొలి లాకూజుణిక గ్రంథం-కవిజనాశ్రయం- మల్లీయ రేచన
తొలి కందపద్యం-జినవల్లభుడి శాసనం
తొలి లాకూజుణిక కావ్యభాష -గూడూరు శాసనం-విరియాల కామసాని
తొలి రామాయణ అనువాదం-
రంగనాథ రామాయణం -గోన బుద్ధారెడ్డి
తొలి పురాణ అనువాదం-మార్కండేయ పురాణం –
న్నసేనాని(కాకతీయుల సేనాని)
తొలి యకూజుగానం..సుగ్రీవ విజయం-కందుకూరి రుద్రకవి
తొలి శతకం-వృషాధిప శతకం -పాల్కురికి సోమనాథుడు
తొలి ద్విపద-బసవపురాణం-పాల్కురికి సోమనాథుడు
తొలి దేశి పురాణం-బసవ పురాణం-పాల్కురికి సోమనాథుడు
తొలి ఉదాహరణం-బసవోదాహరణం-పాల్కురికి సోమనాథుడు
తొలి అచ్చతెనుగు కావ్యం-యయాతి చరిత్రం-పొన్నగంటి తెలగణ
తొలి తిరునామములు-మరింగంటి లకూజ్ముణ దేశికులు
తొలి ప్రహరి- అష్ట ప్రహరి-ఠంయాల లకీూజ్మునరసింహాచార్యులు
తొలి నాట్యశాస్త్రం-నృత్తరత్నావళి-జాయపసేనాని
(కాకతీయ సేనాని)
tsmagazine

Other Updates