singareniసింగరేణి కాలరీస్‌ ఈ ఏడాది సాధించిన లాభాల్లో కార్మికులకు 21 శాతం వాటా చెల్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. కార్మికుల నుంచి వృత్తి పన్ను (ప్రొఫెషనల్‌ టాక్స్‌) కూడా వసూలు చేయవద్దని ముఖ్యమంత్రి చెప్పారు.
సింగరేణిపై క్యాంపు కార్యాయంలో సెప్టెంబర్‌ 24న సిఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, సింగరేణి సిఎండి శ్రీధర్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సింగరేణి లాభాల్లో కార్మికులకు 18 శాతం వాటా చెల్లించేవారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది (2013-14) లాభాల్లో వాటాను 20 శాతానికి పెంచారు. ఈ ఏడాది (2014-15) సంవత్సరం లాభాల్లో 21 శాతం కార్మికులకు వాటాగా చెల్లించాలని నిర్ణయించారు. ఈ ఏడాది సింగరేణి రూ.491 కోట్ల లాభం ఆర్జించింది. ఇందులో 21 శాతం వాటా రూ. 103.11 కోట్లు కార్మికులకు అందుతుంది. సింగరేణిలో పనిచేసే 60 వేల మంది కార్మికులకు వ్యక్తిగతంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లాభం అందుతుంది.

సింగరేణి కార్మికులు ఎంతో కాలంగా కోరుతున్న ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ మినహాయింపుపై కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల నుంచి ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ వసూలు చేయవద్దనే విధాన నిర్ణయం తీసుకుంటామని, ఇకపై వృత్తిపన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. 1990 నుంచి ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ ద్వారా ప్రభుత్వానికి బకాయి ఉన్న రూ.175 కోట్లను కూడా మాఫీ చేయాని సిఎం నిర్ణయించారు. గత బకాయిు మాఫీ చేయడంతో పాటు ప్రతీ ఏడాది వసూలు చేయాల్సిన రూ.15 కోట్ల మేర వృత్తి పన్ను కూడా ఇకపై వసూలు చేయరు.

Other Updates