krishna-pushkara-ghatsకృష్ణా పుష్కరాలకు ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పుష్కర ఏర్పాట్ల పనులు ఊపందుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణలో జరుగుతున్న తొలి కృష్ణా పుష్కరాలు కావడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

ఆగస్టు 12న ప్రారంభమై 12రోజులపాటు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి.

తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో జరిగే పుష్కరాలకు కేవలం తెలంగాణ నుంచేకాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులు విడిది చేసేందుకు తాత్కాలిక షెడ్లు, తాగునీటి వసతి, రహదారుల నిర్మాణం, వైద్య వసతి తదితర ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు జిల్లాల్లో రూ.212 కోట్ల ఖర్చుతో మొత్తం 4852 మీటర్ల వెడల్పుతో 86 పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నారు. గోదావరి పుష్కరాల కంటే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం అదనంగా రూ.118 కోట్లను కేటాయించింది. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు మరమ్మతులు చేయాలని సర్కారు సంకల్పించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.54 కోట్లను కేటాయించింది.

కృష్ణా పుష్కరాలకు మరో రెండు నెలల సమయం ఉండటంతో పనులను ముమ్మరం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పుష్కర ఏర్పాట్ల ,పనులను పరిశీలించేందుకు మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో పలువురు మంత్రులు పర్యటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పుష్కర ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రంగాపూర్‌, బీచుపల్లి, జూరాల వద్ద స్నాన ఘట్టాల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభిం చారు. ఆలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల వసతి గృహం కోసం నూతన భవన నిర్మాణానికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. సోమశిల, మంచాలకట్ట, జెట ప్రోల్‌, చెల్లెపాడు, కొల్హాపూర్‌ వద్ద పుష్కర ఘాట్ల పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పుష్కర ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. జూలై లోపే అన్ని పనులను పూర్తి చేయాలని… నాణ్యతలో తేడా రావద్దని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల కంటే ఘనంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించాలని.. అందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని దేవాదాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు.

మరోవైపు నల్గొండ జిల్లాల్లో కూడా పుష్కర పనులు ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నల్గొండ జిల్లాలో పలు చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వరాష్ట్రంలో జురుగు తున్న కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహి స్తామని.. ఖర్చుకు వెనుక డుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు.

కృష్ణా పుష్కరాలకు రూ.601 కోట్లు ఇవ్వండి

ప్రధాని మోడీకి సీయం కేసీఆర్‌ లేఖ

కృష్ణా పుష్కరాల నిర్వహణకు రూ.601 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో రెండు జిల్లాల్లో వివిధ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, భక్తులకు ప్రత్యేక సౌకర్యాల కల్పనకు రూ.802.19 కోట్లు అవసరమని తెలిపారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించామని, అయితే భారీగా వ్యయం జరిగే అస్కారం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రాలకు అందించే వన్‌టైమ్‌ అసిస్టెన్స్‌గా కనీసం రూ.601.65 కోట్లను మంజూరు చేయాలని లేఖలో కోరారు.

మహబూబ్‌నగర్‌ పుష్కర ఘాట్ల (52)వివరాలు :

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో 10 ఘాట్లు, కొల్లాపూర్లో 4, వీపనగండ్లలో 7, ఆత్మకూర్లో 9, పెబ్బేర్లో 7, గద్వాలలో 4, ధరూర్లో 5, అలంపూర్లో 3, అచ్చంపేటలో 2, ఇటిక్యాల మండలంలో బీచుపల్లి వద్ద ఒక పుష్కరఘాట్‌ ఏర్పాటు చేయనున్నారు.

నల్గొండ పుష్కర ఘాట్ల(34) వివరాలు

చందంపేట మండలం కాచరాజుపల్లి, పెద్దమునిగల్‌, పీఏపల్లి మండలం అమ్మాపురం, పెద్దవూర మండలం ఉట్లపల్లి, పొట్టిచెల్మ ఘాట్‌(సాగర్‌ మొసళ్లపార్కు వద్ద), ఆంజనేయస్వామి ఘాట్‌(సాగర్‌ బ్రిడ్జి వద్ద), దామరచర్ల మండలంలో శివాలయం, అడవి దేవులపల్లి, ముదిమాణిక్యం, ఇర్కిగూడెం, అయ్యప్పస్వామి టెంపుల్‌, ఓల్డ్‌ సిమెంట్‌ రోడ్డు, ముద్దిరాజు రేవు, పాత పోలీస్‌ స్టేషన్‌, మెట్ల రేవు, లక్ష్మీపురం రేవు, శివాలయం, నర్సింహాస్వామి టెంపుల్‌, నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం, మఠంపల్లి, ప్రహల్లాదఘాట్‌, బుగ్గమాదారం, కిష్టాపురం, వజినేపల్లి, కనగల్‌ మండలంలోని కనగల్వాగు, ధర్వేశిపురం, నల్లగొండ సమీపంలోని ఛాయాసోమేశ్వర స్వామి ఆలయం వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయనున్నారు.

Other Updates