rajanarsసిద్ధిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా కడవెర్గు రాజనర్సు ఎన్నికయ్యారు. రాజనర్సు గతంలో కూడా సిద్ధిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా పదవిని నిర్వహించారు. ఈ పదవిని చేపట్టడం రాజనర్సుకు ఇది రెండవ సారి. రాజనర్సు మున్సిపాలిటీలోని 16వ వార్డు నుండి ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రాజనర్సుతో పాటు మొత్తం ఆరుగురు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 వార్డులకు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరుగగా 11వ తేదీన ఫలితాలు ప్రకటించారు. 28 వార్డులకు ప్రకటించిన ఫలితాల్లో 16 వార్డులను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకున్నది. పలితాల తరువాత స్వతంత్య్ర అభ్యర్థులుగా గెలిచిన 6గురు కౌన్సిలర్లు టిఆర్ఎస్ లో చేరారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 6గురితో కలిపి మున్సిపాలిటీలో టిఆర్‌ఎస్‌ బలం 28 మందికి చేరింది. టిఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపాలిటీలో అధికారాన్ని చేపట్టింది. మున్సిపల్‌ ఛైైర్మన్‌గా కడవెర్గు రాజనర్సును కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Other Updates