కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం సిరిసిల్ల మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మకమైన ‘స్కోచ్’ అవార్డు లభించింది. ఈ అవార్డును డిసెంబరు 22న ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. తడిచెత్త, పొడిచెత్త సేకరణ, వినియోగం, పౌరసేవాకేంద్ర నిర్వహణ, వందశాతం పన్ను వసూళ్ళు, వీధిదీపాల నిర్వహణ విభాగాల్లో సిరిసిల్లకు ఈ అవార్డు దక్కింది. గతంలో కూడా ఈ అవార్డును సిరిసిల్ల మున్సిపాలిటీ దక్కించుకుంది. ఈ అవార్డు రావడం ఇది రెండవ సారి. నవంబరు 22న మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఢిల్లీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో సిరిసిల్ల మున్సిపాలిటీలో పారిశుధ్యం, వీధిదీపాలు, పౌర సేవలకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాన్ని చూసిన తరువాత సంతృప్తి చెంది స్కోచ్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ సామల పావని, కమిషనర్ కేవీ రమణాచారి మీడియాతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినందువల్లనే ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు.
హోం
»