సిస్కో కంపెనీతో స్మార్ట్ సిటీ ప్రణాళిక కోసం తెలంగాణ ప్రభుత్వం యంవోయు కుదుర్చుకున్నది. ఈమేరకు మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావవు కార్యాలయంలో మంత్రి సమక్షంలో యంవోయు ఏర్పాటు కార్యక్రమం జరిగింది. సిస్కో స్మార్ట్ సిటీ ప్రణాళికలు, సొల్యూషన్స్ కు ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన సంస్ధ. ఈ యంవోయులో భాగంగా ”స్మార్ట్ సిటీ హైరాబాద్” అనే కాన్సెప్ట్ తో నగరాన్ని స్మార్ట్ సీటిగా మార్చేందుకు వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పౌరులకు సేవలను అందించేందుకు సిస్కో ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం మెదటి సారిగా 2016లో సిస్కో స్మార్ట్ సిటీ & ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (INTERNET OF THINGS) రంగంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఓ యంవోయుని కుదుర్చుకుని ఇప్పటికే టిహబ్‌తో కలిసి పనిచేస్తున్నది. ఈ యంవోయు స్పూర్తి మేరకు సిస్కో నగరంలో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నది. ఈ పైలట్ ప్రాజెక్టు తాలుకు యంవోయును మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో జియచ్ యంసి కమీషనర్ జనార్దన్ రెడ్డి, సిస్కో ఇండియా యండి పురుషోత్తమ్ కౌషిక్‌లు యంవోయు పైన జూలై 21న సంతకాలు చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైటెక్ సిటీ ప్రాంతంతో స్మార్ట్ సిటీ సోల్యూషన్స్ ద్వారా పలు సదుపాయాలను కల్పించనున్నారు. సిస్కో సంస్ధ, వ్‌ీబఱ్‌వసంస్ధతో కలిసి ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కింది సేవలను అందించనున్నట్లు సంస్ధ మంత్రికి తెలిపింది.
• Smart WiFi • Smart Parking • Parking Enforcement to detect No Parking and Violation events • Smart Lighting •Smart Transport • Smart Kiosks • Remote Expert Governance Services • Citizen Services portal and Citizen App
పైన పెర్కోన్న సేవలను అందించేందుకు ఒక సెంట్రల్ సొల్యూషన్ వ్యవస్ధను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రికి సంస్ధ తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వతా ఈ స్మార్ట్ సీటీ సేవలను మరింతగా విస్తరించనున్నట్లు సంస్ధ తెలిపింది.