గంగదేవిపల్లె ప్రజు తమ గ్రామానికి ముఖ్య మంత్రిని రప్పించుకోగలిగారంటే ఇక్కడి ప్రజలో ఉన్న చైతన్యమేనని, తమ గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని, అభివృద్ధిబాటలో పయనింపచేశారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లె గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సంఘటితశక్తి ఎంతటి కఠినమైన పనినైనా సుభంగా సాధించగుగుతుందన్నారు. అందుకే గంగదేవిపల్లెను చూడడానికి దేశ,విదేశా నుంచి ప్రముఖు వచ్చి పోతున్నారంటే ఈ గ్రామప్రజ సంఘటితశక్తి ఖండాంతరాకు వ్యాపించిందని అన్నారు.
గంగదేవిపల్లెను రాష్ట్రంలోని మిగతా గ్రామా ప్రజు, ప్రజాప్రతినిధు ఆదర్శంగా తీసుకుని, వారిలాగా తమ గ్రామాను కూడా తీర్చిదిద్దుకోవాన్నారు. గ్రామంలో ప్రజంతా కలిసికట్టుగా తమ గ్రామానికి ఏ అభివృద్ధికార్యక్రమాు కావాలో తామే నిర్ణయించుకుంటే ఆ మేరకు నిధు మంజూరీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. ఒక్క గంగదేవిపల్లె కాకుండా రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామ ప్రజు కూడా సంఘటిత శక్తితో అద్భుతాు సాధించారన్నారు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎలా ఉన్నాయో అలాంటి అధునాతన భవనాు అంకాపూర్‌లోను అగుపిస్తాయన్నారు. అక్కడ రైతు అంతగా స్థితిమంతు కావడానికి వారి సమిష్టి కృషి మాత్రమే కారణమన్నారు. ప్రతి గ్రామం కూడా స్వయం పోషకంగా ఉండాన్నదే తన కోరిక అన్నారు. గ్రామంలో ఎరువు, బట్టు, చెప్పు ఇలా ఏవి కావాన్నా గ్రామంలోనే కొనుక్కునే విధంగా ఉండాని, పక్కనున్న నగరాకు, పట్టణాకు వెళ్ళి కొనుగోు చేసే పరిస్తితి రావద్దని అన్నారు. అందుకై గ్రామస్థుంతా కలిసి నిరుద్యోగ యువకుకు ఇలాంటి దుకాణాు పెట్టించాని అన్నారు. ఈ విధంగా గ్రామాు స్వయం పోషకాుగా మారిపోతే రాష్ట్రం అభివృద్ధిపథంలో సాగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఎం.పి.ు, ఎమ్మెల్యేు, మంత్రు, ఇతర ప్రజాప్రతినిధు ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాని సూచించారు. గ్రామాలో ముఖ్యంగా పారిశుధ్య సమస్య ఉందని, దాన్ని అధిగమించడానికి గ్రామస్థుంతా గట్టి నిర్ణయం తీసుకోవాని కోరారు. గ్రామజ్యోతికి నిధు కొరత లేదని, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే వెనుకాడేది లేదని సీఎం గ్రామస్థుకు భరోసా ఇచ్చారు. గ్రామాలోని ప్రజంతా చేతు కలిపితే వేకోట్ల సంపదన సృష్టించగరన్నారు. ప్రజు అభివృద్ధిచెందితేనే బంగారు తెంగాణ సాధ్యమవుతుందన్నారు.
అవరోధాను అదిగమిస్త్తూ ముందుకుసాగాని చెబుతూ మెతురు ఉన్న చోట చీకటి ఉంటుందని, అలాగే మన కార్యక్రమాను వ్యతిరేకించే వాళ్ళు మన మధ్యే ఉంటారని అన్నారు. వారిని చూసి బెదిరిపోకుండా ధైర్యంతో ముందడుగు వేయాని పిుపునిచ్చారు. వ్యక్తుగా ఎవరికివారు బాగున్నా సంఘంగా పను సాధించలేక పోతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి గ్రామం స్వయం పానతో స్వయం సమృద్ధి సాధించాన్నదే గ్రామజ్యోతి క్ష్యమన్నారు. ఏ విషయంలో కూడా గ్రామాు ఇతరు పైన ఆధారపడరాదన్నారు. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్లని అన్నారు. గ్రామాలోని రైతు వ్యవసాయంలో ఆదునిక పద్దతు పాటించి సంపన్ను కావాన్నారు.
రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మ్కునూరు, వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాు ఆదర్శంగా నిలిచాయన్నారు. తెంగాణలోని అన్ని గ్రామాు ఈ గ్రామా మాదిరిగానే స్వయంపోషకాలై బంగారు తెంగాణను తేవాని పిుపునిచ్చారు. మనం వెయ్యేండ్లు బతకమని, ఉన్నన్ని రోజు మంచిపను చేసి సమాజానికి మనవంతు తోడ్పాటును అందించాని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ పోరాటం చేశారు. ఈరోజు ఆయన భౌతికంగా లేకున్నా, ఆయన స్పూర్తి ఉందన్నారు. ఆ స్పూర్తితో మనం ముందుకు సాగాని పిుపునిచ్చారు.
మేడిపల్లిారాంపూర్‌లో..
మేడిపల్లిారాంపూర్ జంట గ్రామాలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పల్లెల్లో గుడంబా మహమ్మారి ప్రజను, ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడంబాను గ్రామానుంచి తరిమి కొట్టాని పిుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాు ప్రవేశపెట్టినా గుడంబా వ్ల అవి ఉపయోగంలోకి రావడంలేదని అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం కోసం రానున్న నాుగేండ్లలో ప్రభుత్వం నుంచి రూ. 4.10 కోట్లు రానున్నాయని, వాటితో పాటు ఇక్కడి దాతు అందచేసిన రూ. 1.75 కోట్ల రూపాయతో గ్రామాను అద్దంలా తీర్చిదిద్దుకోవాని ఆయన సూచించారు. ఇవే కాకుండా ముఖ్యమంత్రిగా తాను మరో రూ. 5 కోట్లు మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. మీ గ్రామానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినదాతను అభినందించారు.
కోటి రూపాయు విరాళమిచ్చిన యశోద ఆసుపత్రు యాజమాన్యం
యశోదా ఆసుపత్రు యజమాను గోరుకంటి రవీందర్‌రావు, సురేందర్‌రావు, దేవేందర్‌రావు తమ స్వగ్రామం అభివృద్ధి కార్యక్రమాను చేపట్టడానికి గాను రూ. కోటి చెక్కును సీఎం కేసీఆర్‌కు అందచేశారు. అలాగే తమకు గ్రామంలో ఉన్న 30 గుంట భూమిని కమ్యునిటీ హాు నిర్మాణానికి ఇచ్చారు. వీరితో పాటు చెన్నారావుపేట మండం లింగగిరికి చెందిన దొడ్డా మోహనరావు రూ. 50 క్షు, అమెరికాలో స్థిరపడ్డ ఫార్మాకంపెనీ యజమాని మిడియా సుధాకర్‌రావు రూ. 25క్షు విరాళాన్ని అందచేశారు. యశోదా ఆసుపత్రు యజమానును సీఎం కేసీఆర్ వేదికపై శాువా కప్పి సన్మానించారు. అనంతరం గ్రామస్థుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ గ్రామజ్యోతి ప్రారంభ కార్యక్రమాలో శాసనసభ సభాపతి సిరికొండ మధుసూధనా చారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎం.పి.ు వినోద్‌కుమార్, అజ్మీరా చందులాల్, తెంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాల్‌కిషన్, ఢల్లీిలో ప్రభుత్వ ప్రతినిధు వేణుగోపాలా చారి, రామచంద్రు, ఎమ్మెల్యేు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మాధవరెడ్డి, ఎమ్మెల్సీు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితయి పాల్గొన్నారు.