maga

క్లాసులో చాలా బాగా చదివే స్టూడెంట్‌ ఉన్నట్టుండి తన మార్కులు తగ్గుతు న్నాయి. క్లాసులో కూడా ముభావంగా కూర్చుంటుంది. మానస, ఈ విషయాన్ని, ఫిజిక్స్‌ లెక్చరర్‌ గమనించాడు. పిలిచి అడిగాడు. మానస ఏం జరిగింది. ఎందుకలా వుంటున్నావు. గమనిస్తున్నావా, నువ్వు సరిగ్గా క్లాసులో రెస్పాన్స్‌ ఇవ్వడంలేదు. ఏంటి సమస్య! వెంటనే అమ్మాయి బోరున ఏడ్చేసింది. కాసేపయిన తర్వాత తన స్నేహితురాలు తనతో మాట్లాడడంలేదని.. వేరే స్నేహితులను చేసుకుందని తనకు చాలా బాధగా వుందని… తనకు చచ్చి పోవాలనుందని ఎక్కిల్ల మధ్య చెప్పింది. తర్వాత ఆ స్టూడెంట్‌ను నా దగ్గరకు పంపించాడు. తర్వాత కొనిన సెషన్స్‌లో మానస మళ్ళీ యధావిధిగా మారిపోయింది.

రమేష్‌ ఈ మధ్యకాలంలో ఇంటిపట్టున ఉండడం తక్కువైంది. కాలేజీనుంచి ఆరు గంటలకు వస్తాడు.. వెంటనే మళ్ళీ వెళ్ళిపోతాడు. రాత్రి 9-930 గంటల ప్రాంతంలో వస్తాడు. ఏదైనా అంటె ఫ్రెండ్స్‌ అమ్మా! వాళ్ళందరికి అప్పుడే —-. కనీసం గంట/రెండు గంటలైన స్నేహితుల్ని కలవద్దా అంటాడు. పుస్తం పట్టి నెల రోజులయ్యింది. కాలేజీకి రోజూ వెళ్తున్నా… చదువుకోసం కాకుండా.. ఏదో అలా వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వస్తున్నాడు.. లెక్చరర్స్‌ కూడా రమేష్‌ చదువులో ఏకాగ్రత కోల్పోయాడని.. చెప్పితే నా దగ్గరకు తీసుకొని వచ్చాడు.

రశ్మి ఈ మధ్య కాలేజీకి రావటంలేదని కాలేజీనుంచి ఇంటికి ఫోన్‌ వచ్చినప్పటినుండి రశ్మి తల్లితండ్రులు షాక్‌లో వున్నారు.. అది ఒకటికాదు రెండు రోజుల కాదు. రెండు నెలలనుంచి.. ప్రతిరోజూ కాలేజీనుంచి వస్తున్నాను అని చెపుతుంది.. ఇంటినుంచి కాలేజీ బస్సు దగ్గరకు వాళ్ళ నాన్న డ్రాప్‌ చేస్తాడు.. మరి ఎక్కడికి వెళ్తున్నట్టు… విపరీత బాధలో.. కూతురు ఇంటికి వచ్చె సమయం కోసం ఎదురుచూస్తునానరు… రశ్మి వచ్చింది.. ఎక్కడినుంచి వస్తున్నావ్‌..

కాలేజీనుంచి..

నువ్వు కాలేజీకి వెళ్ళట్లెదట కదా.. కాలేజీనుండి ఫోన్‌ వచ్చింది.. లేదు రోజు వెళ్తున్నాను… వాళ్ళె.. సరిగ్గా అటెండెన్స్‌ వెయ్యడం లేదు.. అవునా?.. తెల్లవారి రశ్మితోపాటు తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళారు.. అస్సలు కాలేజీలో ఎవ్వరు గుర్తుపట్టలేదు.. ప్రయత్నంలో తెలిసిదేమిటంటె… మధ్యలో ఒక కొత్త ఫ్రెండ్‌ దొరికింది… ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఇద్దరు ప్రతిరోజు ఒక దగ్గర కలుసుకోవడం… హైదరాబాద్‌ అంతా తిరగడం.. కాలేజీ సమయానికి ఇంటికి వెళ్ళడం.. ఇదీ వరుస.. తర్వాత కొన్ని కౌన్సిలింగ్‌ సెషన్స్‌ తర్వాత.. కాలేజీకి వెళ్ళడం మొదలైంది… ఇంకా సెషన్స్‌ జరుగుతున్నాయి.

రోజులో గమ్మత్తైన మార్పు వచ్చింది. ఎప్పుడోగాని చదవని తను ఇప్పుడు చాలా రెగ్యులర్‌గా చదువుతున్నాడు. పరీక్షల్లో కూడా మంచి మార్కులొస్తున్నాయి. తరచుగా మహేష్‌ అనే మిత్రుడు ఇంటికి వస్తున్నాడు. రోజు వాళ్ళింటికి వెళ్తున్నా రు.. రాజు తల్లిదండ్రులు విస్మయంలో ఉన్నారు. అస్సలు వీడేనా! ఎన్సిసార్లు చదువు చదువు అని చెప్పినా చదవని రాజు రెండుమూడు నెలలనుంచి ఈ మార్పు. ఇది వుంటుందా? ఎందుకు వచ్చింది.. మరి ఎలా! దీన్ని అర్థం చేసుకోవడం. మహేష్‌ వల్ల వచ్చిందా? పూర్తిస్థాయిలో కన్‌ఫ్యూజన్‌… రోజంతా మహేష్‌ గురించే మాట్లాడుతుంటా డు.. ప్రతీది తన స్నేహితుడి.. ఆలోచనలతోనే నడుస్తాడు, తనకు ఇష్టం ఉండదు.. ఇప్పుడు తనను అడిగి ఏం చెయ్యాలో చేస్తాను..ఇలా ప్రతి విషయంలోనూ ఇలానే వుంటున్నాడు.. ఏం చెయ్యమంటారు అని అడగడానికి తల్లిదండ్రులు వచ్చారు.

పైన ఉదహరించిన పరిస్థితుల్లో.. ప్రతి విద్యార్తికి స్నేహితుల ప్రభావంతో ఎలా ప్రవర్తిస్తారో అనేది ప్రదానం. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. అయితే స్నేహితుల్ని, స్నేహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. వాళ్ళ స్థానాల్ని ఎలా పదిలపరచుకోవాలి. ‘స్నేహం’లో వున్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చెడిపోయారు అంటె వాళ్ళు చెప్పె మొట్టమొదటి మాట..స్నేమితులవల్ల చెడిపోయారు.. వాళ్ళ స్నేహితులందరూ… ఇలాంటి వాళ్ళె చదువులేదు, సంధ్య లేదు. ఒకటి తిరుగుడు.. పార్టీలు.. బర్త్‌డేలు.. రీయూనియన్‌లు.. లాంగ్‌ డ్రైవ్‌లు.. ‘పబ్‌’లు.. ఇంతే.. అబ్బెబ్బె.. ఈతరం అంతా చెత్తగా అయిపోయారు. అని ఆవేదనను వెళ్ళగక్కుతారు. దాంతో కొంతమంది విద్యార్థులకు అస్సలు స్నేహితులే ఉండరు. జీవితంలో అత్యంత విషాదం అస్సలు స్నేహితులు లేకపోవడం. జీవితానికి సంతోషపు జల్లులు కురిసేది.. నువ్వు ఎన్ని కష్టనష్టాల్లో వున్నా స్నేహితులవల్లెనని కొన్ని కోట్లమంది అభిప్రాయం. మరి ఇంత ఎక్స్‌ట్రీమ్‌ ఒపీనియన్‌ వున్న స్నేహితులలో ఎన్నిరకాలుంటాయో వాటిని ఎలా నిర్వచించవచ్చో తెలుసుకుందాం.

ఉద్వేగాలను అదుపు పెట్టుకునే నైపుణ్యం. పారదర్శకత వ్యక్తీకరణ. ఇది ప్రధాన లక్షణాలు.. ఏ ఇద్దరిమధ్యా స్నేహం చాలా గట్టిగా వుందంటె పై లక్షణాలలో దాదాపు ఇద్దరి వ్యక్తుల్లో ఉంటాయి. అది స్త్రీల మధ్యగాని, పురుషుల మధ్యగాని, స్త్రీ, పురుషుల మధ్యగాని తప్పకుండా వుంటుంది. అయితే కొన్ని స్నేహాలు వ్యక్తులను అద్భుతంగా తీర్చిదిద్దితే.. కొన్ని స్నేహాలు అధ:పోతాళానికి తీసుకెళ్తాయి… అతి భయపడే కొంతమంది మొత్తానికే స్నేహం చేయకుండా వుంటారు.. ఇది జీవితానికి ఉపయోగపడదు.

స్నేహం గ్రిడ్‌:

చాలా హాయిగా వుంటుంది.

సహజంగా వుంటుంది.

తమాషాగా..

ఉత్సాహాన్నిస్తుంది

ఆనందించండి..

కాని ఆరోగ్యకరం కాదు..

సమస్యాత్మకం

ఆనందించడం ఆరోగ్యకరం

‘ఐడియల్‌’

ఆనందం ఉండదు

ఆరోగ్యకరం కాదు

పనికిరానిది

ఆనందం రాదు ఆరోగ్యకరం

సరే? ఉండొచ్చు

హై ఫ్రెండ్‌షిప్‌ విలువ

ఒకరంటే ఒకరికి ప్రేమ

చాలా పాజిటివ్‌

గొప్ప విశ్వాసం

ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకుంటారు.

లో ఫ్రెండ్‌షిప్‌ హెల్త్‌

చాలా హాయిగా వుంటుంది.

సహజంగా వుంటుంది.

తమాషాగా..

ఉత్సాహాన్నిస్తుంది

నెగిటివ్‌ ఆలోచనలు..

ఒకరిపట్ల ఒకరికి శత్రుత్వం వుంటుంది.

ఒకరిపై ఒకరు పట్టుకోసం ప్రయత్నిస్తారు.

బలవంతంగా స్నేహం

బోరింగ్‌.. ఆబ్లిగేషన్‌

పైన చెప్పిన బొమ్మలో ”మొదటి గడిలో” కనీసం 70% వరకు తర్వాత రెండవ గడిలో 30% వరకు ఉండగలిగే విధంగా మన స్నేహాన్ని నిర్వచించుకోవచ్చు. 3/4 గడుల్లో మన స్నేహాలుంఎ తప్పకుండా వాటిని వదిలేసుకోవడమే తప్పకుండా చెయ్యాలి.

చిత్రమేమిటంటె చాలామంది 3/4 గడుల్లోనే వుంటూ చాలా సంతోషిస్తున్నా మనుకుంటారు.. వాళ్ళకు తెలుసు ఈ గడుల్లో ఉన్నవారు కాలేజీలు ఎగ్గొట్టి, త్రాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, ప్రతిదానికి ఎవరితోనో ఒకరితో పోట్లాట పెట్టుకోవడం.. తల్లిదండ్రులతో గొడవకు దిగడం… రోజంతా ఏదో పోట్టాటతో గడపడం… దానినుంచి తప్పించుకోవడానికి తాగడం, డ్రగ్స్‌తో వున్న స్నేహితులతో కలిసి వుండడం.. పైవాటిలో మీరు ఎలాంటి స్నేహం చేస్తున్నారో తెలుసుకొని మొదటి గడిలోకి ప్రయాణం చెయ్యడానికి ప్రయత్నించండి.. 3/4 గడిలో వుంటె తప్పకుండా మీరు సైకాలజిస్టుతోను కలవండి..

ఇప్పుడు వున్న ఇంకొక స్నేహం.. పర్చువల్‌ స్నేహం.. సోషల్‌ మీడియా ఫ్రెండ్‌షిప్‌ కనిపిస్తుంది కానీ అందుబాటులోకి రాదు.. ఎవరైనా చనిపోతే వందమంది ‘రిప్‌’ అంటారు కానీ ఒక్కరు కూడా వాళ్ళింటికి వెళ్ళి సంతాపం, ధైర్యం చెప్పరు.. అలాంటి వాటిని నమ్మి మీది గొప్ప స్నేహం అనుకుంటారు.. అలాంటి వ్యామోహంనుంచి బయటకు రావాలి.

అప్పుడే స్నేహం అంటె జీవితం అని అర్థం.

డా|| సి. వీరేందర్‌

Other Updates