కెసిఆర్….అంటే ఒక చారిత్రక ఉద్యమ నేత. అతను ఏ అడుగు వేసినా అది ఒక చరిత్రే. ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక ఉద్యమమే.
అది ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కావచ్చు. సకుటుంబ సర్వే కావచ్చు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ గృహనిర్మాణమైనా, ఆసరా పింఛన్లు అయినా అది ఒక కెసిఆర్ కే సాధ్యం. అదే కోవలోది ”స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్” రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూపకల్పన చేసి ఆచరించి చూపిన ”స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్” ఇలాంటి స్వచ్ఛ ఉద్యమం దేశంలోనే లేదు మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదంటే అతిశయాక్తి కాదు. రాష్ట్ర గవర్నర్, స్పీకర్లు, మంత్రులు, అఖిల భారత సర్వీసుల అధికారులతో సహా తాను కూడా ఒక కార్యకర్తగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా యావత్తు భారతావని ఆశ్చర్య పడేలా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్వచ్ఛ హైదరాబాద్ వివరాలకు వస్తే…
దేశంలోనే హైదరాబాద్ నగరం ఆరవ పెద్ద నగరం. 450ఏళ్ళకు పైగా ఘన వారసత్వం కలిగిన ఈ హైదరాబాద్ నగరంలో అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉండేది. అలాంటి ఈ మహానగరం గత దశాబ్దాలుగా పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురై అస్తవ్యస్తంగా మారింది. డ్రయినేజి సమస్యలు, అస్తవ్యస్థ ట్రాఫిక్, చెత్తా చెదారంతో నిండి ఉంది. ప్రస్తుత హైదరాబాద్ నగరం.
మహోన్నత చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పించారు. ఈ సంకల్పంలో భాగమే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం.
హైదరాబాద్ నగరాన్ని 400 యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్‌కు తనతో సహా రాష్ట్ర గవర్నర్, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులకు పాట్రన్‌లుగా, మెంటార్‌లుగా నియమించారు. ఒక కిలోమీటరు వ్యాసార్థం గల యూనిట్‌లో రెండు మూడు కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఈ యూనిట్‌లో మెంటార్/ పాట్రాన్‌లు తామే స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టడం ఆయా యూనిట్‌లో ప్రజల సమస్యలను పరిష్కరించడం, దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం లాంటి పనులను నిర్వహించారు. మండుటెండలను లెక్క చేయకుండా 425మంది అత్యున్నత స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ, బస్తీల సంక్షేమ సంఘాలు మే 16వ తేదీ నుండి 20వ తేదీలలో స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ ఐదు రోజుల్లో జిహెచ్‌ఎంసి ప్రతిరోజు తరలించే చెత్తకు అదనంగా 32,250 మెట్రిక్ టన్నుల చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించారు. దాదాపు 9లక్షల మంది ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వామ్యం కలుగ చేయడంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తక్షణ మరమ్మతు బృందాల ద్వారా 16వేల రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు నిర్వహించారు. వివిధ కాలనీల నుంచి మౌళిక సదుపాయాల కల్పన, గ్రంథాలయాలు, జిమ్ తదితర సౌకర్యాలను కల్పించడానికి సుమారు 600 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు అందాయి.
ఐదు రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మురికివాడల ప్రజల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆత్మవిశ్వాసం కలిగించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా అద్దంలా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను దైవ సమానులని, వారి జీతాలను పెంచడం ఇళ్ళ నిర్మాణం చేయించి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ధనవంతులతో పాటు బీదలు కూడా ఆత్మగౌరవంగా జీవించాలనేదే తన ప్రధాన లక్ష్యమని, దీనికోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని ప్రసాధిస్తున్న పారిశుద్ద కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. జిహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న 20వేల మంది పారిశుద్ద్య కార్మికులకు దశలవారిగా రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లనునిర్మించి ఇస్తామని, వీరి ప్రస్తుతం జీతం తక్కువగా ఉందని వీరికి కూడా త్వరలోనే జీతాలు పెంచనున్నట్లు సిఎం ప్రకటించారు. వీరితో పాటు ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న 176 బందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఎకరంన్నరకు పైగా భూమిలో జి+2, జి+5 లిఫ్ట్ సౌకర్యంతో అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని హామీ ఇచ్చారు.
స్వచ్ఛ తెలంగాణ – స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం మే 16 నుండి 20వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో విజయవంతంగా కొనసాగింది.
గ్రేటర్ హైదరాబాద్‌ను 400 యూనిట్లుగా విభజించారు. దీనికి అదనంగా ఐలా, కంటోన్మెంట్ ఆధ్వర్యంలో మరో 25 యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక్కో యూనిట్‌కు ఒక్కో ప్రముఖుని నేతృత్వం వహించారు. వీరిలో 456 మంది వీవీఐపి, ఆల్ ఇండియా సర్వీస్‌ల అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నేతృత్వం వహించారు. గవర్నర్, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, స్పీకర్లు, పార్లమెంట్ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు మొత్తం 31 మంది పాట్రాన్‌లుగా ఉన్నారు.
76 మంది ఐఎఎస్, 62 మంది ఐపిఎస్, 37 మంది ఐఎఫ్‌ఎస్, 225 మంది వివిధ శాఖల ఉన్నతాధికారులను మెంటర్‌లుగా నియామించారు.
నోడల్ అధికారులు, బిల్ కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జలమండలి, విద్యుత్ శాఖల 1800 మంది అధికారులు, 36 వేల మంది సిబ్బంది స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్నారు.
ఒక్కో యూనిట్‌లో స్థానిక లోకల్ చేంజ్ పౌరులు, 1200 మంది ఇన్‌స్టాంట్ రిపేర్ టీం సభ్యులు, వీరిలో 400 మంది మేస్త్రీలు, 800 మంది లేబర్లు, 1,061 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 23 వేల మంది శానిటేషన్ వర్కర్లు, 2,010 మంది ఐలా, కంటోన్మెంట్ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెత్త తరలింపునకు 560 టిప్పర్లు, 60 జెసిబిలతో కలిపి 620 వాహనాలు వినియోగించారు.
ఎమ్మెల్యేలే, ఎమ్మెల్కీసలు, ఎంపీలచే విస్తృత భాగ్వామ్యంతో పాటు 550 మంది కళాకారులకు చెందిన 47 కళాబృందాలచే విస్తృత అవగాహన కార్యక్రమాలు, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా స్వచ్ఛ హైదరాబాద్ పై ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.
స్వచ్ఛ హైదరాబాద్‌లో 7 లక్షల 50వేల మంది ప్రజలు నేరుగా భాగస్వామ్యం వహించారు.
ఇన్‌స్టంట్ రిపేర్ టీం ద్వారా 15,842 మరమత్తులు చేశారు. 6,777 రోడ్ల గుంతల పూడ్చివేత, 248 ఫుట్‌పాత్‌ల మరమ్మత్తులు, 915 క్చానపిట్‌ల మరమ్మత్తులు, 196 స్టార్మ్‌వాటర్ డ్రైన్‌ల మరమత్తులు, 1,103 మ్యాన్‌హోళ్ల మరమ్మత్తులు చేపట్టారు.
11,031 ట్రిప్పుల ద్వారా 32,250 మెట్రిక్ టన్నుల చెత్త, నిర్మాణ వ్యర్థాలను డంప్ యార్డ్‌లకు తరలించారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో 620 కోట్ల రూపాయల విలువగల 8,150 పనులకు ప్రతిపాదనలు స్వీకరించారు అధికారులు.