karimnagar2016 సంవత్సరానికి స్వచ్ఛ ఛాంపియన్‌ అవార్డు కరీంనగర్‌ జిల్లాను వరించింది. వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యమిస్తూ జిల్లాను 2016 మార్చి నాటికి పూర్తిగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిద్దినందుకు తెలంగాణ నుంచి కరీంనగర్‌ జిల్లా ఎంపికైంది. కేంద్ర గ్రామీణాభివద్ధి, పంచాయితీరాజ్‌, పారిశుధ్య మంత్రిత్వ శాఖల ఆద్వర్యంలో ఆగస్టు 25న ఈ కార్యక్రమం జరిగింది.

దేశవ్యాప్తంగా 22 జిల్లాలను స్వచ్ఛ ఛాంపియన్లుగా కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వశాఖ గుర్తించగా, అందులో కరీంనగర్‌ జిల్లా ఒకటి. ఈ అవార్డును స్వచ్ఛ భారత్‌ ప్రచారకర్త, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌ జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌కు ఢిల్లీలో అందజేశారు. కరీంనగర్‌ జిల్లా సాధించిన ఫలితాలను స్వయంగా సచిన్‌ టెండూల్కర్‌ కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్‌ నుంచి ఎంపీ స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ తెలంగాణ పై ప్రజల్లో ఏ విధంగా అవగాహన పెంచారో కలెక్టర్‌ వివరించారు. సమష్టి కషి ద్వారానే ఇది సాధ్యమైందని నీతూ ప్రసాద్‌, సచిన్‌ టెండూల్కర్‌కు వివరించారు. అవార్డు కింద స్వచ్ఛ భారత్‌ లోగోతో ముద్రించిన బ్యాట్‌పై స్వయంగా సంతకం చేసిన క్రికెట్‌ బ్యాట్‌ను సచిన్‌ కలెక్టర్‌కు అందజేశారు.

Other Updates