kcతెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం రూపొందించే వివిధ పథకాలను ప్రజల వద్దకు చేర్చి విజయవంతం చేసే బాధ్యత సిబ్బందిపైనే ఉంది. ఇటువంటి కీలక బాధ్యతలను నెరవేర్చడంతోపాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ముందుండి నడిచిన ప్రభుత్వోద్యోగులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులందరికీ ‘‘తెలంగాణ ఇంక్రిమెంట్‌’’ మంజూరు చేయడంతోపాటు, వేతన సవరణ విషయంలోకూడా ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరించింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనంతగా మూల వేతనంలో 43 శాతం పెంచుతూ వేతన సవరణ చేయడంపట్ల ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన 2014 జూన్‌ 2వ తేదీనుంచే ఈ పెంచిన వేతనాలు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం గైకొంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 6500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది.

అంగన్‌వాడి వర్కర్ల వేతనాల పెంపు

teacherఅంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్ల జీతాలు పెంచుతామని గత శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చింది. ముఖ్యమంత్రి హామీ మేరకు వీరి జీతాలు పెంచుతూ మే 23న ప్రభుత్వం జీ.ఓ. జారీ చేసింది.

ఇప్పటి వరకూ అంగన్‌వాడి వర్కర్లకు రూ. 4200గా ఉన్న వేతనాన్ని రూ. 7,000కు పెంచారు. హెల్పర్లు, మినీ వర్కర్లకు చెల్లిస్తున్న రూ. 2,200 వేతనాన్ని రూ. 4,500కు హెచ్చించారు. అంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్లకు ప్రతి నెలా బ్యాంకు అకౌంట్‌ల ద్వారా వేతనాలు చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

వీరికి ప్రతి ఏటా 12 సెలవులు వర్తిస్తాయి. మెటర్నిటీ సెలవు క్రింద 180 రోజులు సెలవుగా పరిగణిస్తారు. అబార్షన్‌, మిస్‌క్యారేజివంటి వాటికి కూడా సెలవులు వర్తిస్తాయి.

అంగన్‌వాడీలు నిర్వహించే ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం నిర్వహణా వ్యయాన్ని ప్రభుత్వం 40 శాతం పెంచి ఆర్థిక వెసులుబాటు కల్పించింది.

మే నెలలో అంగన్‌వాడి వర్కర్లకు మొదటి 15 రోజులు, హెల్పర్లకు మే 15 నుంచి 15 రోజులు సెలవులు వుంటాయి.

హోంగార్డుల జీతాలు 12 వేలకు పెంపు

ప్రతి నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న హోంగార్డుల డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 16 వేల మంది హోంగార్డుల వేతనాన్ని 9 వేల నుండి 12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. హోంగార్డులకు మెడికల్‌ ఇన్సూరెన్సు, ఏడాదికి రెండు డ్రస్సులు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో బస్‌ పాసులు ఇస్తారు. ప్రస్తుతం నెలకు రెండు సార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28ని 100 రూపాయలకు పెంచారు.

ఆర్టీసి కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్‌

saతెలంగాణ ఆర్టీసిని నష్టాల ఊబి నుంచి బయట పడేయటానికి ప్రభుత్వం రూ. 250 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆర్టీసీని నడిపించడానికి యాజమాన్యం ఒక దశలో ఉద్యోగుల సహకార సంఘం డబ్బులను కూడా వినియోగించుకోవలసి వచ్చింది. అందుకే ప్రభుత్వం స్పందించి ఆర్‌టిసిని ఆదుకుంది. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌ మెంట్‌తో వేతన సవరణ చేసింది. 2013 ఏప్రిల్‌ నుంచి పెరిగిన జీతాలను చెల్లిస్తారు. ఆర్టీసీలోని కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌.టి.సి. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది

సింగరేణి కార్మికులకు బోనస్‌, డిపెండెంట్‌ ఉద్యోగాలు

tsrtcదసరా, దీపావళి పండుగల సందర్బంగా సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సెప్టెంబర్‌ 22, 2015న వరాలు ప్రకటించారు. సింగరేణి లాభాల్లో 20 శాతాన్ని కార్మికులకు చెల్లించనున్నారు. కోల్‌ ఇండియా 240 కోట్ల రూపాయాలను సింగరేణి కార్మికులకు బోనస్‌గా అందిస్తోంది. దీనివల్ల ప్రతి సింగరేణి కార్మికుడు సగటున రూ. 40 వేలు అదనంగా పొందుతారు. దాదాపు 3100 మంది పెండిరగ్‌ డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి పరిధిలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Other Updates