‘జల్- జంగిల్ -జమీన్’ కోసం పోరాడిన ఆదివాసీ యోధుడు కొమురం భీం స్ఫూర్తితో, ఆయన ఆశయాలకు అనుగుణంగా పథకాలను అమలుచేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐ.టి శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు.
ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండు వీరుడు కొమురం భీం 75వ వర్థంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో అధికారికంగా నిర్వహించిన వర్థంతి సభలో కె.టి.ఆర్ ప్రసంగిస్తూ, ఆదిలాబాద్ అడవి బిడ్డల స్ఫూర్తిని చాటిన ఘనుడు కొమురం భీం అన్నారు. ఆదివాసులను ఏకంచేసి పోరాట స్ఫూర్తిని రగిలించాడని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.
గతంలో గిరిజన పోరాట యోధుడంటే కేవలం ఆంధ్ర ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజనే భ్రమ కల్పించారని, స్వరాష్ట్రంలో కొమురం భీం సహా, ఇక్కడి పోరాట యోధులందరినీ గుర్తు చేసుకుంటున్నామని కె.టి.ఆర్ అన్నారు.
అంతకుముందు, రాష్ట్ర మంత్రులు చందూలాల్, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులతో భీం సమాధి, విగ్రహానికి పూలమాలలువేసి కె.టి.ఆర్ ఘనంగా నివాళులర్పించారు. నీటికోసం మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అడవిని కాపాడేందుకు 25 శాతంగా వున్న అడవులను 33 శాతానికి పెంచేందుకు హరితహారం కార్యక్రమం, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టి, కొమురం భీం ఆశయాలైన జల్ – జంగిల్ – జమీన్ జంగల్‌లను అమలు చేస్తోందని మంత్రి కె.టి.ఆర్ తెలిపారు. జోడేఘాట్‌కు డబుల్ బెడ్‌రూమ్ గహాలు మంజూరుచేస్తామని, 500 జనాభాగల ప్రతి ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా మార్చనున్నామని, ఏజెన్సీ మండల కేంద్రాలలో 30 పడకల ఆస్పత్రులను ఏర్పాటుచేస్తామని ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ హామీ ఇచ్చారు.
చారిత్రిక ఘట్టం
కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చారిత్రిక ఘట్టమని గిరిజన సంక్షేమ శాఖామంత్రి చందూలాల్ పేర్కొన్నారు. ప్రతి గిరిజనుడు చదువుకోవాలని, అప్పడే అభి వద్ధి సాధ్యమని అన్నారు. అటవీ శాఖా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, గిరిజనుల హక్కులకోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలను త ణప్రాయంగా అర్పించిన మహోన్నత వ్యక్తి కొమురం భీం అని నివాళులర్పించారు. దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, భీం స్మారక మ్యూజియాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివ ద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు. ఎం.పి బాల్క సుమన్, గెడాం నగేశ్, చీఫ్ విప్ నల్లాల ఓదెలు, సాంస్క తిక సారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, బాపురావు, రేఖానాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోరాట యోధునికి ఘనంగా నివాళి
కొమురం భీం వర్థంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ప్రభుత్వం తరఫున ఆ పోరాట యోధునికి ఘనంగా నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ పై కొమురం భీం విగ్రహానికి మంత్రులు చందూలాల్, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, సాంస్క తిక సారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, శాసన సభ్యుడు కోనేరు కోనప్ప, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.