tsmagazineరాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందివ్వాలని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించా లని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సిబ్బందిని, వైద్య పరికరాలను, వాహనాలను, కళ్లద్దాలను, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

”గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు

స్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందరు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలి. జిల్లా కలెక్టర్లు ప్రజా ప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి, జిల్లా స్థాయిలో షెడ్యూల్‌ ను తయారు చేయాలి. క్షేత్ర స్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్ష , ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అందరూ కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి” అని ముఖ్యమంత్రి వివరించారు.

కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బందాలను ఏర్పాటు చేశామని, ప్రతీ బందంలో ఒక ఎంబిబిఎస్‌ డాక్టర్‌, ఆప్తోమెట్రిస్ట్‌, ఎఎన్‌ఎం తదితరులు ఉంటారని, ఒక్కో వైద్య బందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుందని, ఐ డ్రాప్స్‌, మందులు సిద్ధం చేసుకున్నామని, 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నామని, అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించినట్లు అధికారులు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలు.

  •  వర్షం వచ్చినా సరే కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్ని కానీ, మరేదైనా పక్కా భవనాన్ని కాని ఎంపిక చేసుకోవాలి
  • కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగకూడదు. కంటి పరీక్షల శిబిరంలో పనిచేయడానికి ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలి. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిని వినియోగించవద్దు
  • ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నా రనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తత ప్రచారం నిర్వహించాలి. కంటి పరీక్షలపై అవగాహన కల్పించాలి. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి
  • కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేఖలు రాయాలి
  • వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికో రెండు రోజులు ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలి. వారు వచ్చిపోవడానికి ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సరైన వసతి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో వసతి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అతిధి గ హాలతో పాటు సింగరేణి, విద్యుత్‌ సంస్థల అతిథి గహాలను వాడు కోవాలి. ప్రైవేటు హోటళ్లలో కూడా బస ఏర్పాటు చేయాలి. పేదలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లు బాగుండాలి
  • దగ్గరి చూపు లోపం ఉన్న వారికి వెంటనే మం దులు, అద్దాలు(రీడింగ్‌) అందించాలి. ఇతరు లకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలి. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలి

సరోజిని కంటి ఆసుపత్రికి కొత్త భవనం: సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌ నగరంలోని సరోజిని కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతో పాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. సరోజిని కంటి ఆసుపత్రికి దేశ వ్యాప్తంగా మంచి పేరు, ప్రతిష్ఠలున్నాయని, దానికి తగినట్లు కొత్త భవనాలు నిర్మించి, రోగులకు వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

నగరంలో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను మరింత పెంచాలని సీఎం చెప్పారు. ముఖ్యంగా పేదలు ఎక్కువగా నివసించే మురికి వాడల్లో ఎక్కువ బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పేదలకు ఈ బస్తీ దవాఖానాలు ఎంతగానో మేలు చేస్తున్నాయని, రాష్ట్ర గవర్నర్‌ కూడా బస్తీ దవాఖానాలను సందర్శించి అభినందించారన్నారు. దశల వారీగా బస్తీ దవాఖానాల్లో రోగ నిర్ధారక పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Other Updates