haritha-haramశ్రీ టి.ఉడయవర్లు

పదిమంది సుపుత్రును కంటే వచ్చేంత పుణ్యం ఒక్క మొక్క నాటితే వస్తుందని చాటింది మత్స్యపురాణం.
మానవుని తర్వాత సృష్టిలో అత్యంత మనోహరమైంది చెట్టు అన్నాడు ప్రొఫెసర్‌ వా.
చెట్టంటే నీరు, నీరంటే ఆహారం, ఆహారమే జీవితమైన చెట్టు మనిషికి జీవనాధారమైంది అని వ్యాఖ్యానించాడు రవీంద్రకవీంద్రుడు.
ఇంతటి వైశిష్ట్యాన్ని కలిగిన పచ్చని చెట్టును, సమత్యుమైన వాతావరణాన్ని ఆదర్శంగా, వస్తువుగా తీసుకొని తన చిత్రలేఖన విద్యలో వైవిధ్యాన్ని సాధించాడు ప్రముఖ చిత్రకారుడు డి. అనంతయ్య.
ఆయన వేసే బొమ్మలో ప్రకృతి ప్రభావం మినహా మరెవ్వరి ప్రభావం లేదు. ఆయన ఏ చిత్రం గీసినా అది ప్రకృతికి పార్శ్వమే తప్ప మరొకటి కాదు.
అనంతయ్య గ్రామీణ జీవితంలో చూసిన దృశ్యానే, తన దృక్కోణం నుంచి కమనీయంగా తన చిత్ర రచనలో చూపారు. చెట్టూ చేమతోపాటు రాళ్ళూ రప్పు, పు రకా పక్షు, జంతుకోట,ి ఒక్కోసారి మానవ మాతృకు తన చిత్రాలో చోటు కల్పించడంలో ఆయన ఒకానొక కళాత్మకమైన సమతూకాన్ని ప్రదర్శించారు. ప్రతి చిత్రాన్ని సాంకేతికంగా, సృజనాత్మకంగా, ఒక కళాఖండంగా ఆయన మలిచారు.
ముఖ్యంగా తుత్తునాగం పకపై రూపొందించే గ్రాఫిక్స్‌తో వెంట్రుకవాసి గీత విన్యాసం, వాస్తవిక రంగు పొందిక, భావ సృష్టత ఆయన ధోరణిలోని సంపన్నతకు మచ్చుతునకు. నిజానికి చిత్రకళా సరస్వతి మెడలో హరితహారం అనంతయ్య చిత్రాు.
రంగారెడ్డి జిల్లా రామయ్యగూడలో 1953లో పోచమ్మ పాపయ్య దంపతుకు జన్మించిన అనంతయ్య ఉస్మానియా విశ్వవిద్యాయం నుంచి బి.ఎస్‌.సి. డిగ్రీ పొందా రు. డ్రాయింగ్‌లోను లోయర్‌, హయ్యర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై, గుల్బార్గాలోని ఐడియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ నుంచి పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. అయితే ప్రస్తుతం ఆయన సమకాలీన ధోరణును గ్రాహ్యం చేసుకొని గ్రాఫిక్స్‌ చేయడంలో నిమగ్నమయ్యారు. విదేశాలో మాదిరిగా మనకు అత్యాధునిక పరికరాు, సౌకర్యాు ఉంటే ఇంకా ఎంతో వేగంగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాకు ధీటుగా చిత్రాు వేయవచ్చునంటారు. మనకున్న సౌకర్యాు, అవకాశా మేరకు దాదాపు రెండు వంద విభిన్నమైన చిత్రాు ఆయన ఇప్పటిదాకా రూపొందించారు. మధ్యమధ్య పెయింటింగ్స్‌ కూడా ఆయన వేస్తున్నప్పటికీ గ్రాఫిక్‌ చిత్రకారుడుగానే అనంతయ్య మంచిపేరు సంపాదించాడు.
కేవం ప్రవృత్తే కాకుండా, వృత్తి రీత్యాను ఆయన చిత్రలేఖనం నేర్పే అధ్యాపకుడుగా ఎక్కువకాం ఉండడం వ్ల అనంతయ్యకు చిత్రలేఖనం తప్ప మరో రంగంతో పని లేకుండా పోయింది. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడుగా పదోన్నతి పొంది పదవీవిరమణ చేసిన అనంతయ్య గత నాుగేండ్లుగా చిత్రకళే లోకంగా కృషి చేస్తున్నాడు. సుమారు మూడున్నర దశాబ్దాకు పైగా ఆయన అనేక గ్రాఫిక్‌ శిబిరాలో, వర్క్‌షాప్‌లో, సదస్సులో పాల్గొంటూ ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకొని, తన సృజనాత్మక శక్తిని పెంచుకున్నాడు. త్వరితంగా రూపొందించిన అనేక చిత్రాకు 1985 నుంచి రాష్ట్రంలో జరిగిన సమష్టి చిత్రకళాప్రదర్శనలో, బెంగుళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, అమృత్‌సర్‌, పనాజీ, కొబిలాంటి దేశీయ నగరాల్లో న్యూయార్క్‌, జర్మనీ లాంటి విదేశాలో నిర్వహించిన కళా ప్రదర్శనలో ప్రదర్శించారు. అంతేకాకుండా 1989 నుంచి తొమ్మిది పర్యాయాు చిత్రకళాప్రదర్శను ఏర్పాటు చేశాడు. మళ్ళీ తాజాగా ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కావసినన్ని కొత్త చిత్రాను రూపొందించి సిద్ధంగా ఉన్నారు. వీరి చిత్రాకు ముంబయి ఆర్ట్‌ సొసైటీ, 2000 లో ఎఐఎఫ్‌సిఎస్‌ న్యూఢల్లీి 2000లో పొట్టి శ్రీరాము తొగు విశ్వవిద్యాయం` 1997లో భారత కళాపరిషత్‌ 1992లో దక్షిణ మధ్య సాంస్కృతిక కేంద్రం. నాగ పూర్‌ 1991లో, కర్నాటక చిత్రకళా పరిషత్‌ 1992లో, లి తకళాసమితి సిద్ధిపేట, 1988లో హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ (స్వర్ణోత్సవ స్వర్ణ పతకం) 1991లో అవార్డు భించాయి.
వీరి చిత్రాను నగరంలోని పూర్వపు లితకళా అకాడమీతో పాటు సిసిఎంబి, ఎల్‌వి ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌, రాష్ట్ర పోలీస్‌ అకాడమీ, మాక్స్‌ మ్లుర్‌ భవన్‌ు, బెంగుళూరులోని కర్ణాటక లితకళా అకాడమీ, కర్నాటక లిత కళాపరిషత్‌, నాగ్‌పూర్‌లోని దక్షిణమధ్య సాంస్కృతిక కేంద్రం, చెన్నైలోని లితకళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం, న్యూ ఢల్లీిలోని లితకళా అకాడమీ, పోలెండ్‌లోని ఇంటర్నేషనల్‌ ట్రైనాలే ఆఫ్‌ గ్రాఫిక్స్‌ క్రాకోలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థు సేకరించాయి.
లోగడ ఆయన నెరోజుపాటు హైదరాబాద్‌ నగరంలోని ఆలైన్‌ ఫ్రాంచయిస్‌లో నిర్వహించిన వ్యష్టి చిత్రకళా ప్రదర్శన, ఆ తర్వాత వేసిన చిత్రాు సాంకేతికంగా, సృజనాత్మకంగా, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ అనంతయ్య సాగించే చిత్రకళాయాత్రను ప్రస్పుటం చేస్తాయి. ఆయన చిత్రాు చూడడానికి నాజూకైనవి, నయనానందకరమైనవి, యువచిత్రకాయి ఆదర్శంగా తీసుకోదగినవి. ముఖ్యంగా అడవిశ్రేణిలో వేసిన చిత్రాు, ప్రభాతమారుతం బంగారు కిరణాు చిత్రాు ఆయన ప్రత్యేకతను వ్యక్తం చేస్తాయి.
అయితే ఆయన పువురిని ఆకర్షించడానికి కారణం మన చుట్టూ ఉన్న వాతావరణం చెట్టూ, చేము, రాళ్లూ రప్పు, పక్షు, ఇతర అనంతకోటికి తన చిత్రాు సృజనాత్మకరీతిలో అద్దం పట్టడమేనని అనంతయ్య అంటారు. చిత్రకారుడు అన్నవాడి దృష్టి ఎప్పుడూ కళాత్మకమై తీరుతుందనీ, సమకాలీన సమాజం ప్రభావంతో చిత్రకారుడిపై పడితీరుతుంది కాబట్టి ఆ చిత్రకారుడి కుంచె సామాజిక పరిధిని విస్మరించబోదని ఆయన సూత్రీకరించారు. ఈ నేపథ్యంలో చిత్రకారుడి ఏ రచననైనా నిబద్ధతకు లోనై, సామాజిక ప్రయోజనానికి దోహదం చేస్తుందని కూడా అనంతయ్య అభిప్రాయపడ్డారు.

Other Updates