Untitled-2తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారంగా మారుస్తామని, అధికారులు ఆ లక్ష్యం దిశగా పని చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నగర శివారులోని దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో జనవరి 17న జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం 25 శాతం విస్తీర్ణంలో అడవులు వున్నాయని, వీటిని 33 శాతానికి పెంచుతామని సి.ంఎ. చెప్పారు. అటవీశాఖలో ఖాళీలు భర్తీ, వేతన సవరణ చేస్తామని, సిబ్బందికి అవసరమైన వాహన సౌకర్యం కల్పిస్తామని, పోలీసు భద్రత కూడా కల్పిస్తామని అటవీశాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు.
అటవీశాఖ అధికారుల సమస్యలను సి.ఎం. అడిగి తెలుసుకున్నారు. స్మగ్లర్లు, భూఆక్రమణదారులు, గుత్తికోయలనుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అటవీశాఖ అధికారులు, సిబ్బంది హతులైన సంఘటనలు కూడా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
దీనితో తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఆక్రమణదారులపట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే కొత్త చట్టాలు తీసుకువస్తామని, పోలీసులతో రక్షణ కల్పిస్తాయని చెప్పారు. అడవికి ప్రమాదంగా మారిన గుత్తికోయల ప్రవేశాన్ని పకడ్బందీగా అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత పాలకులు అటవీశాఖపట్ల నిర్లక్ష్యం వహించి, అడవులను ఎడారులుగా మార్చారని సి.ఎం. పేర్కొన్నారు. పేరుకు రిజర్వు ఫారెస్టు అయినా అక్కడ చెట్లేలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖమంత్రి జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, అటవీశాఖ అధికారి బి.ఎమ్‌. మిశ్రా, అకాడమీ డైరెక్టర్‌ రఘువీర్‌ పాల్గొన్నారు.

Other Updates