tsmagazineతెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ ను కోరారు. హైదరాబాద్‌ లో 188 ఫారెస్టు బ్లాకులను అభివృద్ధి చేస్తున్నామని, దీనికోసం కాంపా నిధుల్లో కేంద్రం వాటా నుంచి రూ.100 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టేజ్‌ 2 పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలని కోరారు. కాంపానిధులతో చేపట్టే పనుల్లో 80 శాతం మౌలికమైన అటవీ అభివృద్ధి పనులు, 20 శాతం అనుబంధ పనులు ఉండాలని నిర్ధేశించారని, దీనికి బదులుగా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం నిష్పత్తిని 70:30 గా మార్చాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, అటవీ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలను స్వయంగా చూసేందుకు మరోసారి రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కేంద్ర మంత్రిని సిఎం కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రానికి వచ్చిన హర్షవర్థన్‌ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించినందు కు అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్య అధికారులతో పాటు హర్షవర్థన్‌తో సిఎం కేసీఆర్‌ సమావేశ మయ్యారు. మొక్కల పెంపకం, అడవుల రక్షణ, అటవీ భూభాగంలో అడవి పునరుజ్జీవం, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం తీరుతెన్నులను, అడవిని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలను, పోయిన అడవిని పునరుజ్జీవింపచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, సామాజిక వనాల పెంపుదల కోసం చేపట్టిన కార్యక్రమాలను అటవీశాఖ అధికారులు వివరించారు.
tsmagazine

రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను కేంద్ర మంత్రి అభినందించారు. అడవుల రక్షణ కోసం కొత్త చట్టం తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని హర్షవర్థన్‌ చెప్పారు. చెట్ల పెంపకం అవసరాన్ని సమాజం గుర్తించేలా అవగాహన కార్యక్రమాలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని ఆయన సూచించారు. గతంలో అడవుల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోలేదని, దీనివల్ల తెలంగాణలో పచ్చదనం తగ్గిపోయిందని సిఎం చెప్పారు. దీంతో తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతం పెంచడానికి పెద్ద ఎత్తున ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఏడాదికి 40 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇకపై ప్రతీ ఏడాది వంద కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని రక్షించడానికి కూడా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎక్కడైనా చెట్లు పోతే, అంతే మొత్తంలో మరో

చోట అడవిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం నిధులు కేటాయిస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ జీవితానికి అడవితో అనుబంధం పెనవేసుకున్నదన్నారు. కేవలం అడవిలో దొరికే పూలతో నిర్వహించే బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ అని, అది తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని సిఎం చెప్పారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, సీనియర్‌ అధికారులు ఎస్‌. నర్సింగ్‌ రావు, అజయ్‌ మిశ్రా, పిసిసిఎఫ్‌ ఝా, సిసిఎఫ్‌ రఘువీర్‌, అడిషనల్‌ పిసిసిఎఫ్‌ శోభ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణ, నీటి పారుదల శాఖ ఇఎన్సి మురళీధర్‌ రావు, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.tsmagazine

కలెక్టర్లకు మొక్కల సంరక్షణ బాధ్యతలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటుతున్నామని, వాటికి నీరు పోసి పెంచి పెద్ద చేయడంతో పాటు, రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లను కోరారు. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటడానికి కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని, సంరక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషికి సిఎం చెప్పారు. నరేగా, కాంపా నిధులతో పాటు ఇతర నిధులు కూడా అందుబా టులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రతీ పాఠశాల విద్యార్థులను అడవి సందర్శనకు తీసుకుపోవాలని చెప్పారు. దీని ద్వారా పాఠశాల పిల్లలకు అడవులపై అవగాహన, చెట్ల పెంపకంపై ఆసక్తి కలుగుతాయని సిఎం వివరించారు.

తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతం పెంచడానికి పెద్ద ఎత్తున తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 40 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇకపై ప్రతీ ఏడాది వంద కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.

Other Updates