హస్తినలో-కేసీఆర్‌-మంతార్రగంఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి కేంద్ర బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఇనుము, ఉక్కు శాఖల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢల్లీి పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 6న కేంద్రమంత్రి తోమర్‌తో సమావేశమై బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఆవశ్యకతగురించి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ఏర్పడిన తరువాత బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది మాసాలు అవుతున్నందున బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం తక్షణం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రానికి ఏ విధమైన అభ్యంతరం లేదని, అయితే స్టీల్‌ అథారిటీ అధికారులు దీనిపై అధ్యయనం చేసి సమర్పించిన నివేదిక వివరాలను పరిశీలించినప్పుడు వాణిజ్యపరంగా ఉన్న అనుకూలతలపైనే ఆలోచన జరుగుతూ ఉన్నదని కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో ఇప్పటివరకూ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అనుసరించిన విధానాలనే తెలంగాణకూ అవలంభిస్తామని తెలిపారు.

2025 సంవత్సరానికి 300 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని వెలికి తీయగలిగే పరిస్థితి ఉన్నట్లయితే గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని కేంద్రమంత్రి తోమర్‌ తెలిపారు.
బయ్యారం ప్రాంతంలో నాణ్యమైన ఇనుప ఖనిజం లేదని, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఇనుప ఖనిజానికి పెద్దగా డిమాండ్‌ లేదని, ఇలాంటి సమయంలో బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంవల్ల భవిష్యత్‌లో పెద్దగా ప్రయోజనం ఉండదని ఈ సందర్భంగా స్టీల్‌ అథారిటీ అధికారులు తమ అధ్యయనంలో వెల్లడైన విషయాలను వివరించారు. ఆర్థికకోణం నుంచి చూస్తే, ఎక్కువ కాలం ఈ పరిశ్రమను నడపలేమని అధికారులు కేంద్రమంత్రికి చెప్పారు.

ఇందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పందిస్తూ, పరిశ్రమల ఏర్పాటును కేవలం ఆర్థికకోణం నుంచి గానీ, లాభార్జన అంశం ముడిపెట్టిగానీ చూడటం అన్ని సందర్భాలలో సహేతుకం కాదన్నారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి తదితర ప్రాంతాలలో ఇనుప ఖనిజం పుష్కలంగా వున్నదని, సరిహద్దులోవున్న వరంగల్‌ జిల్లాలోని గూడూరు తదితర ప్రాంతాలలో కూడా ఇనుప నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని సి.ఎం. తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉపాధికల్పన అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని, గిరిజన జనాభా అధికంగా ఉన్న బయ్యారం ప్రాంత అభివృద్ధికి స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. కోరారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి తోమర్‌ అంగీకరించారు. రాష్ట్రంలోని సహజవనరులపై అధ్యయనం చేయాలని, గనులను వేలానికి విక్రయించడంపై స్పష్టమైన పరిశీలన జరపాలని కేంద్రమంత్రి తోమర్‌ను సీఎం కోరారు.

kcr

కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కూడా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కలుసుకొని రాష్ట్ర సమస్యలపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటోందనీ, నల్గొండజిల్లా దామరచర్లలో నెలకొల్పదలచిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటయ్యే ప్రాంతంలో కొంత అటవీ భూమి ఉన్నందున దానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. కోరారు. అంతే మోతాదు మేరకు మరోచోట అడవిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి వివరించారు.

ముఖ్యమంత్రి విరణతో సంతృప్తిచెందిన కేంద్రమంత్రి జవదేకర్‌ సానుకూలంగా స్పందించి తమశాఖ అధికారులు అధ్యయనం చేసి అనుమతుల మంజూరుపై తగు ఉత్తర్వులు జారీ చేస్తారని హామీ ఇచ్చారు. ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావలసిన పర్యావరణ అనుమతిపై కూడా కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ అంశం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నందున వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. ‘హరితహారం’ పథకం గురించి కూడా వివరించారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులు అన్నింటిపై త్వరలో నిర్ణయాలు తీసుకొని, తగు ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

cm-kcr తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, గ్రామీణా భివృద్ధి శాఖామంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు హామీ ఇచ్చారు.ఢల్లీి పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 9న కేంద్రమంత్రులు ఇద్దరినీ చంద్రశేఖరరావు విడివిడిగా కలిసి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గృహ నిర్మాణం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో గృహ నిర్మాణం, హైదరాబాద్‌ అభివృద్ధి, రోడ్లు, తాగునీరు, స్మార్ట్‌సిటీల అభివృద్ధి, తదితర అంశాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయు డుతో కె.సి.ఆర్‌. సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి సంబంధించి చేపట్టదలచిన కార్యక్రమాలను ఓ ‘ప్రజెంటేషన్‌’ రూపంలో కె.సి.ఆర్‌. వివరించారు. ఈ ‘ప్రజెంటేషన్‌’ చాలా బాగుందని, తమశాఖ ఈ ప్రతిపాదనలను లోతుగా పరిశీలించిన అనంతరం చేయగలిగినంత సాయం చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలు, కేంద్రం అమలుచేస్తున్న పథకాలు గురించి కె.సి.ఆర్‌., వెంకయ్యనాయుడు చర్చించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రిగా వెంకయ్యనాయుడు ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా కె.సి.ఆర్‌. అభిప్రాయపడ్డారు.

Other Updates