hyderabadహౖదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఇక్కడున్న మెట్రో పాలిటన్‌ కల్చర్‌, సమతుల వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిశ్రమలు స్థాపించడానికి ఆకర్షిస్తున్నాయి. అయితే నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల రద్దీకూడా ఎక్కువవుతోంది. ఈ సందర్భంలో హైదరాబాద్‌ నగరంలో మౌలిక వసతులు పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంకోసం కృషి చేస్తోంది. సేఫ్‌, స్మార్ట్‌ అండ్‌ స్లమ్‌లెస్‌ సిటీగా హైదరాబాద్‌ను మార్చడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

హైదరాబాద్‌ నగరంలో పోలీసులకు 350 కోట్ల రూపాయల వ్యయంతో జీపిఎస్‌, కంప్యూటర్‌ లాంటి అత్యాధునిక వసతులతో కూడిన వాహనాలను సమకూర్చారు. సంఘటనా స్థలానికి 10 నిమిషాలలోనే పోలీసులు చేరుకునేవిధంగా ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌కు 44.59 కోట్ల రూపాయలను, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌కు 25 కోట్ల రూపాయలు బడ్జెట్‌ ప్రతిపాదించారు. నగరంలోని పోలీస్‌ స్టేషన్లను ఆధునీకరించడానికి ఈ బడ్జెట్‌లో 20 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించని విధంగా ట్రాఫిక్‌ నిర్వహించడంకోసం, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడం కోసం 21.41 కోట్ల రూపాయలను, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్యారక్‌లు, క్యాంపింగ్‌ సెంటర్లు నిర్మించడానికి 45 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.

హైదరాబాద్‌లోని జి.హెచ్‌.ఎం.సి., మెట్రో రైల్వే, మెట్రో పాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డులాంటి సంస్థలకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా నగర ప్రజలకు అనేక రకాల సేవలు అందుతున్నందున ఆ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. జి.హెచ్‌.ఎం.సి. ఆధ్వర్యంలో జరిగే, మురికివాడలులేని నగరంకార్యక్రమానికి రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. హైదరాబాదు మెట్రో రైల్వేకి రూ. 416.67 కోట్లు ప్రతిపాదించారు. హెచ్‌.ఎం.డబ్ల్యు.ఎస్‌.ఎస్‌.బి.కి హైదరాబాద్‌ పట్టణంలోని మురికివాడల్లో మంచినీటి సరఫరా మెరుగుదల, కృష్ణా, గోదావరి మంచినీటి పథకాల అమలు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థకోసం వెరసి రూ. 581 కోట్లు ప్రతిపాదించారు.

Other Updates