హైదరాబాద్‌-నగరానికిహైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఇక్కడున్న మెట్రో పాలిటన్‌ కల్చర్‌, సమతుల వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిశ్రమలు స్థాపించడానికి ఆకర్షిస్తున్నాయి. అయితే నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల రద్దీకూడా ఎక్కువవుతోంది. ఈ సందర్భంలో హైదరాబాద్‌ నగరంలో మౌలిక వసతులు పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంకోసం కృషి చేస్తోంది. సేఫ్‌, స్మార్ట్‌ అండ్‌ స్లమ్‌లెస్‌ సిటీగా హైదరాబాద్‌ను మార్చడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
హైదరాబాద్‌ నగరంలో పోలీసులకు 350 కోట్ల రూపాయల వ్యయంతో జీపిఎస్‌, కంప్యూటర్‌ లాంటి అత్యాధునిక వసతులతో కూడిన వాహనాలను సమకూర్చారు. సంఘటనా స్థలానికి 10 నిమిషాలలోనే పోలీసులు చేరుకునేవిధంగా ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌కు 44.59 కోట్ల రూపాయలను, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌కు 25 కోట్ల రూపాయలు బడ్జెట్‌ ప్రతిపాదించారు. నగరంలోని పోలీస్‌ స్టేషన్లను ఆధునీకరించడానికి ఈ బడ్జెట్‌లో 20 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించని విధంగా ట్రాఫిక్‌ నిర్వహించడంకోసం, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడం కోసం 21.41 కోట్ల రూపాయలను, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్యారక్‌లు, క్యాంపింగ్‌ సెంటర్లు నిర్మించడానికి 45 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
హైదరాబాద్‌లోని జి.హెచ్‌.ఎం.సి., మెట్రో రైల్వే, మెట్రో పాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డులాంటి సంస్థలకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా నగర ప్రజలకు అనేక రకాల సేవలు అందుతున్నందున ఆ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. జి.హెచ్‌.ఎం.సి. ఆధ్వర్యంలో జరిగే, మురికివాడలులేని నగరంకార్యక్రమానికి రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. హైదరాబాదు మెట్రో రైల్వేకి రూ. 416.67 కోట్లు ప్రతిపాదించారు. హెచ్‌.ఎం.డబ్ల్యు.ఎస్‌.ఎస్‌.బి.కి హైదరాబాద్‌ పట్టణంలోని మురికివాడల్లో మంచినీటి సరఫరా మెరుగుదల, కృష్ణా, గోదావరి మంచినీటి పథకాల అమలు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థకోసం వెరసి రూ. 581 కోట్లు ప్రతిపాదించారు.

ఎస్‌.సి.,-ఎస్‌.టి.,-మైనారిటీ1సంక్షేమ రంగానికి భారీ నిధులు
రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు ప్రతిపాదించింది. ఎస్‌.సి., ఎస్‌.టి., మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమశాఖలకు రూ. 15,191 కోట్లు ప్రతిపాదించింది.
శ్రీ పేదరికంతో మగ్గుతున్న షెడ్యూల్డు కులాలవారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం సాంఘిక సంక్షేమశాఖను నిర్దిష్టంగా ఎస్‌.సి. అభివృద్ధిశాఖగా మార్పుచేసింది. ఎస్‌.సి.లకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం కూడా తీసుకొంది. గత ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారంకూడా చుట్టారు. ఈ కార్యక్రమం అమలు కోసం బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు. 2014 నుంచి 2019 వరకు ఎస్‌.సి.ల అభివృద్ధికోసం 50వేల కోట్ల రూపాయలు వ్యయపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీ రాష్ట్రంలో ఎస్‌.టి.ల సమగ్రాభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. గిరిజన తండాలు, ఆదివాసిగూడేలను గ్రామపంచాయతీలుగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మైదాన ప్రాంత గిరిజనులకోసం కూడా ఐ.టి.డి.ఎ. తరహా పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది.
శ్రీ కుంరంభీమ్‌ అమరత్వం చెందిన జోడేఘాట్‌ను కుంరం భీమ్‌ స్మారక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అక్కడొక గిరిజన మ్యూజియంతోపాటు, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
శ్రీ గిరిజన ప్రాంతాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 245.92 కోట్లు ప్రతిపాదించింది. ఎస్‌.టి.ల సంక్షేమానికి మొత్తం రూ. 4559.81 కోట్లు ప్రతిపాదించారు.

ఎస్‌.సి., ఎస్‌.టి. ఉప ప్రణాళిక
ఎస్‌.సి. ఎస్‌.టి.ల జనాభా ప్రాతిపదికగా నిధులు వ్యయపరిచేందుకు ఎస్‌.సి., ఎస్‌.టి., సబ్‌ప్లాన్‌ను కట్టుదిట్టంగా అమలుచేసి ఆయావర్గాల అభివృద్ధికి పాటుపడాలన్నది ప్రభుత్వ ఆశయం. జనాభా ప్రాతిపదికన ఎస్‌.సి.ల సబ్‌ప్లాన్‌కు రూ. 7579.45 కోట్లు, ఎస్‌.టి.ల సబ్‌ప్లాన్‌కు రూ. 4559.81 కోట్లు ప్రతిపాదించారు. జనాభా శాతానికి అనుగుణంగా ఎస్‌.టి. సబ్‌ప్లాన్‌ పరిమాణాన్ని 9.34 శాతానికి పెంచడం జరిగింది.
బి.సి. సంక్షేమం
బి.సిల. సంక్షేమం కోసం ఇప్పటివరకు నిర్ధిష్టమైన ప్రణాళికలేదు. కార్పొరేషన్లు ఏర్పాటుచేసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అందుకే ఓ ప్రణాళిక, పద్ధతి ప్రకారం బి.సి.ల అభివృద్దికి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బి.సి.ల అభివృద్ధికోసం ఈ ప్రణాళికలో ప్రణాళికేతర, ప్రణాళికా వ్యయం క్రింద రూ. 2022 కోట్లు ప్రతిపాదించారు.

మహిళా-శిశు-సంక్షేమం1మహిళా శిశు సంక్షేమం
సమాజంలో సగంగా ఉన్న మహిళల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు కల్పించింది. మహి ళలకు భద్రత కల్పించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఈవ్‌ టీజింగ్‌, యాసిడ్‌ దాడులవంటి సంఘటనలు కలవరపరుస్తున్నాయి. అందుకే మహిళల భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో సూచనలకోసం ప్రభుత్వం మహిళా అధికారులతో ఒకమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనలు కూడా చేసింది. అలాగే, హైదరాబాద్‌ నగరంలో మహిళల భద్రతకోసం, ఈవ్‌టీజింగ్‌ అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
మహిళల భద్రతకోసం చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 10 కోట్లు కేటాయించారు.
గర్భిణీలు, బాలింతలు, శిశువుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 221 కోట్లు కేటాయించారు. ఇది సమైక్య రాష్ట్రంలో ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే 300 శాతం అధికం. పి.సి.డి.ఎస్‌. పథకం క్రింద రూ. 1103.88 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
గ్రామీణ ప్రాంత పేద మహిళలు అందరికీ ఎల్‌.పి.జి. కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.

మెరుగైన-వైద్యంతో-ఆరోగ్యభాగ్యం1మెరుగైన వైద్యంతో ఆరోగ్యభాగ్యం
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తన ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ బడ్జెట్‌లో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి పెద్దపీట వేసింది.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంవల్ల ప్రైవేటురంగంలో ఆసుపత్రులు పెద్దఎత్తున వచ్చాయి. వైద్యం ఖరీదు అయిపోయింది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.
ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేసి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి తీసుకొనే చర్యలలో భాగంగా ఈసారి బడ్జెట్‌లో రూ. 2282.86 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఈ కేటాయిం పులు రూ. 1277.39 కోట్లుగా ఉండటం గమనార్హం.
శ్రీ హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు చెరో రూ. 100 కోట్లు.
శ్రీ సుల్తాన్‌బజార్‌, పెట్లబురుజు మెటర్నిటి ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 50 కోట్లు
శ్రీ నీలోఫర్‌ ఆస్పత్రికి రూ. 30 కోట్లు
శ్రీ కింగ్‌కోఠి ఆసుపత్రికి రూ. 25 కోట్లు
శ్రీ రాష్ట్రంలో 42 ఏరియా ఆస్పత్రుల స్థాయి పెంచేందుకు
ఒక్కో ఆస్పత్రికి కోటి రూపాయలు.
శ్రీ కంటి, మానసిక, ఛాతి, ఇ.ఎన్‌.టి ఆసుపత్రుల అభివృద్ధికి రూ. 40 కోట్లు
శ్రీ మెడికల్‌ కళాశాలల భవనాల నిర్మాణానికి రూ. 152 కోట్లు
శ్రీ వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఆర్థికమంత్రి ప్రకటించారు.

‘వాటర్‌గ్రిడ్‌’తో-ఇంటింటికీ-నల్లా1‘వాటర్‌గ్రిడ్‌’తో ఇంటింటికీ నల్లా
మనిషికి జీవశక్తినిచ్చేది నీళ్ళే. రాష్ట్రంలో జీవ నదులు ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్ళకోసం రాష్ట్ర ప్రజలు అల్లాడిపోవలసిన పరిస్థితి. తాగునీటికోసం మహిళలు కడవలు పట్టుకొని మైళ్ళదూరం నడచి వెళ్ళవలసి వస్తోంది.
రక్షిత మంచినీటికి నోచుకోలేక ఆదిలాబాద్‌ జిల్లాలో గోండులు రోగాలపాలై, ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ వల్ల ప్రజలు బొక్కలలో మూలుగు చచ్చిపోయి కాళ్ళు, చేతులు వంకరలు తిరిగి నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ దుస్థితి నుండి ప్రజలకు విముక్తి కల్గించేందుకు, ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రూపొందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రిడ్‌ల ఏర్పాటుకు దాదాపు 25వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా. ఈ పథకం
పూర్తయ్యేసరికి ఏ ఆడబిడ్డా మంచినీటి కోసం బిందె పట్టుకొని వీధులవెంట తిరిగే పరిస్థితి ఉండరాదన్నది ప్రభుత్వ సంకల్పం.
ఈ వాటర్‌గ్రిడ్‌ పనులకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించారు.

సాగునీటి-ప్రాజెక్టులుప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు
నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కరువుపీడిత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాలుగు ఎత్తిపోతల ప్రాజెక్టులు`కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, భీమాలను ఆఘ మేఘాలమీద ఈ సంవత్సరమే పూర్తిచేసి 2,97,550 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు.మొత్తం నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో రూ. 6500 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణలోని 45వేలకుపైగా ఉన్న చెరువులను వచ్చే ఐదేళ్లలో పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 9వేల చెరువుల పునరుద్ధరణకు రూ. 2,000 కోట్లు ప్రతిపాదించారు.

పరిశ్రమలకు-రెడ్‌కార్పెట్‌1పరిశ్రమలకు రెడ్‌కార్పెట్‌
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి పారిశ్రామీకరణే మార్గం. దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్‌ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పగిస్తారు. దానిని అన్నిరకాలుగా అభివృద్ధిచేసి ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో పరిశ్రమల కోసం ఈ భూమిని కేటాయిస్తారు. ఈ భూమికి విద్యుత్‌, నీళ్ళు సరఫరావంటి పనులుకూడా టి.ఎస్‌.ఐ.ఐ.సి. చేపడుతుంది. ఇందుకోసం ఈ సంస్థకు బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకం రూపంలో చెల్లించాల్సిన 638 కోట్ల రూపాయల బకాయిలుకూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలకు విద్యుత్‌ సబ్సిడీకోసం రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే ఐ.టి.ఐ.ఆర్‌. ప్రాజెక్టు కోసం రూ. 90 కోట్లు
శ్రీ ఎస్‌.సి.లలోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 97.51 కోట్లు ప్రతిపాదించారు.

శ్రీ దుర్భర స్థితిలో ఉన్న పవర్‌లూమ్‌ కార్మికులను ఆదుకోవడానికి పేద కార్మికులకు ఉన్న రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థికమంత్రి తెలిపారు.

కరెంటు కష్టాలకు కళ్ళెం
మానవ జీవితాన్ని ఇప్పుడు కరెంటు నడిపిస్తున్నది. కరెంటు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అవసరాలు పెరిగిపోవడంతో కరెంట్‌ డిమాండ్‌ కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు, ఎక్కువ సంఖ్యలో ఉన్న పారిశ్రామిక సంస్థలు, సేవారంగంలో ఉన్న ఉద్యోగులు అనునిత్యం కరెంట్‌పైనే ఆధారపడి ఉన్నారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణ ప్రాంతంపట్ల వివక్ష చూపడంవల్ల ఇప్పుడు విద్యుత్‌ కొరత ఏర్పడిరది. తెలంగాణలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టలేదు. దీనివల్ల ఇప్పడు మనకు కావలసినంత విద్యుత్‌ అందుబాటులో లేకుండా పోయింది. తెలంగాణలోని పరిశ్రమలపైన, వ్యవసాయంపైనా ఈ కొరత చాలా ప్రభావం చూపిస్తున్నది.

విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ప్రభు త్వం సకల ప్రయత్నాలు చేస్తున్నది. వచ్చే ఐదేళ్ళలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవలె విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కూడా కుదుర్చుకుని వచ్చారు. ఎన్‌టిపిసి ద్వారా రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. జెన్‌కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం బి.హెచ్‌.ఇ. ఎల్‌.తో ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి టెండర్లు కూడా నిర్వహించారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించేవరకు కొంతసమయం పడుతుంది. ఒకటి రెండేళ్లలో పరిస్థితి కొంత మెరుగవుతుంది. మూడేళ్ల తరువాత మన అవసరాలకు తగినంత విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో అందరికీ 24 గంటల విద్యుత్‌ అందించడం, మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యంగా వుంది.ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను ఆదుకోవడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయడంతోపాటు పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో కూడా పెద్ద ఎత్తున కరెంట్‌కొనుగోలు చేశారు.

జల విద్యుత్‌, థర్మల్‌ విద్యుత్‌తోపాటు సోలార్‌ విద్యుత్‌ను కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలోని రైతులకు సోలార్‌ పంపుసెట్లను అందించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ ఉత్పత్తికోసం 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రణాళికలో భాగంగా టిఎస్‌ జెన్‌కోలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. నాన్‌ప్లాన్‌ కింద విద్యుత్‌ రంగానికి 3241.90 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇందులో మూడువేల కోట్ల రూపాయల విద్యుత్‌ సబ్సిడీలు కూడా భాగం.

అన్నదాతకు-అండగా..1అన్నదాతకు అండగా..
తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం ప్రజలు, వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, కొత్తగా సాగునీటి వ్యవస్థలు కల్పించకపోవడం, వర్షాభావ పరిస్థితులు, తదితర కారణాలవల్ల వ్యవసాయం చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితులలో రైతన్నకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అనేక చర్యలు చేపట్టింది. వ్యవసాయరంగానికి తొలి బడ్జెట్‌లో రూ. 8,511 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం 3,061 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం రూ. 5,449 కోట్లు.

శ్రీ రైతుల పంటరుణాలు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ, రైతుల కడగండ్లకు చలించిన ముఖ్యమంత్రి బంగారం గిర్వి పెట్టి తీసుకొన్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మొదటి విడతగా రూ. 4,250 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. మిగతా విడతలను రాగల మూడేళ్లలో ఇలాగే చెల్లిస్తారు.
శ్రీ 2009`10 సంవత్సరం నుండి వరుసగా ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ రైతులను ఆదుకోవడానికి 480.43 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. అలాగే, ఎర్రజొన్న రైతులకు చెల్లించవలసిన బకాయిలు 11.50 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం చెల్లించింది.

శ్రీ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ‘మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయతలపెట్టింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 400 కోట్లు ప్రతి పాదించారు.
శ్రీ తెలంగాణలో అనేక రకాల నేలలు ఉన్నాయి. సారవంత మైన భూములున్నాయి. ఇవన్నీ విత్తనాల తయారీకి అనుకూలమైనవి. మంచి ప్రణాళికతో తెలంగాణను భారతదేశ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 50 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 100 కోట్లు, రైతు బడుల కోసం రూ. 10 కోట్లు, క్రాప్‌ కాలనీల అభివృద్ధికి రూ. 20 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
శ్రీ రైతులకు పెట్టుబడుల వ్యయం తగ్గించేందుకు, సౌకర్యంగా ఉండి ఉత్పత్తి పెరిగేందుకు కమతాల ఏకీకరణ చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీ గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌ రైతులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ చుట్టుప్రక్కల దాదాపు వెయ్యి ఎకరాలలో పైలట్‌ ప్రాజెక్టుగా గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌ ప్రారంభించనున్నారు. గ్రీన్‌హౌజ్‌ల ఏర్పాటు కోసం 75 శాతం సబ్సిడీగా అందిస్తారు. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ సూక్ష్మ సేద్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు ఎస్‌.సి., ఎస్‌.టిలకు వందశాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ కోళ్ళ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పిస్తూ, కోళ్ళ పరిశ్రమను నిర్వహించేవారిని కూడా ప్రభుత్వం రైతులుగానే గుర్తిస్తోంది. వీరికి కూడా విద్యుత్‌ సబ్సిడీ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 20 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ డిమాండ్‌కు తగినంతగా మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి జరగడంలేదు. ఈ విషయంలో రైతులను ప్రోత్సహించేందుకు, పాల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలకోసం ఈ బడ్జెట్‌లో రూ. 16.30 కోట్లు ప్రతిపాదించారు.

విద్యకు-1విద్యకు రూ. 10,956 కోట్లు
విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా చూడకుండా, మానవ వనరుల అభివృద్ధికోసం భవిష్యత్తుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తొలి బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 10,956 కోట్లు కేటాయించింది. కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని చేతల్లో నిరూపించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయంగా రూ. 3,418 కోట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో విద్యారంగానికి బడ్జెట్‌లో 10.88 శాతం నిధులు దక్కాయి.
శ్రీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా పథకానికి ముందస్తు ఏర్పాట్లకోసం రూ. 25 కోట్లు కేటాయించింది.
శ్రీ పాఠశాల విద్యకు అత్యధికంగా 9335.13 కోట్ల రూపాయలు కేటాయించారు. భవన నిర్మాణాలు, మధ్యాహ్న భోజన పథకం, కంప్యూటర్‌ విద్య, వయోజనవిద్య,
ఉపాధ్యాయుల వేతనాలు, బాలికలకోసం మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, స్కూల్‌ గ్రాంట్‌, టీచర్లకు శిక్షణా తరగతులు, సైన్స్‌ ఫేర్‌ తదితర కార్యక్రమాలకు ఈ నిధులు వ్యయపరుస్తారు. ఇందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో నిర్వహించే మోడల్‌ స్కూళ్ళ నిర్మాణానికి రూ. 940.73 కోట్లు, రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్‌కు రూ. 906.40 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ ఉన్నత విద్యకోసం రూ. 1227.26 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పీజీ కాలేజీలతోపాటు యూనివర్సిటీల అభివృద్ధికోసం ఈ నిధులు వినియోగిస్తారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన విశ్వవిద్యాలయాలలో భవనాల నిర్మాణంకోసం రూ. 16.76 కోట్లు కేటాయించారు.

శ్రీ సాంకేతిక విద్యకు ప్రణాళికా వ్యయం రూ. 212 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 181 కోట్లు ప్రతిపాదించారు. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ కోసం రూ. 119.63 కోట్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు ప్రతిపాదించారు. యూనివర్సిటీలకు రూ. 292.02 కోట్లు కేటాయించారు.

Other Updates