విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ అభివృద్ది పథంలో మరో అద్భుతమైన ఘట్టం అవిషృతమైంది. గూగుల్ సంస్ధ మొదటి సారి అమెరికా అవతల అతిపెద్ద సొంత క్యాంపస్‌ని ( కార్యలయాన్ని ) నిర్మించేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచంలోని అనేక నగరాలను తోసిరాజని హైదరాబాద్ నగరం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మౌంటెన్‌వ్యూలోగల గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ ఫ్లెక్స్‌లో గూగుల్ సంస్ధ టాప్ మేనేజ్ మెంట్లతో వరుసగా సమావేశమై, ఈ మేరకు ఒప్పదం కుదుర్చుకున్నారు. ఈ అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం కోసం మంత్రి కె.తారక రామరావు సమక్షంలో ఐటి కార్యదర్శి జయేష్ రంజన్, గూగుల్ (అంతర్జాతీయ వసతులు, కార్యాలయాలు) అధ్యక్షుడు డేవిడ్ రాడ్ క్లిప్ ఇందుకు సంబంధించిన యంవోయు కుదుర్చుకున్నారు.
తాము గూగుల్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ లో సంస్ధ అసియాలో మొట్టమొదటి గూగుల్ క్యాంపస్ లోని ఏర్పాటు చేస్తుందని, ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ అని మంత్రి కె.టి.ఆర్. తెలిపారు. ఈ క్యాంపస్ నిర్మాణం వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం అవుతుందన్నారు. ఇందుకోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటి కారిడార్ లో 7.2 ఏకరాల స్ధలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్యాంపస్ ద్వారా 13 వేల మంది ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు
యంవోయు అనంతరం మాట్లాడిన గూగుల్ అధ్యక్షుడు (అంతర్జాతీయ వసతులు, కార్యాలయాలు) డేవిడ్ రాడ్ క్లిప్ ఈ నిర్మాణం కోసం గూగుల్ సంస్ధ సూమారు పన్నెండు నెలల పాటు క్యాంపస్ తాలుకు డిజైన్లు, ప్రణాళిలు రూపొందించుకుని, నాలుగు సంవంత్సారాల్లో నిర్మాణం పూర్తి చేస్తుందన్నారు. ఈ నిర్మాణం పూర్తియితే 2 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యయాలు అందుబాటులోకి వస్తాయని, ఇది తమకు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద గూగుల్ ప్రాంగణం అవుతుందని రాడ్ క్లిప్ తెలిపారు. 2019 నాటికి పూర్తి స్ధాయి క్యాంపస్ నిర్మాణం పూర్తై, కార్యకలాపాలకి అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు.
గూగుల్ క్యాంపస్ లో కె.తారక రామారావు వరుస సమావేశాలు…
గూగుల్ కేంద్ర కార్యాలయంలోని గూగుల్ ఏడ్యూకేషన్ విభాగం డైరెక్టర్ బ్రమ్ బౌట్, మరో సినీయర్ గూగుల్ ప్రతినిధి రాజన్‌సేథ్‌తో మంత్రి కె.తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలో విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించేందుకు, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గూగుల్ సంస్ధ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని విద్యార్దులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించబడిరదని తెలిపారు. గూగుల్ సంస్ధ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈ కార్యక్రమానికి అవసరమైన, మౌలిక వసతులు, కంటెంట్ రూపకల్పనలో సహకరించాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇప్పటికే గూగుల్ క్రోమ్ వరంగల్‌లోని నాలుగు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని మంత్రి గూగుల్ కి గుర్తు చేశారు.
దేశంలోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ పొందే మొదటి రాష్ట్రం తెలంగాణ
ప్రముఖ నగరాల్లోని భౌగోళిక వివరాలు, దర్శనీయ ప్రదేశాలు, హోటళ్లు షాపింగ్ మాల్స్ వంటి వివరాలను ఏప్పటికప్పుడు అందించే గూగుల్ స్ట్ర్రీట్ వ్యూ సేవలను భారతం దేశంలోనే తొలిసారి పూర్తి స్ధాయిలో తెలంగాణ రాష్ట్రంలో అందించేందుకు గూగుల్ అంగీకరించిందని మంత్రి కె.తారక రావ రావు తెలిపారు. ఈ స్ట్రీట్ వ్యూ విధానం ఇప్పటికే అబివృద్ది చేందిన దేశాల్లో విసృతంగా ఉపయోగంలో ఉంది. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే నగరాల్లోని పత్రి ప్రదేశాన్ని తమ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చని, అందుబాటులోని ప్రదేశాల గురించి అప్ డేట్స్ నేరుగా పౌరులకి అందుతాయని, దీంతో హైదరాబాద్ లాంటి నగరాల్లోని వ్యాపారం పెరగడంతో పాటు, పౌరులకి పూర్తి స్ధాయి సాంకేతిక సౌలభ్యం లభిస్తుందని మంత్రి తెలిపారు. భారత దేశంలో ఇప్పటికే తాజ్ మహల్, కుతుబ్ మీనార్, వంటి చారిత్రక కట్టడాలకి అర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి వాటితో గూగుల్ ఒప్పందం చేసుకున్నప్పటికి పూర్తి స్దాయిలో మాత్రం మొట్టమొదటి సారి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరంలోని ప్రతి భవనాన్ని మ్యాప్ చేయవచ్చని,దీంతో అస్తి పన్నుతో పాటు ఇతర పౌరసేవల విషయంలో ప్రభుత్వానికి, ప్రజలకి సహయకారిగా ఉంటుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అధ్యయనానికి గూగుల్ ఫైబర్ బృందం
తెలంగాణ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటింకీ మంచినీరు తరహాలో ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమం లాంటి ప్రయత్నాన్ని గూగుల్ అమెరికాలో చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికాలోని కన్ కస్ లాంటి 8 పట్టణాల్లో ఇంటింటికి గూగుల్ ఫైబర్ పేరుతో ప్రయత్నాన్ని గూగుల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో చేపట్టిన తమ కార్యక్రమాన్ని మంత్రి గూగుల్ సంస్ధకి వివరించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణకి ప్రత్యేకంగా ఒక బృందాన్ని పంపేందుకు గుగూల్ అంగీకరించింది.