ది సిటీ
‘‘డాక్యుమెంటరీ అంటే వస్తువులను, వ్యక్తులను, భవనాలను ఉన్నదున్నట్లుగా తీయడం మాత్రమే కాదు. ఈ మూడిరటి మధ్య ఉన్న జీవనానుబంధాన్ని, జీవనానుభూతిని చైతన్యవంతంగా (డైనమిక్)గా ఆవిష్కరించడమే అని డాక్యుమెంటరీల పితామహుడు జాన్ గ్రీర్‌సన్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ మాటలకు తెర ఎత్తు నిదర్శనంగా నిలిచే డాక్యుమెంటరీ` ది సిటీ!
హైదరాబాద్ నగరంతో తనకున్న ఆత్మీయ బంధానికి, అవినాభావ సంబంధానికి నివాళిగా నర్సింగ్‌రావు తీసిన డాక్యుమెంటరీ ఇది. తను చూసిన, తిరిగిన,విన్న, అనుభూతి చెందిన హైదరాబాద్ నగరాన్ని, తనలో ఓ అంతర్భాగంగా జీర్ణించుకుపోయిన హైదరాబాద్ నగరాన్ని, దానిలో, దానితో దానిచుట్టూ అల్లుకున్న జీవనగతిశీలతని, నిత్య చైతన్యస్ఫూర్తి ఈ డాక్యుమెంటరీలో తెరకెక్కించారు.
వందలాది సంవత్సరాల చారిత్రక వైభవం. దక్కనీ సంస్క ృతీ ప్రాభవం, ఆధునిక జీవనాల సంరంభం ఒక్కచోట రాశిగా రూపొందిన సజీవ కేతనం ` హైదరాబాద్. భిన్న సంప్రదాయాలు, విభిన్న సంస్క ృతుల సంగమ స్థలమైన హైదరాబాద్ నగరంలోని విలక్షణతని, వైవిధ్యతని, విశుద్ధతని దృశ్యాలు దృశ్యాలుగా తెరప్రతిష్ట చేసిన ఈ డాక్యుమెంటరీ, హైదరాబాద్ నగరంపై నర్సింగ్‌రావు లిఖించిన అందమైన దృశ్య కవిత్వం!
‘ది సిటీ’కి నర్సింగరావు స్క్రీన్‌ప్లే దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలనే కాక, సంగీతాన్ని కూడా అందించడం విశేషం. 96 నిమిషాల నిడివితో తీసిన ఈ చిత్రం బొంబాయి (1990), తిరువనంతపురం (1998) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడటమే కాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ డాక్యుమెంటరీగా రజత నంది అవార్డును 1987లో గెల్చుకుని, అంతర్జాతీయంగా వివిధ నగరాలపై వచ్చిన డాక్యుమెంటరీల సరసన సగర్వంగా నిలిచింది.
తెలంగాణా పల్లె గుండెచప్పుడు `
మా వూరు (డాక్యుమెంటరీ)
‘‘కంట్రీ కల్చర్ ఈజ్ ది ఒరిజినల్ నేటివ్ కల్చర్ ఆఫ్ ది పీపుల్’’ అని సోషల్ ఆంద్ర పాలజిస్ట్‌లు చెపుతారు. బహిర్గత శక్తులు. ప్రాపంచిక శక్తుల ప్రభావం కానీ ప్రదోషం కానీ లేని అచ్చమైన, స్వచ్ఛమైన జీవనచిత్రం ` ఊరు. జీవనాన్వేషణలో ఎవరూ ఏ దిశగా ఎగిరెళ్ళినా, వారికి వారి సొంత ఊరితో ఉండే అనుబంధాలు, అనుభవాలు, అనుభూతులు మాత్రం నిత్యచైతన్య దీపాలే! ఆ మాటకొస్తే పల్లె జీవనమే జీవ వైవిధ్య కేంద్రం. ప్రకృతికి ` పశు పక్ష్యాదులకి ` మనుషులకి మధ్య ఉండే అద్భుతమైన దృశ్యం. నిజానికి ఊరు జీవితమే సమస్త కళల సమారాధనం. ఇక్కడి ప్రతీ పనిలో ఓ సంగీతలయ ఉంది. మజ్జిగ చిలకడం నుంచి, జొన్నలు విసరడం వరకూ… నాట్లు వేయడం నుంచి కలుపు తీయడం వరకూ… ఇలా, లయబద్ధత ఊరు గుండె స్పందన. ఊరు జీవనం ఓ సమ్మోహనమైన జీవన సంగీతం.
1950ల నాటి తెలంగాణా గ్రామ ముఖచిత్రాన్ని ఒడిసిపట్టి అత్యంత ప్రేమతో బి. నర్సింగ్‌రావు అందించిన దృశ్య జీవన రaరి ` ‘మా వూరు’. ‘తెలంగాణా పల్లె తల్లికి ఓ కళాకారుడి దృశ్యాంజలి ఇది. ఆ కాల తల్లికి ఓ బిడ్డ చిత్రాంజలి ఇది.
అందుకే 51 నిమిషాల ఈ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో 1988లో ‘‘బెస్ట్ ఆంత్రోపాలజికల్ ఫిల్మ్’’ గానూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రజత నంది (1989) పురస్కారాన్ని సాధించింది. హంగరీలో 1992లో జరిగిన ‘ఇంటర్నేషనల్ మీడియా ఫెస్టివల్’లో డాక్యుమెంటరీలలో ఫస్ట్‌ప్రైజ్ పొందింది.. మ్యూనిక్ (1989) , బొంబాయి (1990), విటెర్చో (1993), బ్రాటిస్లానా (1995) వంటి మరెన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి ప్రశంసలను పొందిన ‘మా వూరు’ కి బి.నర్సింగ్‌రావు సంగీతాన్ని, స్క్రీన్‌ప్లేని మాత్రమే కాక, కళాదర్శకత్వం కూడా చేయడం విశేషం!
భూస్వామ్య వ్యవస్థలో సామాన్యుల ఆర్తనాదం ` దాసి
జాతీయస్థాయిలో అవార్డులే కరువైన తెలుగు సినిమాకు ఏకంగా 5 జాతీయ అవార్డులను అందించిన సినిమా ‘దాసి’! వందేళ్ళ భారతీయ సినిమా ప్రస్థానంలో, 84 ఏళ్ళు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఒకే ఒక్క సినిమా ` ‘దాసి’!
ఒక చిన్న వాన చుక్క, మన శరీరంపై పడి ఒళ్ళంతా జలదరించేలా చేస్తుంది. కళాకారుడికి, కళాత్మక రసజ్ఞ హృదయమున్నవాడికి ఒక చిన్న సంఘటన చాలు. అతన్ని కదిపడానికి, కుదపడానికి, కదిలించడానికి, అతని లోలోపలి అంతశ్చేతనలలో అలజడి పుట్టించడానికి. ప్రకంపనలు సృష్టించడానికి. అలాంటి సంఘటనే బి. నర్సింగ్‌రావుకి సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణ గారి ద్వారా తెలిసింది. ఆ సంఘటన నర్సింగ్‌రావు వంటి సున్నిత, సునిశిత మనస్కుడిలో సృష్టించిన అలజడే ‘దాసి’గా సాకారమయింది.
తెలంగాణా ప్రాంతంలోని దొరల గడిలలో దాసి సంప్రదాయం గురించి బాల్యం నుండే కథలు కథలుగా విన్న నేపథ్యం నరసింగ్‌రావులో ఏ మూలనో దాగి ఉండి, అది తను సినీదర్శకుడైన తర్వాత మరింత విస్తృత పరిశోధనంగా మారి, చివరికి భూస్వామ్య విధానంలోని మహిళా కట్టు బానిసల పరివేధనా గీతంగా, ‘దాసి’ చిత్రంగా అవతారమెత్తింది.
సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే కథనాయకని పరిచయం చేసే వాయిస్ ఓవర్‌లో చెప్పిన వ్యాఖ్యానం వినండి. ఒక మనిషిని వేరొక మనిషి. దోపిడి చేసే అవాంఛనీయ జీవనగతిలోని గుండెకోత చప్పుడు వినిపిస్తుంది. ‘‘నేనొక నిరుపేద కుటుంబంలో పుట్టిన దాసిని. మావాళ్ళు నన్ను 20 రూపాయలకు చిన్న దొరసాని తండ్రికి అమ్మేసారు. చిన్న దొరసానికి పెళ్ళయింతర్వాత ఆమెతోపాటు నేను ఈ గడీకి వచ్చాను. దొర, దొరసాని చెప్పినట్లు నడుచుకునే యంత్రాన్ని నేను. నాకంటూ ఇష్టాలు, అయిష్టాలు ఏవీ ఉండకూడదు. నా వయసులో ఉన్న ఏ ఆడమనిషీ నేనను భవించినన్ని అవమానాలు నైచ్యాన్ని భరించి వుండదు. ఈ నాలుగు గోదల మధ్య నా మనసెప్పుడో చచ్చిపోయింది. నేనిక్కడెందుకున్నానని ఎవర్నీ అడిగే అధికారం నాకు లేదు. ఎందుకంటే నేనొక దాసీ దాన్ని.
1920 ప్రాంతంలో తెలంగాణా ప్రాంతంలోని దొరగడీల లోని ‘దాసి’ల వ్యవస్థనీ, అవస్థనీ, అస్తవ్యస్థ స్థితినీ ‘దాసి’ సినిమా, ప్రేక్షకుల గుండెలు చిక్కుబడే స్థాయిలో చూపించింది. నిస్సహాయతలో మనిషి ప్రకటించే భావోద్వేగం ` అరుపు! ఈ సినిమా ఆరంభంలో దాసి పాత్రధారి కమ్లి నిస్సహాయ ఆర్త నాదం. సినిమా ఎండిరగ్‌లో బలవంతపు గర్భవిచ్ఛిత్తి సమ యంలో చేసే ఆర్తనాదం అలాంటి లక్షలాది నిస్సహాయ అరుపుల ప్రతిధ్వనులే!ప్రఖ్యాత దర్శకులు ఇన్గ్‌మార్ బెర్గ్‌మాన్ ప్రభావంతో సెర్జీ ఐసెన్‌స్టీన్ చూపించిన ‘డయలెక్టిక్ ఆఫ్ మాంతేజ్’ పద్ధతిలో నరసింగ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాసి’ సినిమా అంతర్జాతీయంగా 35 పైగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొని, వ్యవస్థలో మనిషి బందీjైు దిక్కుతోచని స్థితిలో చేస్తున్న నిస్సహాయ ఆక్రందనకు తెరరూపంగా నిలిచింది.
హోం
»