వరంగల్‌ నగరంలో నె రోజు పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నాలాపై ఉన్న ఆక్రమణు తొగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాు, మురికి నీటి నాలాపై ఉన్న ఆక్రమణు గుర్తించి, వాటిని తొగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీని మంత్రి నియమించారు. భారీ వర్షాు, వరద వ్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదాయి, ఇతర మౌలిక సదుపాయా పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జరిగిన నష్టంపై అధికాయి పూర్తి స్థాయి అంచనాు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధు మంజూరు చేస్తామని వ్లెడిరచారు. కేసీఆర్‌ ఆదేశా మేరకు ఇతర మంత్రు, ప్రజా ప్రతినిధుతో కలిసి వరంగల్‌ నగరంలో పర్యటించిన కేటీఆర్‌ అధికారుతో సమీక్ష నిర్వహించారు.


వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా వరద ముంపుపై జిల్లా ప్రజాప్రతినిధు, అధికారుతో పురపాక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రు ఈట రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు. ‘‘నగరంలో పర్యటించిన సందర్భంలో దాదాపు అన్ని ప్రాంతా ప్రజు ఒకే విషయం చెప్పారు. నాలాపై ఆక్రమణ వ్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాు జమయమయ్యా యని చెప్పారు. వారు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. నగరంలో అనేక చోట్ల నాలాపై ఆక్రమణున్నాయి. వాటిని తక్షణం తొగించాలి. ఈ విషయంలో రాజీ పడేది లేదు. రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. పెద్ద పెద్ద నిర్మాణాు తొగించడానికి భారీ యంత్రాు తెప్పించండి. ఇప్పటికే గుర్తించిన నిర్మాణా తొగింపు పని వెంటనే ప్రారంభం కావాలి. ఇంకా నీటి ప్రవాహాు వెళ్లే నాలాకు ఏమైనా అడ్డంకున్నాయా అనే విషయం పరిశీలించాలి. నాలాపై ఆక్రమణు గుర్తించి, వాటిని తొగించే పని చేయడానికి కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని నియమిస్తున్నాం. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్‌ స్వయంగా ఈ పనును పర్యవేక్షిస్తారు. వీరిద్దరిలో ఒకరు ప్రతీ వారంలో ఒక రోజు వరంగల్‌ లో పర్యటిస్తారు. నె రోజుల్లోగా మొత్తం ఆక్రమణు తొగించాలి. అవి అక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొగించాలి. పేద ఇండ్లయితే, వారికి ప్రభుత్వం తరుఫున డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొగించాలి. ఏదేమైనా సరే, మొత్తం నాలాపై ఆక్రమణు తొగించాలి. నాలాపై ఆక్రమణు తొగిస్తూనే, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణు జరగకుండా వాటికి ప్రహారీ గోడు(రిటైనింగ్‌ వాల్స్‌) నిర్మించాలి. ఎస్‌ఆర్‌ఎస్పి కాువ ఆక్విడక్ట్‌ వద్ద కూడా పూడిక తీయాలి’’ అని కేటీఆర్‌ అధికారుకు స్పష్టమైన ఆదేశాు జారీ చేశారు.

‘‘వరంగల్‌ నగరంలో నాలాలపై ఆక్రమణు ఇప్పుడు వచ్చినవి కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్న తంతు. గతంలో ఇండ్ల నిర్మాణం, లే అవుట్లు, రోడ్ల నిర్మాణం ఓ పద్ధతి ప్రకారం జరగలేదు. ఇకపై అలా జరగదు. అన్నీ పక్కాగా జరుగుతాయి. పద్ధతి ప్రకారం నగరాభివృద్ధి జరగానే ఉద్దేశ్యంతోనే కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చాం. దానికి తోడు వరంగల్‌ నగరానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధమయింది. ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే దాన్ని ప్రకటిస్తాం. ఈ రెండిరటితో పాటు కొత్తగా టిఎస్‌ బి-పాస్‌ కూడా వచ్చింది. ఈ చట్టాు, విధానాు, ప్రణాళికకు అనుగుణంగా వరంగల్‌ లో ఇకపై నిర్మాణాుండాలి. నగరం ఎటు పడితే అటు, ఎట్ల పడితే అట్ల అన్నట్లు కాకుండా ఓ పద్ధతి ప్రకారం అభివృద్ధి కావాలి. ప్రణాళిక ప్రకారం నిర్మాణాు జరగాలి’’ అని కేటీఆర్‌ వివరించారు.

‘‘వరంగల్‌ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయి. వరంగల్‌ లో భారీ వర్షాు, వరదు అనే సమాచారం సిఎం కు ఎంతో ఆందోళన కలిగించింది. తెంగాణలో హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌ దెబ్బతినకూడదని భావించారు. మంత్రు, ఎమ్మెల్యేు, అధికారుతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏమాత్రం ప్రాణనష్టం కగకుండా సహాయ చర్యు ముమ్మరం చేయాని మార్గ నిర్ధేశం చేశారు. సిఎం ఆదేశా మేరకు వరంగల్‌ నగరంలో 20 పునరావాస కేంద్రాను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాకు చెందిన 4,500 మందికి ఆశ్రయం కల్పించాం. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా బోట్లు, పరికరాతో సహా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ను పంపాం. వారంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్‌ రావానుకున్నారు. కానీ సహాయక చర్యకు ఆటంకం కుగుతుందనే ఉద్దేశ్యంతో మానుకున్నారు. మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు. ఇక్కడి పరిస్థితిని చూసి, సిఎంకు నివేదించాం. తక్షణ అవసరా కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, అధికాయి పూర్తి స్థాయి అంచనాు రూపొందించిన తర్వాత ఎన్ని నిధు కావాన్నా ఇస్తామని చెప్పారు. కాబట్టి అధికాయి జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలి’’ అని కేటీఆర్‌ చెప్పారు.


‘‘వరంగల్‌ నగర జనాభా ఇప్పటికే 11 క్షయింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలి. పారిశుధ్య పనుల్లో యాంత్రీకరణ జరగాలి. స్వీపింగ్‌ మిషన్ల ద్వారా నగరంలో పరిశుభ్రతను కాపాడాలి’’ అని కేటీఆర్‌ కోరారు. ‘‘ప్రస్తుతం కురిసిన వర్షాు, వరద వ్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపుకు గురైన వారికి అవసరమైన సాయం అందించడం తక్షణ కర్తవ్యంగా అధికాయి భావించాలి. ముంపుకు గురైన వారికి ప్రభుత్వం పక్షాన్నే నిత్యావసర సరుకు అందించాలి. ఈ కార్యక్రమంలో అధికాయి, ప్రజా ప్రతినిధు భాగస్వాము కావాలి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కగవద్దు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలి. నిర్మాణంలో ఉన్న భవనా విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి’’ అని కేటీఆర్‌ సూచించారు.

వరద బాధితులకు భరోసా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశా మేరకు మంత్రు కేటీ రామారావు, ఈట రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ భాస్కర్‌ తదితయి భారీ వర్షాు, వరద ప్రభావిత వరంగల్‌ నగరంలో పర్యటించారు. మంత్రు కేటీ రామారావు, ఈట రాజేందర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లారు. వారి వెంట మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తుజా రిజ్వి, డిహెచ్‌ఇ రమేశ్‌ రెడ్డి ఉన్నారు. వరంగల్‌ లో ఇతర మంత్రు, ప్రజాప్రతినిధు వారితో జత కలిశారు.

కేటీఆర్‌ నాయకత్వంలోని బృందం వరంగల్‌ నగరంలోని నయీం నగర్‌, సమ్మయ్య నగర్‌, గోపాపూర్‌, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్‌, పోతన నగర్‌, బొందివాగు రోడ్‌, రామన్నపేట, హంటర్‌ రోడ్‌, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. చాలా చోట్ల ముంపుకు గురైన ప్రజతో మాట్లాడి వారి సాధక బాధకాు తొసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఫాతిమా – కెయు వంద ఫీట్ల రోడ్డులో గోపాపూర్‌, సమ్మయ్య నగర్‌ ప్రాంత వాసుతో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిస్థితి చక్కబడే వరకు నిత్యావసర సరుకు అందచేస్తామని హామీ ఇచ్చారు.
హంటర్‌ రోడ్డులో కేటీఆర్‌ సహా ఇతర ప్రజా ప్రతినిధు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితిని పరిశీలించారు. చాలా చోట్ల నాలాపై ఆక్రమణ వల్లే వరదు సంభవించినట్లు స్థానికు కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సభ్యును ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

కోవిడ్‌ బాధితులను పరామర్శించిన మంత్రులు
మంత్రు బృందం వరంగల్‌ లోని ఎంజిఎంలో కోవిడ్‌ వార్డును సందర్శించింది. మంత్రు కేటీఆర్‌, ఈట రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితయి పిపిఇ కిట్లు ధరించి కోవిడ్‌ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తొసుకున్నారు. కావాల్సిన మందు, పరికరాు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, నిపుణులైన వైద్యు, ఇతర సిబ్బంది అంతా సిద్ధంగా
ఉన్నాయని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగుకు చికిత్స చేస్తున్న వైద్యును, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కరోనా సోకిన వారి దగ్గరికి రావడానికి సమీప బంధువులే జంకుతున్న సమయంలో కేటీఆర్‌ సహా మంత్రుంతా ఎంతో తెగువతో కోవిడ్‌ వార్డులోకి వెళ్లి, చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడడంతో వారంతా హర్షాతిరేకాు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేు ఆరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పమెలా, కుడా చైర్‌ పర్సన్‌ మర్రి యాదవ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, డిసిసిబి చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు తదితయి పాల్గొన్నారు.

టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు
వరంగల్‌ నగరంలో నాలాపై ఆక్రమణు తొగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు ఛైర్మన్‌గా, పోలీస్‌ కమిషనర్‌ కో ఛైర్మన్‌ గా, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, జ వనరు శాఖ ఎస్‌ఇ, వరంగల్‌ అర్బన్‌ ఆర్డీవో, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఎస్‌ఇ సభ్యుగా ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ కమిటీనీ నియమిస్తూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి  అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వు జారీ చేశారు.

Other Updates