కెడిఎక్స్‌ సంస్ధ చైనా దేశంలో స్టాక్‌ మార్కెట్‌ లో లిస్ట్‌ అయిన ఒక ప్రఖ్యాత ఎలక్రానిక్స్‌ తయారీ సంస్ధ. ఏప్రిల్‌ 15న బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు సమక్షంలో కెడిఎక్స్‌ సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో యంవోయుని కుదుర్చుకున్నది. ప్రపంచంలో కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను తయారుచేసే ఏకైక సంస్ధ కెడిఎక్స్‌ అనీ, ఈ సంస్ధ ఇప్పటి ఇలాంటి సదుపాయాలు కలిగిన మొబైల్‌ ఫోన్‌ని తయారు చేసిందని సంస్ధ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. దీంతో పాటు మొబైల్‌ పోన్లు, ట్యాబ్లెట్ల తయారీ రంగంలోనూ కెడిఎక్స్‌ ప్రముఖ సంస్ధగా ఉన్నదని, తమ సంస్ధ ఫిలిప్స్‌, డాల్బీ 3డి వంటి ప్రముఖ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్ధలతోనూ కలిసి పని చేస్తుందని ప్రతినిధులు తెలియజేశారు.

వినోద పరిశ్రమ అవసరాల కోసం వాడే ఫిల్మ్‌ తయారీలో ప్రపంచ నంబర్‌ వన్‌ సంస్ధ 3వీ కంపెనీ తర్వతి స్థానంలో తాము ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది తమ సంస్ధ 1.2 బిలియన్‌ డాలర్ల రెవెన్యూని సాధించిందని, గ్రూప్‌ విస్తరణలో భాగంగా తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. మంత్రితో సమావేశానంతరం సంస్ధ ప్రతినిధులు నగరంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

కెడిఎక్స్‌ తోపాటు యంవోయూలో భాగస్వామి ERIES EPICA గ్రూప్‌ కి 15 దేశాల్లో 45 కంపెనీలున్నాయని తెలిపింది. KDX- ERIES EPI జాయింట్‌ గ్రూప్‌ భాగసామ్య సంస్ధ తెలంగాణలో అందుబాటులో ఉన్న నిఫుణులు, ఐటి పరిశ్రమ ముఖ్యంగా కనెక్టివిటి సౌకర్యాల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరాన్ని పెట్టుబడులకి ఎంచుకున్నట్లు తెలిపింది. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటి పార్కులు, ఐటి సెజ్‌ లు సైతం తమ భవిష్యత్తు పెట్టుబడులకి ఊతం ఇస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణలో అద్దాలులేని 3డి తెరలు, మొబైల్‌ పోన్లు, టివి వంటి ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలను తయారు చేయనున్నట్లు KDX – ERIES EPICA సంస్ధ యంవోయూలో పెర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ భాగసామ్యం ద్వారా పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్ధమని తెలిపింది.

ఎలక్ట్రానిక్స్‌, గేమింగ్‌ కంటెట్‌, మెబైల్‌ తయారీ రంగాల్లోని ప్రముఖ సంస్ధతో యంవోయూ కుదుర్చుకోవడం పట్ల మంత్రి కె. తారక రామరావు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం వల్ల అనేక అంతర్జాతీయ స్ధాయి కంపెనీలు నగరానికి వస్తున్నాయని, ఇదే వరుసలో KDX తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నదని మంత్రి తెలిపారు. KDX పెట్టుబడులకి హైదరాబాద్‌ సరైన గమ్యస్ధానమన్న మంత్రి, కంపెనీ సేవలకి కావాల్సిన మెబైల్‌ తయారీ సదుపాయాలు, గేమింగ్‌ మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ప్రత్యేక మొబైల్‌ తయారీ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ మొబైల్‌ తయారీ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇక వినోద పరిశ్రమ కోసం గేమింగ్‌ సిటీ నిర్మాణం త్వరలో ప్రారంభంకాబోతున్నదని, దేశంలోనే రెండో అతి పెద్ద సినిమా పరిశ్రమ తెలుగు పరిశ్రమనే నని మంత్రి KDX ప్రతినిధులకి తెలిపారు.

ప్రంపచంలోనే మెదటిసారి త్రిడి తెరతో మొబైల్‌ తయారు చేస్తున్నామన్న KDX సంస్ధ ప్రతినిధులు మంత్రికి తమ మొబైల్‌ పోన్‌ (ఇంకా మార్కెట్‌ లోకి విడుదల చేయకముందే) బహుకరించారు. అందులో ఉన్న త్రీడీ వీడియోలను ఎలాంటి కళ్లద్దాలు లేకుండానే చూడవ చ్చని మంత్రి తెలిపారు. KDX సంస్థ రూపొందిచిన మోబైల్‌ని వీక్షించిన మంత్రి వారికి ప్రోడక్ట్‌ విజయవంతం అవుతుందని, ఇలాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే KDX సంస్ధకి పూర్తి సహాయ సహకారాలుంటాయని హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో వీణ వెంటక్‌ నర్సింహ రెడ్డి, ఐటి శాఖ ఏలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌లు పాల్గొన్నారు.

Other Updates