దశాబ్దాల అవస్థలకు శాశ్వత విముక్తి.. గ్రామాల్లో వెల్లివిరిసిన సమైక్య స్ఫూర్తి
పచ్చదనం – పరిశుభ్రతలో నవ చరిత్రకు నాంది
-గటిక విజయ్ కుమార్
ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణ.
12 రోజుల్లో మనఊరు-మన ప్రణాళిక రూపకల్పన.
15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతుల జారీ.
మూడు నెలల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు జరపడం.
వంద రోజుల్లో భూ రికార్డులను ప్రక్షాళన చేయడం.
ఆరు నెలల్లో విద్యుత్ కోతలకు చరమగీతం పాడడం.
11 నెలలలో భక్త రామదాసు ప్రాజెక్టు, 11 నెలలలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తిచేయడం.
42 నెలల్లో కెటిపిఎస్ పవర్ ప్లాంటు నిర్మించి విద్యుత్ ఉత్పత్తి చేయడం.
మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.
ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తిచేసి సురక్షిత మంచినీళ్లివ్వడం.
ఇలా నిర్ణీత కాలవ్యవధిలోనే అనేక భారీ లక్ష్యాలు పూర్తి చేసి, దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, తాజాగా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన బహత్తర కార్యక్రమం ‘పల్లె ప్రగతి’ దిగ్విజయమయింది.
ఏ కార్యక్రమమైనా కేవలం ప్రభుత్వ పనిలా కాకుండా ఓ ప్రజా ఉద్యమంలా సాగితే వందకు వంద శాతం ఫలితమొస్తుందనడానికి ఇదే ఓ ప్రబల నిదర్శనం.
తెలంగాణ పల్లెల్లో పచ్చదనం పెరగాలని, పరిశుభ్రత వెల్లివిరియాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ పేరుతో సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలయింది. ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ గ్రామంలో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం విస్తతపరిచిన గ్రామ పంచాయతీని పూర్తి
స్థాయిలో వ్యవస్థీకరించుకోవడంతో పాటు, గ్రామాభివద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకోవడం, డంపింగ్ యార్డులు – స్మశాన వాటికల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించడం తదితర పనుల కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది.
ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ గ్రామ సభ నిర్వహించుకోవడం, గ్రామాభివద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం, చేయీ చేయీ కలిపి శ్రమదానం చేయడం లాంటి పనులు జరిగాయి. ఎవరి గ్రామాన్ని బాగు చేసుకోవడానికి ఆ గ్రామ ప్రజలే నడుం బిగించాలనే స్ఫూర్తి ప్రజల్లో ఏర్పడింది. ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రతీ ఏటా మూడు సార్లు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామాభివద్ధికి ఆర్థిక ప్రేరణ
ప్రజల్లో వచ్చిన స్పందన చూసిన తర్వాత గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఇకపై ప్రతీ నెలా క్రమం తప్పకుండా నెలకు రూ.339 కోట్ల చొప్పున విడుదల చేయాలని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నది. గ్రామాభివద్ధి, పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసరమైన చోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతీ జిల్లా కలెక్టర్ కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులను ప్రభుత్వం అందించింది. ఈ నిధులు కలెక్టర్లు తమ విచక్షణతో వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.
30 రోజుల్లో జరిగిన పని
- రాష్ట్రంలోని 12,748 గ్రామాల్లో సమస్యలను గుర్తించేందుకుగాను పాదయాత్రలు నిర్వహించి, గ్రామ వార్షిక ప్రణాళికలు తయారు చేశారు. మరో 3 గ్రామాల్లో రూపొందించాల్సి ఉంది.
- ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీల్లో మొత్తం 8,20,727 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో 4,03,758 మంది మహిళలు సభ్యులుగా ఎంపికయ్యారు.
- ఇండ్లు, ఖాళీస్థలాల్లో శిథిలాల తొలగింపు, పారిశుధ్య పనుల నిర్వహణ కోసం 1,24,837 ప్రదేశాలను గుర్తించి, వీటిలో 1,09,784 చోట్ల (87.94 శాతం) పనులు పూర్తి చేశారు.
- పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మ తొలగింపు కోసం 2,77,657 ప్రదేశాలను గుర్తించి, వీటిలో 2,67,535 చోట్ల (96.35 శాతం) పనులు పూర్తి చేశారు.
- పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు 1,07,288 ఖాళీ ప్లాట్లు, కమ్యూనిటీ స్థలాలను గుర్తించి, వీటిలో 99,770 చోట్ల (92.98 శాతం) పారిశుధ్య పనులు పూర్తి చేశారు.
- వివిధ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న 22,167 బావులను గుర్తించి, వీటిలో 16,380 (73.89 శాతం) బావుల్ని పూడ్చివేశారు. వీటితోపాటు 11,065 పనికిరాని బోరుబావులను గుర్తించి, వీటిలో 9,888 (89.36శాతం) బోరు బావుల్ని పూడ్చి వేశారు.
- గ్రామాల్లో 68,862 పల్లపు ప్రాంతాల్ని గుర్తించి, వీటిలో 64,540 (93.72శాతం) చోట్ల చదును చేశారు.
- 62,723 ప్రదేశాల్లో రోడ్లు, గుంతల్లో నీరు నిలిచినట్లు గుర్తించి, వీటిలో 58,856 చోట్ల (93.83శాతం) నీరు నిల్వకుండా మరమ్మతు పనులు చేశారు.
- మొత్తం 1,30,775 ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, వీటిలో 1,25,791 చోట్ల (96.19శాతం) బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లించారు.
- 82,804 ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్ వాడీ కేంద్రాలు మొదలైనవి అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, వీటిలో 80,420 సంస్థలను (97.12శాతం) శుభ్రం చేశారు. మొత్తం 29,25,390 మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నారు.
- ఇప్పటివరకు 10,870 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామాలు, స్మశాన వాటికల ఏర్పాటు కోసం స్థలాలు అవసరమని గుర్తించి, మరో 1881 గ్రామ పంచాయతీల్లో గుర్తించాల్సి ఉంది.
- డంప్ యార్డుల కోసం 11,211 గ్రామ పంచాయతీల్లో స్థలాలను గుర్తించారు. మరో 1,540 గ్రామాల్లో గుర్తించాల్సి ఉంది.
- మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో 12,750 గ్రామాలు హరితహారం ప్రణాళికను సిద్ధం చేశాయి. వీటిలో 12,292 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి.
- 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 732.14 లక్షలు(7.32 కోట్ల) మొక్కలను వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో నాటారు.
- గ్రామపంచాయతీ రోడ్లు,కూడళ్ళ వద్ద 24,244 కి.మీ.ల పొడవునా 80.88 లక్షల మొక్కలను నాటారు.
- గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో 40,522 కి.మీ. విస్తీర్ణంలో 260.48 లక్షల మొక్కలను నాటగా, ఇంటి ఆవరణలో నాటేందుకు 226.62 లక్షల మొక్కలను పంపిణీ చేశారు.
- గ్రామాల్లోకి వచ్చిన కోతులను అడవులబాట పట్టించేందుకు ఉద్దేశించిన మంకీ ఫుడ్ కోర్టులను 1063 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
విద్యుత్ శాఖ నెంబర్ వన్
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో విద్యుత్ శాఖ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిందని సిఎం కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు. విద్యుత్ శాఖ సిబ్బంది 30 రోజుల కార్యాచరణ ముగిసినప్పటికీ, ఇంకా గ్రామాల్లో పనులు చేస్తూనే ఉన్నారని అభినందించారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి నుంచి గ్రామాల్లో విద్యుత్ సంబంధ సమస్యలు ఉంటున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటి దాకా ఇంత పెద్ద ప్రయత్నం జరగలేదన్నారు. విద్యుత్ అధికారులు,
ఉద్యోగులు, కార్మికులను సిఎం అభినందించారు. నిర్ధేశించిన పనుల్లో ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తి చేసిన విద్యుత్ శాఖ, మిగతా పనుల కోసం ఇప్పటికీ గ్రామాల్లో విధులు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు.
విద్యుత్ శాఖ చేసిన పని ఇదీ
- 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ శాఖ గ్రామాల వారీగా పవర్ వీక్ నిర్వహించింది.
- వంగిన, తుప్పు పట్టిన సంభాలు 1,67,154 ఉన్నట్లు గుర్తించారు. వంగిన వాటిని సరిచేశారు. తుప్పు పట్టిన వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేశారు. రెండు పోళ్ల మధ్య దూరం ఉండడం వల్ల వైర్లు వేలాడ కుండా, అక్కడ మరో స్తంభం వేస్తున్నారు.
- గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ కోసం 6,834 కిలోమీటర్ల మేర కొత్త వైరు వేస్తున్నారు.
- వీధిలైట్ల కోసం ఏర్పాటు చేసిన 7,527 కరెంటు మీటర్లు పాడైపోయినందున, వాటి స్థానంలో కొత్త మీటర్లు మిగిస్తున్నారు.
- వీధిలైట్ల నిర్వహణ కోసం కొత్తగా 2,54,424 కరెంటు మీటర్లు బిగిస్తున్నారు.
ఎస్టీ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు కోసం కమిటి
ఏజన్సీ ప్రాంతాలతో పాటు, ఇతర ఎస్టీ తండాలు, గూడేలున్న ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పరిష్కరించడానికి ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ నియమించారు. సోమేశ్ కుమార్, రఘునందన్ రావు, అజయ్ మిశ్రా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
రాష్ట్రంలో ప్లాస్టిక్ పై నిషేధం
పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే మంత్రివర్గం సమావేశంలో చర్చించి, ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన విధానాలు తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివద్ధి : సిఎం కేసీఆర్
30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో జరిగిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 10న ప్రగతి భవన్లో విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు, డిపివోలు, డిఎల్పివీలు పాల్గొన్న ఈ సమావేశంలో గ్రామాల అభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామాల అభివద్ధి ఇకపై ప్రణాళికా బద్ధంగా జరగాలని, గ్రామసభలు ఆమోదించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగానే పనులు చేయాలని సిఎం ఆదేశించారు.
”30 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్ధేశించిన పనులు చాలా వరకు జరిగాయి. స్మశాన వాటికలు, డంపు యార్డులు, నర్సరీల ఏర్పాటుకు చాలా గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మిగిలిన గ్రామాల్లో కూడా వీలైనంత తొందరలో స్థలాలను గుర్తించాలి. ఏ శాఖ పరిధిలో ఉన్నా సరే, ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సామాజిక అవసరాల కోసం వాడుకోవాలి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు కూడా తయారయ్యాయి. గ్రీన్ ప్లాన్ కూడా సిద్ధమయింది. దానికి అనుగుణంగా పనులు జరగాలి. గ్రామ పంచాయతీలు చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనుక్కోవాలి. ప్రతీ ట్రాక్టర్కు ట్యాంకర్, ట్రాలీ, ఫ్రంట్ బ్లేడ్ ఉండాలి. గ్రామాభివద్ధి పనులను పర్యవేక్షించే డిపిఓ, డిఎల్పీవో, ఎంపిఓలకు క్రమం తప్పకుండా అలవెన్సులు అందించాలి. ప్రతీ గ్రామంలో విధిగా నర్సరీ నిర్వహించాలి. మేకలు, ఇతర పశువులు మొక్కలను తినకుండా కంచె ఏర్పాటు చేయాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.