‘ఊహ తెలిసినప్పటినుంచి 52వ ఏట వరకు డాక్టర్‌కు నా చెయ్యి ఇయ్యలే. నాకోసం నేను ఆస్పత్రికి వెళ్ళవలసిన అవసరం రాలే. తెలంగాణ ఉద్యమ సమయంలోనే బీ.పి. వచ్చింది. ఎక్కువగా ఆలోచించేవారికి, టెన్షన్ ఉండేవారికి బీపీ వస్తది. బీపీ మాత్రలు వాడాలని డాక్టర్లు అంటే వాడుతున్న’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తన ఆరోగ్య రహస్యం వెల్లడిరచారు.
‘‘నా జీవితంలో అత్యధిక కాలం టెన్షన్ లేకుండానే గడిపాను. అందువల్ల బీ.పి.కూడా వచ్చే అవకాశంలేదు. ఎప్పుడూ బి.పి.కూడా పరీక్షించుకోవలసిన అవసరం రాలేదు. ఏ చిన్న అనారోగ్యంవల్ల కూడా ఎప్పుడూ డాక్టర్‌ను సంప్రదించడం, లేదా ఆస్పత్రికి వెళ్ళవలసిన అవసరం రాలేదు. తెలంగాణ సాధనకోసం సాగించిన ఉద్యమ సమయంలో, ముఖ్యంగా నిరాహారదీక్ష చేసిన సమయంలో బీ.పీ. పరీక్షించవలసి వచ్చింది’’ అని సీఎం చెప్పారు.
‘‘మీకు మధుమేహం ఉందా?’’ అని ఒకరు ప్రశ్నించగా ‘‘అదంటే ఏందో కూడా నాకు తెలియదు’’ అని నవ్వుల మధ్య సమాధానమిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ‘స్టార్’ ఆస్పత్రిలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ అండ్ ట్రామా, కీళ్ళ మార్పిడికేంద్రం, ఇ.ఎన్.టి. నూతన విభాగాలను డిసెంబరు 11న ముఖ్యమంత్రి ప్రారంభించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ మహానగరం ఆరోగ్య సేవల కేంద్రంగా పేరు పొందిందని ఆయన అన్నారు. విదేశీయులు సైతం హైదరాబాద్ నగరానికి వచ్చి వైద్య సేవలు పొందడం మనకు గర్వకారణమన్నారు.
హోం
»