మన ప్రాజెక్టులు:

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

నల్లగొండ జిల్లా కరువు పీడిత, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు నీరు, తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్‌ ను ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1970 లోనే బచావత్‌ ట్రిబ్యూనల్‌ కు శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు నీటి కేటాయింపుల కోసం నివేదించింది. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కింద రాని నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ ప్రతిపాదనను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉదతంగా సాగుతున్న కాలం. ఆ ఉద్యమాన్ని నీరు కార్చడానికి వ్యూహాత్మకంగా ఈ ప్రతిపాదన చేసినట్టుగా ఆనాటి పత్రాలను పరిశీలిస్తే తెలుస్తుంది. 1973 నాటికి ఉద్యమం విద్రోహానికి గురి అయ్యింది. ఇక ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. 1973 లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బచావత్‌ ట్రిబ్యూనల్‌కు మరొక పత్రాన్ని సమర్పించింది. అందులో కష్ణా డెల్టా, కె సి కాలువ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతనే శ్రీశైలం ఎడమగట్టు కాలువను పరిశీలనలోనికి తీసుకోవాలని కోరినారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువపై ఉమ్మడి ప్రభుత్వం శీతకన్ను వేయడంతో బచావత్‌ ట్రిబ్యూనల్‌ ఈ ప్రాజెక్టుకు ఎటువంటి నీటి కేటాయింపులు చేయలేదు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కోరినట్టు కష్ణ డెల్టాకు 181 టిఎంసి లు, కె సి కాలువకు 39.90 టిఎంసిల కేటాయింపులు జరిగినాయి. ఇది శ్రీశైలం ఎడమగట్టు కాలువకు ఉమ్మడి ప్రభుత్వం యొక్క వెన్నుపోటు చరిత్ర.

నల్లగొండ జిల్లాకు కృష్ణా నది మాత్రమే సాగునీటికైనా, తాగునీటికైనా ఆధారం. అయితే గ్రావిటీ మార్గాన నీరు అందించే పరిస్థితి లేదు. ఆమ్రాబాద్‌ కొండల వరుస కారణంగా శ్రీశైలం నుండి గాని, నాగార్జునసాగర్‌ నుండి కాని గ్రావిటీ మార్గాన నీరు అందే పరిస్థితి లేదు. నల్లగొండ జిల్లా ప్రజలు పోరాడగా పోరాడగా ప్రభుత్వం 1979 లిఫ్ట్‌ స్కీమును ప్రతిపాదించింది. నాగార్జునసాగర్‌ జలాశయం వెనుక తట్టు నుంచి నీటిని ఎత్తిపోయడానికి ఒక పథకం సర్వేకు మరియు ఒక హై లెవెల్‌ కాలువ సర్వేకు ప్రభుత్వం 1979 ఆగస్టు 7న జి.ఒ. 315 ద్వారా పరిపాలన అనుమతిని ఇచ్చింది. 1981 లో శ్రీశైలం ఎడమ కాలువ పథకానికి సమగ్ర సర్వే కోసం జీ ఓ 342 ద్వారా 1981 ఆగస్టు 1న మరొక ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల ఎగువ భూములకు సాగునీరు అందించడం, దారి పొడవున గ్రామాలకు తాగు నీరు అందించడం ఈ పథకం లక్ష్యం.

గ్రావిటీ స్కీములో శ్రీశైలం జలాశయం నుండి 50 కి మీ టన్నెల్‌ తవ్వి 25 కి మీ వద్ద కామన్‌ పాయింట్‌ వద్దకు నీటిని తీసుక వస్తారు. లిఫ్ట్‌ స్కీములో నాగార్జున సాగర్‌ జలాశయం నుండి పుట్టంగండి పంప్‌ హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి అక్కంపల్లి జలాశయానికి నీటిని పంపుతారు. గ్రావిటి కాలువ 25 వ కి మీ వద్ద కామన్‌ పాయింట్‌ కు చేరుస్తారు. ఈ కామన్‌ పాయింట్‌ తర్వాత 46 కి మీ పొడవు కలిగిన గ్రావిటీ కాలువ తవ్వకానికి ప్రభుత్వం జీ ఒ 368 ద్వారా 1983 సెప్టెంబర్‌ 1న రు.1640.50 లక్షలకు పరిపాలనా అనుమతిని ఇచ్చింది. 1990లో టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం ద్వారా గ్రావిటీ టన్నెల్‌ తవ్వకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో ఈ టన్నెల్‌ తవ్వకం వలన సంభవించే పర్యావరణ ప్రభావాలను అధ్యయనం చెయ్యడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక రు. 1060 కోట్లకు రూపొందించి కేంద్ర జల సంఘానికి సమర్పించినారు. పోలవరం ద్వారా కష్ణా డెల్టాకు తరలించే 80 టిఎంసి ల నీటిలో కష్ణా బేసిన్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ వాటా కింద వచ్చిన 45 టిఎంసిల నుండి 30 టిఎంసిలను శ్రీశైలం ఎడమగట్టు కాలువకు కేటాయిస్తామని ఆ నివేదికలో ప్రతిపాదించినారు. ఆనాటికి పోలవరం ప్రాజెక్టుకు అనుమతి రానందున ప్రాజెక్టు నివేదికను తిప్పి పంపుతూ పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు జారీ అయిన తర్వాతనే శ్రీశైలం ఎడమగట్టు కాలువ డిపిఆర్‌ ను పంపాలని కేంద్ర జలవనరుల సంస్థ తెలిపింది.

గ్రావిటీ పథకమా? ఎత్తిపోతల పథకమా? అన్న చర్చలో అయిదేండ్ల కాలం గడిచిపోయింది. మరో వైపు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుతో శ్రీశైలం కుడి కాలువ (SRBC) పథకాన్ని జతకలిపి ప్రపంచ బ్యాంకురుణం కోసం ఉమ్మడి ప్రభుత్వం నివేదికను సమర్పించింది. ఉత్తర తెలంగాణలో ఉన్న గోదావరి బేసిన్‌ ప్రాజెక్ట్‌ ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి తో తెలంగాణకు సంబందం లేని ఎస్‌ ఆర్‌ బి సి ని జత కలపడం ఎందుకు? ఎస్‌ ఆర్‌ బి సికి స్వంతంగా బి సి రేషియో (Benefit Cost Ratio) రాదు కనుక. కాని తెలంగాణ జిల్లా, కరువు జిల్లా, ఫ్లోరైడ్‌ ప్రభావిత జిల్లాకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని సమైక్య ప్రభుత్వాలు చర్చల పేరు మీద కాలహరణం చేసినాయి.

జిల్లాలో తాగునీటి కోసం, సాగునీటి కోసం జల సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం అయినాయి. దీనికి పరాకాష్ట 1996 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భం. 1996 లోక్‌ సభ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 500 లకు పైగా రైతులు, సామాన్య ప్రజలు నామినేషన్లు వేసి నీటి సమస్యను దేశం దష్టికి తీసుకుపోయారు.

వారి పోరాటం ఫలితంగా సమైక్య ప్రభుత్వం లిఫ్ట్‌ పథకం ద్వారా సత్వరమే నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 టిఎంసిల కష్ణ అదనపు జలాలను ఈ ప్రాజెక్టుకు కేటాయించినారు. ఈ ప్రాజెక్టును నాశనం చేయాడానికి ఆనాటి ఆంధ్రా ప్రభుత్వ సలహాదారులు అనేక అడ్డంకులు సష్టించినారు. అయితే నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు నర్రా రాఘవరెడ్డి, బద్దు చౌహాన్‌, నంద్యాల నరసింహారెడ్డి, ఉజ్జిని నారాయణరావు, మదర్‌ డైరీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తదితరుల చొరవ కారణంగా 100 మీ ఒకటే లిఫ్ట్‌ తో, నాగార్జున సాగర్‌ జలాశయం నుండి 510 మీ వద్ద నుంచే నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. ఇందులో శ్యాంప్రసాద్‌ రెడ్డి, పెంటారెడ్డి లాంటి తెలంగాణ ఇంజనీర్లు ప్రాజెక్టును ఇప్పటి రూపంలో నిర్మాణం కావడానికి శక్తి వంచన లేకుండా కషి చేసినారు. ఆంధ్రా కుట్రదారుల నుంచి ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడినారు. ఎట్టకేలకు 2001లో లిఫ్ట్‌ స్కీము పనులు ప్రారంభం అయినాయి. 2004లో పుట్టంగండి వద్ద పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 18 మెగావాట్ల 4 పంపులతో నీటిని లిఫ్ట్‌ చేయడం ప్రారంభమయ్యింది. ఒక్కొక్క పంపు 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. ఆ తర్వాత శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకానికి నల్లగొండ జిల్లా దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేసినారు.

ప్రాజెక్టు స్వరూపం-ప్రయోజనాలు :

ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్ట్‌ ద్వారా ప్రతిపాదించిన ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 15 మండలాల్లో 1,09,250 హెక్టార్లకు(2.70 లక్షల ఎకరాలు) సాగునీరు అందించడం. దారి పొడవున 516 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు అందించడం. ఎత్తిపోసే మొత్తం నీటి పరిమాణం 30 టి ఎం సి లు. 18 మెవా సామర్థ్యం కలిగిన 4 పంపులు. ఒక్కొక్క పంపు డిశ్చార్జ్‌ సామర్థ్యం 600 క్యూసెక్కులు.

ఈ లిఫ్ట్‌ స్కీములో రెండు కాలువలను

1) ఎగువ కాలువ (High Level Canal)

2) దిగువ కాలువ (Low Level Canal) ప్రతిపాదించినారు.

ఎగువ కాలువ (High level canal) :

ఎగువ కాలువ 233 మీ (765 అడుగుల) ఎత్తు వద్ద ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా 2004 నుండి నీటి సరఫరా జరుగుతున్నది. 2013-14 ఖరీఫ్‌ కాలంలో 1.69 లక్షల ఎకరాలకు నీరు అందించడం జరిగింది. రబి కాలంలో 1 లక్ష ఎకరాలకు నీరు అందించడం జరిగింది. నాగార్జున సాగర్‌ నుండి. 510 అడుగుల వద్ద నుండి నీటిని ఒకే లిఫ్ట్‌ ద్వారా 100 మీ ఎత్తిపోసి అక్కంపల్లి జలాశయానికి తరలిస్తారు. అక్కంపల్లి జలాశయం నుండి వాలు కాలువ ద్వారా ఆయకట్టుకు, చెరువులకు నీరు అందుతుంది. 800 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన 4 పంపులను ఈ పథకంలో ఏర్పాటు చేసారు. అక్కంపల్లి జలాశయం నుండే హైదరాబాద్‌ నగరానికి తాగునీరు కూడా సరఫరా అవుతుంది.

దిగువ కాలువ (Low level canal) :


దిగువకాలువ 177.30 మీ (583 అడుగుల) ఎత్తు వద్ద ప్రయాణిస్తుంది. దిగువ కాలువ ద్వారా 50000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. 2007 లో ప్రారంభం అయినప్పటికీ ఈ దిగువ కాలువ పనులు ముందుకు సాగలేదు. కాలువకు, పంపు హౌజ్‌కు అవసరమైన భుసేకరణపై

ఉమ్మడిప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగా వీటి పనులు నత్తనడకన సాగినాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగువ కాలువ పనులు, పంప్‌ హౌజ్‌ పనులు త్వరిత గతిన పూర్తి అయినాయి. నవంబరు 2016లో నీటి సరఫరా ప్రారంభం అయ్యింది. ఏప్రిల్‌ 2018 వరకు రెండు దఫాలుగా నీటిని విడుదల చేసి 25 వేల ఎకరాల ఆయకట్టుకు, 15 చెరువులకు నేరరు సరఫరా చేయడం జరిగింది. ఆగస్టు 2018 లో ఖరీఫ్‌ పంటకు కూడా నీటిని విడుదల చేసినారు. ఈ సంవత్సరం రబీ పంటకు కూడా నీటి సరఫరా జరుగుతున్నది.

శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్‌ పథకం :

2005 లో ప్రభుత్వం గ్రావిటీ టన్నెల్‌ పథకాన్ని చేపట్టాలని భావించింది. అందుకు జీ ఒ 147 తేది 11-8-2005 న రు 2813 కోట్లకు పరిపాలనా అనుమతిని ఇచ్చింది. టన్నెల్‌ పథకంలో ప్రతిపాదించిన పనులు ఈ విధంగా

ఉన్నాయి.

  •  శ్రీశైలం డ్యాంకు సుమారు 4 కి.మీ దూరంలో జలాశయం శిఖం నుండి హెడ్‌ రెగ్యులేటర్‌ ని నిర్మించడం
  •  43.931 కి మీ పొడవు , 9.2 మీ వ్యాసం కలిగిన టన్నెల్‌-1 ను డిండీ వ్యాలీ దాకా తావ్వడం
  •  7.64 టి ఎం సి ల నిల్వ సామర్థ్యం కలిగిన డిండీ బ్యాలెన్సింగ్‌ జలాశయాన్ని రెండు టన్నెల్‌ ల మధ్యన నిర్మించడం.
  •  7.121 కి మీ పొడవు , 8,75 మీ వ్యాసం కలిగిన టన్నెల్‌ -2ను డిండీ వ్యాలీ నుండి పెద్దవాగు వ్యాలీ వరకు తవ్వడం.
  • శ్రీ టన్నెల్‌ -2 చివరి నుంచి ఎగువ కాలువ కామన్‌ పాయింట్‌ దాకా (25వకి.మీ.) గ్రావిటీ కాలువ తవ్వకం.
  •  ప్రస్తుతమున్న పెండ్లిపాకల బ్యాలెన్సింగ్‌ జలాశయాన్ని ఎత్తు పెంచడం, బలోపేతం చెయ్యడం.

టన్నెల్‌ స్కీం పనుల పురోగతి :

టన్నెల్‌ -1 తవ్వకం మొత్తం 43.931కి.మీ. పొడవున్న టన్నెల్‌ తవ్వకం దాదాపు 33.21 కి మీ పుర్తి అయ్యింది. టన్నెల్‌-2 మొత్తం పొడవు (7.121 కి. మీ.) తవ్వకం పూర్తి అయ్యింది. టన్నెల్‌ లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి.

పనులు వెనుకబడటానికి కారణాలు :

అటవీ శాఖ సంబందిత సమస్యల వలనఏజెన్సీకి సైట్‌ ని అందించడలో దాదాపు రెండున్నర సంవత్సరాలు వ్యర్థం అయినాయి. సుప్రీం కోర్ట్‌ 24-10-2007 న టన్నెల్‌ ప్రాజెక్ట్‌ కు అనుమతినిచ్చింది. టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం నిలపడానికి పిట్‌ తవ్వకం మొదట 9 నెలల కాలంలో పూర్తి అవుతుందని భావించడం జరిగింది. కాని తవ్వకం జరుగుతున్న సందర్భంలో ఎదురవుతున్న భూ భౌతిక , సాంకేతిక సమస్యల కారణంగా 8,50,000 క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకానికి 19 నెలలు పట్టింది. ఆ తర్వాత టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం యొక్క అసెంబ్లింగ్‌ జూన్‌ 2009 లో మొదలయ్యింది. 2009 అక్టోబర్‌ లో క ష్ణా నదికి వచ్చిన అనూహ్య వరదల కారణంగా టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం పూర్తిగా మునిగిపోయింది. యంత్రాన్ని బాగు చేసుకొని తవ్వకం పనులు ప్రారంభించడానికి దాదాపు 21 నెలల కాలం హరించుకు పోయింది. టన్నెల్‌ -1 చివరన భూముల సేకరణ కోసం స్పెషల్‌ కలెక్టర్‌ జనవరి 2006 నుండి ఎప్రిల్‌ 2006 వరకు షెడ్యూళ్ళు సమర్పించడం జరిగింది. ఈ భూసేకరణ కారణంగా ఒక సంవత్సరం గడిచింది. జనవరి 2009నుండి జూన్‌ 2009 వరకు ఏజెన్సీకి బిల్లులు చెల్లించడలో జాప్యం జరిగింది. దానితో కాంట్రాక్టర్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు కుంటుపడినాయి.

పైన పేర్కొన్న జాప్యానికి కాంట్రాక్టర్‌ తరపు నుంచి ఎటువంటి కారణాలు లేవు కనుక డిసెంబరు 2014 వరకు కాంట్రాక్టు కాలాన్ని ప్రభుత్వం పొడిగించడం జరిగింది. మొదటి కాంట్రాక్టు కాలంలో 43,931 మీ కు గాను 7300 మీ మాత్రమే తవ్వడం జరిగింది. కాంట్రాక్టరు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యం, ధరల పెరుగుదల వలన 2005 సంవత్సరపు రేట్లు ఇప్పటి కాలపు రేట్లకు పెద్ద తేడా రావడంతో కాంట్రాక్టర్‌ మొత్తం మీద అక్టోబర్‌ 2014 వరకు కేవలం 16.754 + 7.300 = 24.053 కి మీ పొడవు టన్నెల్‌ తవ్వకం చేయగలిగినాడు. అగ్రిమెంట్‌ కాలానికి (ఆగస్ట్‌ 2014) రు 1185 నాటికి కాంట్రాక్టర్‌ చేసిన పని విలువ రు 587.25 కోట్లు. అక్టోబర్‌ 2014 వరకు చేసిన పని విలువ రూ.1185.38 కోట్లు. మొత్తం పని విలువ రూ.1925 కోట్లు. మొత్తం అయిన పని 62 శాతం.

తెలంగాణా రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పురోగతిని కూలంకషంగా సమీక్షించింది. కాంట్రాక్టర్‌ తన అర్థిక ఇబ్బందుల కారణంగా 150 కోట్ల అడ్వాన్స్‌ చెల్లించమని ప్రభుత్వానికి నివేదించినాడు. ఈ నివేదనను ప్రభుత్వ పరిశీలించి సానుకూలంగా స్పందించింది. 100 కోట్లను అడ్వాన్స్‌గా సమకూర్చింది. ఆ తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి.

అయితే టన్నెల్‌లో అనేక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందు ఊహించిన పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఊటలు రావటం, వదులుగా ఉండే భూగర్భ పొరల కారణంగా టన్నెల్‌ తవ్వకం అనుకున్నంత వేగంగా సాగటంలేదు. ఇంకా సుమారు 10.71 కి మీ సొరంగం తవ్వకం జరగవలసి ఉన్నది. ఈ పనులు 2020 నాటికి పూర్తవుతాయని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రాజెక్టు ప్రభావాలు :

ఎలిమినేటి ఎత్తిపోతల పథకం అద్భుతంగా విజయవంతం కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణాలో అనేక ఎత్తిపోతల పథకాలు రూపు దిద్దుకున్నాయి. ప్రత్యేక తెలంగాణా

ఉద్యమానికి జడిసి జె చొక్కారావు దేవాదుల, మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహర్‌ నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌, అలీసాగర్‌, అరుగుల రాజారాం గుత్ప, చౌటుపల్లి హనుమంతరెడ్డి, బి ఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ళ, పి వి నరసింహారావు కంతనపల్లి, సిలారు రాజనరసింహ సింగూరు, మంథని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(చిన్నకాళేశ్వరం), గూడెం తదితర ఎత్తిపోతల పథకాలను ఉమ్మడి ప్రభుత్వం చేపట్టక తప్పలేదు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అయి రైతాంగానికి సేవలు అందిస్తున్నాయి.

Other Updates