ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని, రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు. రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల జరిగే లాభనష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, రైతులను సంఘటిత పరచటం ద్వారానే గొప్ప ఫలితాలు సాధించవచ్చని, రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంటల కాలనీగా విభజించాలని సీఎం చెప్పారు. రైతు పండించే ప్రతి పంటకు డిమాండ్ లభించేలా చూడాలని, రాష్ట్రంలో నెలకొల్పబోయే పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వ పరంగా నమ్మకమైన, కల్తీరహిత బ్రాండెడ్ ఉత్పత్తులు జరగాలని, రైతులు నియంత్రణా విధానంలోనే పంటలు పండించాలని ముఖ్యమంత్రి అన్నారు.
వ్యవసాయ, ఉద్యానవన శాఖల మీద కోట్లాదిమంది అధారపడి వున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా ఆ శాఖలు పనిచేయాలని, దేశం మొత్తంలోనే ఉత్త మమైన వ్యవసాయ, ఉద్యానవన, పుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులలో తెలంగాణ అగ్రభాగాన వుండాలని సీఎం అన్నారు. రైతులను ఆదుకునే విషయంలోయావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చెప్పారు.
పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ తీరుతెన్నులపై, భవిష్యత్తులో అవలంభించాల్సిన విధానాలపై, మహిళా సంఘాలను పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులలో భాగస్వాములను చేయటంపై, తెలంగాణలోని వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ”ఈ సమీక్షా సమావేశం పుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన అంశాలపై ఒక అవగాహనకు రావటానికి ఏర్పాటయింది. దురదష్టవశాత్తు చాలా విషయాల్లో సరైన గణాంకాలు లేకపోవటంవల్ల, సరైన నిర్ణయానికి రావటం కష్టమవుతున్నది. ఈ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండుతుంది, ఎంతమేరకు పండ్ల ఉత్పత్తి జరుగుతున్నది, ఏ మేరకు ప్రజల ఆహార అవసరాలు తీరుతున్నవి? అనే విషయాలపై సరైన గణాంకాలు ఉండాలి. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, సంబంధిత ఇతర శాఖలు ఒకదానికి ఒకటి సంబంధ అనుబంధంగా పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి. దీనికొరకు ఎమి చేయాలో ఆలోచించాలి. దీని ద్వారా రైతుల్లో అశాంతి పూర్తిగా తొలిగిపోతుంది. దీనికి మొదటి అడుగుగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరిగింది. వాళ్లకు క్రమపద్ధతిలో శిక్షణనివ్వాలి. తరువాత వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగింది. భూమి లెక్కలు కూడా తేల్చటం జరిగినందున వ్యవసాయ అనుకూల భూమి ఎంతుందో తేలింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. ఇదంతా ఒక గొలుసుకట్టు కార్యక్రమంలాగా జరిగితే, తద్వారా వ్యవస్థ బాగుపడితే చాలామంచిది” అని సీఎం అన్నారు.
”రైతులందరూ ఒకే రకమైన పంట వేస్తే సమస్యలు తలెత్తుతాయి కనుక పంట మార్పిడి కొరకు వాళ్లకు అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంత మార్పు రావాలి. అందరు రైతులు ఒకే రకమైన పంట వేస్తే జరిగే లాభ నష్టాల మీద చర్చ జరగాలి. ముల్కనూరు గ్రామం అనుభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్ధతిలో రైతులను సంఘటిత పరచడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించడం జరిగింది. రైతులకు ఫలానా విధంగా నడుచుకుంటే లాభం కలుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు నమ్మకం కలిగించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాటిని ఢిల్లీలో కలిసి ఈ విషయాలలో వర్క్ షాప్ నిర్వహించాలని మన రాష్ట్రానికి ఆహ్వానించాను. త్వరలో ఆయన మన రాష్ట్రానికి వస్తారు” అని చెప్పారు సీఎం.
”రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలవాలె. మంచి మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణమైన పరిశోధనలు జరగాలె. అంతర్జాతీయ విపణిలో మన భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో వుండటం దురదష్టకరం. దీన్ని అధిగమించటానికి ప్రయత్నం జరగాలి.
”రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంట కాలనీలుగా విభజించాలి. రైతు పండించే పంటకు డిమాండ్ ఉండాలె. మన ఆహార అవసరాలేంటో తెలుసుకోవాలె. రైతాంగం ఏ పంటలు వేయడానికి అలవాటు పడ్డదో అర్థం చేసుకుని ఒకే సారి వాళ్లమీద మన అభిప్రాయాలను రుద్దకుండా అంచెలంచెలుగా పంట కాలనీల విషయంలో అవగాహన కలిగించాలె. గ్రామీణ ఆహార అవసరాలతో పాటు, నగర-పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగు విధంగా ఉత్పత్తులు జరగాలె. కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర లాంటివి కూడా దిగుమతులు చేసుకోవడం దురదష్టం. నగరాల-పట్టణాల దరిదాపుల్లో కూరగాయల పెంపకం జరగాలె. వచ్చే వానకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయి కోటి ఎకరాలకు పైగా సాగు నీరందుతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలె” అని అన్నారు సీఎం.
మొదటి అడుగుగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరిగింది. వాళ్లకు క్రమపద్ధతిలో శిక్షణనివ్వాలి. తరువాత వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగింది. భూమి లెక్కలు కూడా తేల్చటం జరిగినందున వ్యవసాయ అనుకూల భూమి ఎంతుందో తేలింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. ఇదంతా ఒక గొలుసుకట్టు కార్యక్రమంలాగా జరిగితే తద్వారా వ్యవస్థ బాగుపడితే చాలామంచిది”
”ఎటువంటి రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్ చేస్తే దాని ధర పెరుగుతుంది. ఉదాహరణకు మిరపకాయ నుండి కారంపొడి లేదా పసుపు కొమ్ముల నుండి పసుపు తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వస్తువు కొనాలన్నా కల్తీ అవుతున్నది. మనం గనక మార్కెట్లో ఒక బ్రాండ్ నేమ్ మన పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు అదీ ప్రభుత్వ పరంగా తయారైన వస్తువన్న నమ్మకం కలిగించాలె. దీనికొరకు పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రారంభించాలె. మన ఆలోచనలను కార్యరూపంలో తీసుకుని వచ్చి అమలు పరచాలె. ఏ ప్రాంతంలో ఎన్ని, ఏ రకమైన పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వుండాలో నిర్ణయించాలె. మన రాష్ట్ర అవసరాలకు సరిపోను మిగిలినవి పక్క రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయాలె. ఈ యావత్ ప్రక్రియలో ఐకెపి-మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలి.ఏ మేరకు వీరిని భాగస్వాములను చేయవచ్చో అధ్యయనం చేయాలి. 130 కోట్ల ప్రజలున్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్. ఏ రాష్ట్రంలో ఏది పండదో దాన్ని విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాటిని పండించ గలగాలి. తద్వారా పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను తయారు చేయాలి. దేశ విదేశాల్లో అత్యుత్తమమైన పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే విషయం అధ్యయనం చేయాలి” అని సీఎం చెప్పారు.
”రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలవాలి. మంచి మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణమైన పరిశోధనలు జరగాలి. అంతర్జాతీయ విఫణిలో మన భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో వుండటం దురదష్టకరం. దీన్ని అధిగమించటానికి ప్రయత్నం జరగాలి. ప్రతి గ్రామం ఆ గ్రామ ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలి. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు-పట్టణాలకు సరఫరా చేయాలి” అని సీఎం అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, గత నాలుగు సంవత్సరాల్లో సగటున 17.17 శాతం వద్ధిరేటును సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వద్ధిరేటు వుందని, జీఎస్డిపీలో ప్రథమ స్థానంలో వున్నామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్నీ విధాల మన పెరుగుదలకు అవకాశాలు న్నాయని, అందుకే మూస పద్ధతిలో ఆలోచించకుండా నూతన వరవడికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో జరిగిన చర్చల ప్రాతిపదికగా ఆలోచనలు పంచుకుని ఎలా ముందుకు పోవాలో నిర్ణయించాలని అధికారులను కోరారు.
ఇది సామూహిక ప్రయత్నం
పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బందాలతో పాటు పలువురిని ఇందులో భాగస్వాములను చేయాలని సీఎం చెప్పారు. తొలుత ఒక ఆరేడు మండలాలను పైలట్ పద్ధతిన తీసుకుని కార్యక్రమం ప్రారంభించాలని, ఆ తరువాత పెద్ద ఎత్తున ప్రారంభించొచ్చని సీఎం చెప్పారు. ఈ సమీక్ష ఆధారంగా అధికారులు వివిధ స్థాయిల్లో మేధో మధన కార్యక్రమాలను, వర్క్ షాపులను నిర్వహించాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరంగా పుడ్ ప్రాసెసింగ్లో అమలు పరుస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయాలని, అలానే అంతర్జాతీయ స్థాయి లో జరుగుతున్న పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదని, ఉత్తమ స్థాయి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన పూర్వ రంగంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అధ్యయనం చేసి రావొచ్చని సీఎం సూచించారు. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 45 లక్షల మంది సభ్యులున్న 4 లక్షలకు పైగా ఐకేపి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చెప్పారు.
పంట కాలనీల ఏర్పాటు, విత్తన కంపెనీల నియంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధం, విత్తనాలు విరివిగా అందుబాటులో వుంచడం, అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో వుంచడం జరగాలని చెప్పారు. నాటు యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకష్ణారావు, సీఎంఒ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితాసభర్వాల్, డిజీపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.