రాష్ట్రంలో సంపద పెంచాలి. పెంచిన సంపదను బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి వినియోగించాలి. ఇదీ మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయం. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందించి, ప్రజల అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని ప్రణాళికలను అమలుపరుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని విధాలా అన్యాయానికి, అలసత్వానికి, నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం అనంతరం అనేక రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది. పరిపాలనా దక్షత, ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి రహిత పాలన అందించడంలో ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఫలితంగా రాష్ట్ర సొంత ఆదాయ వనరులు గణనీయంగా అభివద్ధి చెందాయి. దేశంలోని 29 రాష్ట్రాలలో మరే రాష్ట్రానికి సాధ్యంకాని స్థాయిలో తెలంగాణ ఆర్థిక వద్ధిని సాధించింది. 2014-18 మధ్యకాలంలో వార్షికవద్ధిరేటు 17.17 శాతం కాగా, ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 29.93 శాతం సాధించింది. జీఎస్టీ వసూళ్ళలో కూడా మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజల కోణంలో, రాష్ట్ర ఆర్థికాభివద్ధిని మరింత బలోపేతం చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షిస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం పర్యటన, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన నేపధ్యంలో ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రజల జీవికను నిర్వచించుకొని, వారి అవసరాలను అన్నిరంగాలలో పరిశీలించిన మీదటే బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని ఆయన ఉన్నతాధి కారులకు సూచించారు. కేవలం ఈ ఏడాదికే కాకుండా, వచ్చే ఐదేళ్ళకు తగ్గట్టు అవగాహనతో , అంచనాలతో బడ్జెట్ రూపొందించాలన్నారు.
ప్రాజెక్టులకు పెద్దపీట వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చవుతుందనే అంచనా ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రానున్న ఐదేళ్ళ కాలానికి నీటిపారుదల శాఖకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కేంద్రం నుంచి అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు సాధించినందున బడ్జెట్‌లో వాటికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అక్కడి త్రివేణి సంగమం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ఈ దిశగా బడ్జెట్లో దష్టి కేంద్రీకరించాలని సి.ఎం చెప్పారు. విశ్వ విద్యాలయాల పరిశోధనలు, వ్యవసాయాన్ని నవీకరించడం, ఆహారశుద్ధి రంగానికి అవకాశాలు కల్పించడం పై విధి విధానాలు రూపొందించాలన్నారు.
గొర్రెల పంపిణీ ప్రజాదరణ పొందింది. చేపల పెంపకం, చేనేత రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తోంది. వారి కళను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. విద్యుత్ సగటు వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. బడ్జెట్ ప్రతిపాదనలలో ఈ అంశాలన్నీ పరిగణించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ పై బహత్తర ప్రణాళిక
విశ్వనగరంగా అభివద్ధిచెందుతున్న హైదరాబాద్ నగరం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశంలోని 5 ప్రధాన నగరాలలో ఒకటైన హైదరాబాద్ నగరంలో వంద పార్కులు ఉండాలి. భవిష్యత్తు తరాల కోసం బహత్తర ప్రణాళికను రూపొందించాలి. వచ్చే ఐదేళ్లలో ఈ నగరాన్ని ప్రపంచస్థాయికి ఏవిధంగా తీర్చిదిద్దనున్నామో బడ్జెట్ ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుండటం రాష్ట్రాభివద్ధికి సూచిక. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అవసరాలు దష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చెప్పారు.
కేంద్రం గుప్పిట్లో అధికారాలు
అధికారాలు, హక్కుల పంపిణీ విషయంలో కేంద్రప్రభుత్వం వివక్షతో రాష్ట్రాలను అగౌరవ పరుస్తోందని, రాష్ట్రాలకు అప్పగించాల్సిన అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకుందని, ప్రజావసరాలు గుర్తించలేని విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విమర్శించారు. దేశానికి విశాలమైన ఆర్థిక విధానం ఉంది. కానీ, అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయి. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాలలో జోక్యం చేసుకోవద్దని నీతి ఆయోగ్ సమావేశాలలో తాను స్పష్టంచేసినట్టు సి.ఎం తెలిపారు. రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలి. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచడం తగదని సి.ఎం పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సి.ఎం అన్నారు. ఆర్థిక సంఘం రాష్ట్రాలలో పర్యటించి, అక్కడి ప్రభుత్వాలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, పర్యటనకు ముందే విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఇది సరికాదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాంస్క తిక, ఆర్థిక జీవన విధానం ఉంటుంది. తెలంగాణ ప్రజావసరాలను దష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ నివేదిక రూపొందించాలని కె.సి.ఆర్ సూచించారు.
ఇప్పుడు రూపొందించే బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివద్ధిని మరింత బలోపేతం చేసే దిశగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.